చెప్పులను..చెప్పుడు మాటలను .. గుమ్మం దగ్గరే వదిలెయ్యాలి .. !!
" ప్రతి మనిషి వాస్తవాల కన్నా..పక్కవాడు చెప్పిందే ఎక్కువగా నమ్ముతాడు
..కళ్ళ ముందు కనిపిస్తున్న విషయాన్నీ కాకుండా..
ఎవరూ ఏదో చెప్పిన దాన్ని గురించి ఆలోచిస్తాడు ..
నువ్వు బాగా నమ్మిన ఒక విషయాన్నీ లేదా..
నువ్వు బలంగా తీసుకున్న నిరణయాన్ని..
నీ చుట్టూ ఉన్నవాళ్లు కొంతమంది ) మార్చడానికి లేదా
తప్పు అని నిరూపించడానికి ప్రయత్నిస్తారు ( కొంచం ఎక్కువగానే ) ..
నువ్వు కూడా తెలియకుండానే ఆ వైపు ఆలోచించడం మొదలుపెడ్తావు..
నీ మనస్సు వరకు తీసుకెళ్తావ్..అలా ఆలోచించడం ఎక్కువసార్లు నీకు నష్టాన్నే తీసుకురావొచ్చు ..
నేను చెప్పాలనుకున్న విషయం ఒక్కటే..నిన్ను పాడుచేసే ఆలోచనలని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది ...
నీపై నీకు నమ్మకం ఉంటే..
ఎవ్వరి మాటలను వినాల్సిన అవసరంలేదు ..
నీకు మంచి చేసే వాటి గురించి ఆలోచించు..
నీ దారి మార్చేసే వాటి గురించి అస్సలు ఆలోచించకు..
నీ వెంట తీసుకెళ్లకు .. !! "
ప్రపంచం లో సగానికి పైగా పక్కవాడి గురించి ఆలోచించడం వల్లే మనం వెనకపడిపోయం
పొద్దున మొదలు రాత్రి వరకూ ఇంకొకడి ఆలోచనలే తప్ప ని గురించి అలోచించి వుంటే
ఎప్పుడూ నీ జీవితం బాగుపడేది
ఇప్పటికైనా మనుకో....
Comments
Post a Comment