Skip to main content

నేటి మోటివేషన్... తల్లిదండ్రులపై కోపం వద్దు - ప్రేమే ముద్దు ❤❤

పెద్దలను అపార్ధం చేసుకోకండి అనిచెప్పే చిన్న‌ సంఘటన.. 

పూర్వము భారవి అనే కవి వుండేవాడు. ఆయన చిన్నతనం లోనే కవిత్వం చెప్పేవాడు. కావ్యాలు వ్రాసేవాడు. ఊర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు.

భారవి తండ్రితో నీకొడుకు చాలా బాగా వ్రాస్తాడయ్యా అనేవారు.

ఆయన మాత్రం వాడింకా చిన్నవాడు యింకా నేర్చు కోవలిసింది చాలా వుంది. ఏదో వ్రాస్తాడులే అనేవాడు.

భారవికి తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తి.

తల్లి దగ్గర, నాన్నగారు నన్ను తీసిపారేసినట్టు మాట్లాడుతారు.ఊర్లో వారంతా నన్ను మెచ్చుకుంటూ వుంటే తనేమో ఏమున్నది యింకా వాడు చిన్నవాడు అన్నట్టు మాట్లాడుతారు.అని చాలా సార్లు చెప్పుకున్నాడు.

ఎన్నాళ్ళయినా తండ్రి ధోరణి మారక పోయే సరికి భారవికి తండ్రిమీద కసి పుట్టింది, ఆయనను చంపాలని నిశ్చయించుకున్నాడు.

ఒకరోజు రాత్రి ఆయన వంటింట్లో భోజనం చేస్తున్నాడు..,భార్య వడ్డిస్తూ వుంది.

భారవి, ఆయన పెరట్లోకి చెయ్యి కడుక్కునేందుకు వస్తే చంపెయ్యాలని పెద్ద బండరాయి పట్టుకొని పెరట్లో ఒక పక్క కాచుకొని కూర్చున్నాడు.

అప్పుడు భారవి తల్లి., భర్తతో మీరెందుకు వాడిని అస్తమాను చిన్నబుచ్చినట్లు మాట్లాడుతారు? వాడు చాలా బాధ పడుతున్నాడు అన్నది. 
వూరు ఊరంతా వాడిని మెచ్చుకుంటూ వుంటే మీరు మాత్రం వాడికేమీ తెలీదని అంటారట !? 

అప్పుడు తండ్రి నవ్వి.... పిచ్చిదానా! నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా? తండ్రి పొగిడితే బిడ్డకు ఆయుఃక్షీణం అంటారు. అంతే కాకుండా పొగడ్త మనిషిని పాడు చేస్తుంది, వాడి అభివృద్ధికి ఆటంకమవుతుంది. ఇంకా ఎంతో పైకి రావలిసినవాడికి గర్వం పెరిగి తనంతవాడు లేడని విర్రవీగుతాడు, దానితో వాడి అభివృద్ధి ఆగిపోదా? అన్నాడు.

అదివిని భారవికి బుర్ర తిరిగి పోయింది.

పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. వెంటనే బండ అక్కడ పారవేసి లోపలికి వెళ్లి తండ్రి పాదాలమీద పడి భోరున ఏడ్చాడు.

తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి నాకేదయినా శిక్ష వేయమని బ్రతిమాలుకున్నాడు.

పశ్చాత్తాపం తో నీపాపం పోయింది! శిక్ష ఎందుకు? అని తండ్రి చెప్తున్నా వినకుండా తనకు శిక్ష వేయమని పట్టు బట్టాడు.

తండ్రి సరే అలాగయితే మీ అత్తవారింట్లో ఒక సంవత్సరం ఎవరికీ, చివరికి నీ భార్యకు కూడా ఎందుకు, ఏమిటి, ఏ కారణాలు చెప్పకుండా అక్కడ‌వుండి రా! అన్నాడు.

ఇంత చిన్న శిక్షనా? అన్నాడు భారవి.

తండ్రి నవ్వి అది చాల్లే వెళ్ళుఅన్నాడు.

భారవికి చిన్నతనంలోనే పెళ్లయింది. అప్పటికి యింకా భారవి భార్య కాపురానికి రాలేదు.

సరేనని భారవి అత్తగారి వూరికి వెళ్ళాడు.‌ వాళ్ళు అల్లుడుగారు వచ్చారని చాలా మర్యాద చేశారు.

రోజుకో పిండివంట చేసి ఆదరించారు.నెల రోజులు గడుస్తున్నా అల్లుడు వెళ్ళటం లేదేమని వాళ్ళు విసుక్కున్నారు.

చిన్న చిన్న పనులు చెయ్యమని చెప్పడం ప్రారంభించారు. మర్యాదలు తగ్గాయి. బావ మరుదులు పొలం పనులు కూడా పురమాయించారు.

అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు..

దేనికీ బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు.

అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు.భారవి భార్యకు చాలా బాధగా వుండేది. భర్తకు ఆవిడ మీరు మీ ఊరు వెళ్లిపోండని యెంతో చెప్పి చూసింది.

భారవి సమాధానం చెప్పకుండా మౌనం వహించే వాడు.

ఇలా సంవత్సరం గడిచింది. అప్పుడు భారవి యింక నేను మావూరికి పోయివస్తానని బయల్దేరాడు.

ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్లాలని అంటున్నాడో వాళ్లకు అర్థం కాలేదు.

భార్యకు, అత్తామామలకూ విషయం వివరించి నాశిక్ష పూర్తి అయింది అందుకని వెళుతున్నాను అని చెప్పాడు.

ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు.

భారవి తనతండ్రి వేసిన శిక్ష తనలో ఎంతో ఓర్పును, నేర్పును, సహనాన్ని, అవగాహనను పెంచాయని గ్రహించాడు.

తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి! మీ అభివృద్ధిని కోరుకునే వారిలో ఆయనే ప్రథముడు.

చిన్నప్పుడు తల్లి కోప్పడిందని, తండ్రి దండించాడని వారి మీద కోపం పెంచుకోకండి!

అదంతా మీరు బాగుపడాలనీ, వృద్ధి లోకి రావాలనీ చేసి వుంటారని గుర్తు పెట్టుకోండి!

తల్లిదండ్రులను ద్వేషించకండి! అంతకంటే పాపం ఇంకోటి వుండదు.


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

INDIAN HISTORY -(Telugu / English)

11. ఏ కాంగ్రెస్ సెషన్‌లో 'పూర్ణ స్వరాజ్' ప్రమాణం చేశారు? జ:  లాహోర్ సెషన్‌లో (1929) 12. అండమాన్ పర్యటనలో ఖైదీ ఏ వైస్రాయ్‌ని హత్య చేశాడు? జ: లార్డ్ మాయో 13. 'లిబరేటర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్' అని ఎవరిని పిలుస్తారు? జ: సర్ చార్లెస్ మెట్‌కాఫ్ మరియు లార్డ్ మెకాలే 14. భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? జ:  రాష్ బిహారీ ఘోష్ 15. బాలగంగాధర తిలక్‌ను భారత అశాంతికి పితామహుడిగా ఎవరు పిలిచారు? జ: వాలెంటైన్ చిరోల్ 16. 1904లో లండన్‌లో 'అభినవ్ భారత్'ను ఎవరు స్థాపించారు? జ:  వినాయక్ దామోదర్ సావర్కర్ 17. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? జ:  లార్డ్ చెమ్స్‌ఫోర్డ్ 18. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ మొదటి విజయవంతమైన సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? జ:  చంపారన్ లో 19. భారతదేశ రాజధాని కోల్‌కతా (కలకత్తా) నుండి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చబడింది? జ:  1911లో క్రీ.శ    20. డిసెంబరు 23, 1912న ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఊరేగింపుగా వెళుతున్న భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్‌పై బాంబులు విసిరిన వార...