Skip to main content

నేటి మోటివేషన్... ఒక అందమైన సందేశం


ఒక ధనవంతుడు కిటికీ లోంచి బయటికి తొంగి చూసాడు.....
 ఒక నిరుపేద చెత్త కుండిలోంచి చిత్తు కాగితాలు ఏరుకుంటు ఉండటాన్ని గమనించి, అతడన్నాడు
 "భగవంతుడా నేను పేద వాణ్ణి కానందుకు నీకు కృతజ్ఞతలు" అని.

 పేద వాడు చుట్టూ చుస్తూ, అర్ధనగ్నంగా ఒకడు వీధిలో యాచన చేస్తూ వెళ్ళటాన్ని గమనించి
 "ఓ భగవంతుడా నేను యాచకుణ్ణి కానందుకు ఎంతో కృతజ్ఞుడను "అని అన్నాడు.

 యాచకుడు అలా ముందుకు చూస్తూ అంబులెన్స్ లో ఒక రోగగ్రస్తుడిని తీసుకుని వెళ్తూవుండటం గమనించి ...."భగవంతుడా నేను రోగగ్రస్తుడిని కానందుకు నీకెంతో కృతజ్ఞుడిని"అని అన్నాడు....

 తరువాత ఆసుపత్రిలో ఆ రోగి తన ముందునుంచే ఒక శవాన్ని స్ట్రేచర్ పైన మార్చురీ లోనికి తీసుకొని పోతూ ఉండటాన్ని చూసి "భగవంతుడా నేను ఇంకా బ్రతికే ఉన్నందుకు మీకెంతో కృతజ్ఞుడిని " అని అన్నాడు.

 కానీ ఒక్క చనిపోయిన వాడు మాత్రమే భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేయలేడు.

 నీకు ఈ జీవితాన్ని కానుకగా ఇచ్చినందుకు ఇంతవరకు నీకు దీవెనలు అందిస్తున్నందుకు భగవంతుడికి నీవెందుకు కృతజ్ఞతలు తెలియజేయలేవు

 జీవితమంటే ఏమిటి....? 
 జీవితాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే నీవు
 ఈ మూడు ప్రాంతాలకు వెళ్ళాలి

1. ఆసుపత్రికి
2. జైలుకు
3. స్మశానవాటికకు

ఆరోగ్యానికి మించినది ఏదీ లేదని ఆసుపత్రిలో నీకు అర్థమౌతుంది

 స్వేచ్ఛ కంటే మించినది ఏదీ లేదని జైల్లోకి వెళితే
నీవు గ్రహించగలుగుతావు.

ఈ జీవితం ఏమాత్రం విలువలేనటువంటిదని స్మశానానికి వెళితే నీకు తెలుస్తుంది.ఈరోజు మనం నడుస్తున్న ఈ భూమియే రేపు మన పైకప్పు ఔతుందని తెలుసుకుంటావు.అనుక్షణం ఆరాటపడి నీవు సంపాదించిందేది నీ వెంట రాదని, నీవు పడిన ఆరాటం, నీవు చేసిన పోరాటం వృధా ప్రయాస అని తెలుసుకుంటావు

చేదు నిజం

మనం వచ్చేటప్పుడు ఏమీ లేకుండా నే వచ్చాము అలాగే పోయేటప్పుడు కూడా ఏమీ లేకుండానే పోతాము.

 అందువల్ల .....
 అణుకువగా .....
 వినయంగా.....
 సర్వదా సర్వత్రా .....

ఆ భగవంతుడికి కృతజ్ఞతతో వుందాము.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Post a Comment

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

CBSE - Single Gild Child Scholarship 2025

తల్లిదండ్రులకు ఏకైక బాలికా సంతానంగా ఉన్న ప్రతిభ కలిగిన విద్యార్థినుల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఉపకార వేతనాన్ని ఏటా అందిస్తోంది. ఇందుకు సంబంధించి సీబీఎస్ఈ- సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2025 ప్రకటన వెలువడింది. సీబీఎస్ఈ పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థినుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. 👉 అర్హతలు: విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక కూతురై ఉండాలి. విద్యార్థిని సీబీఎస్ఈలో పదోతరగతి ఉత్తీర్ణురాలై, సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలో పదకొండవ తరగతి, పన్నెండో తరగతి చదువుతూ ఉండాలి. పదో తరగతి పరీక్షలో కనీసం 70శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థిని ట్యూషన్ ఫీజు నెలకు రూ.3000 కంటే మించకూడదు. 👉 చివరి తేదీ: 23.10.2025 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺