🔔గంటలకు కంచు ఎందుకు వాడతారు❓
🌸జవాబు: దేవాలయాలలో, చర్చిలలో గంటను మోగిస్తారు. ఆ గంటల శబ్దం ఎంతో దూరం వినిపిస్తుంది. ప్రార్థనా స్థలాలు వేరైనా ఆ గంటలు ఒకలాంటివే. అవన్నీ కూడా కంచుతో తయారవుతాయి. కంచు లోహమిశ్రమము, దానికి స్థితి స్థాపక గుణం అధికంగానే ఉంటుంది. దీనివల్ల కంచును కంపింపచేసినప్పుడు గంట ఖంగుమని కంపనాలను ఎక్కువసేపు ఉంచగలదు. అలా ధ్వని వినిపించే శక్తి బంగారానికీ మరి ఏ ఇతర లోహానికీ లేదు. అందుకే "కంచు మోగునట్టు కనకంబు మోగునా" అన్నాడో శతకకారుడు.
Comments
Post a Comment