Skip to main content

లోపలెందుకు అతుక్కోవు?


ప్రశ్న: ఫెవిక్విక్‌, ఫెవికాల్‌తో మనం దేన్నైనా అతికిస్తాం. మరి అదున్న ట్యూబ్‌కి అతకదు ఎందుకని?

ఫెవికాల్‌, ఫెవిక్విక్‌ రెండూ వాణిజ్యపరమైన పేర్లు. అవి రసాయనిక పేర్లు గానీ, సాంకేతిక పదాలు గానీ కాదు.
 ఇందులో ఉన్న రసాయనిక సంఘటనం (కెమికల్‌ కంపోజిషన్‌) వాణిజ్యరహస్యం.
అయినా అతికించేందుకు ఉపయోగించే ధాతువుల్లో ప్రధానంగా ఉండేది పాలీ అమైడ్లు, కార్బోప్రోటీన్లు, పిండి పదార్థాలు. వీటికి ఉండే ప్రధాన లక్షణం కాగితాలు, చెక్క వంటి వస్తువుల మధ్య సంధానంగా పనిచేయడం. దీనికి కారణం... ఈ జిగురు పదార్థాల్లోను వీటి ద్వారా అతికించే వస్తువుల్లోను కొన్ని రసాయనిక లక్షణాలు ఒకేలా ఉండటం.
 ఫెవికాల్‌, ఫెవిక్విక్‌ వంటి పదార్థాలు అతుక్కోవాలంటే అవి గాలిలోని ఆక్సిజన్‌ సమక్షంలో బహు అణువులు (పాలీమర్స్‌)గా పెద్దగా కావాలి. పైగా అందులో ఉన్న తేమ ఆవిరి కావాలి. అంతేకాదు అవి వేటి మధ్యనయితే జిగురుగా పని చేసి అతికిస్తాయో వాటి ఉపరితలాల్లో ఉన్న పదార్థంతో రసాయనిక బంధాన్ని ఏర్పర్చాలి. అలాంటి సదుపాయం ట్యూబుల్లో వీలు కాదు. అందుకే అవి గట్టి పడకుండా, అతుక్కోకుండా ఉండగలవు

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺