కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో వయో వృద్ధులకు కేంద్రం కొన్ని సూచనలు చేసింది. ముప్పు అవకాశం వారికి ఎక్కువగా ఉండడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కేంద్రం చేసిన సూచనలు...
*👉చేయాల్సినవి...
* ఇంటివద్దనే ఉండండి. సందర్శకులను అనుమతించవద్దు. ఒకవేళ అవసరమైతే ఒక మీటరు దూరంలో ఉండి మాట్లాడండి.
* దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు టిష్యూ కాగితం, చేతి రుమాలు, లేదా మోచేతిని అడ్డుపెట్టుకోండి.
* ఇంట్లో వండిన తాజా, వేడివేడి ఆహారాన్నే తీసుకోండి.
* తరచూ నీళ్లు తాగండి. వ్యాధి నిరోధకత పెంపునకు తాజా పండ్ల రసాలు తీసుకోండి.
* వ్యాయామం, ధ్యానం చేయండి.
* రోజువారీ మందుల్ని క్రమం తప్పకుండా తీసుకోండి.
* జ్వరం, దగ్గుతో పాటు శ్వాసలో ఇబ్బంది ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించండి.
* కాటరాక్ట్, మోకీలు మార్పిడి వంటి శస్త్రచికిత్సలను వాయిదా వేసుకోండి.
*చేయకూడనివి...
* చేతులను శుభ్రం చేసుకోకుండా ముఖాన్ని తాకవద్దు.
* అనారోగ్యంతో ఉన్నవారి వద్దకు వెళ్లొద్దు.
* సొంతంగా మందులు వాడొద్దు.
* ఎవరితోనూ కరచాలనం, ఆలింగనం వద్దు.
* సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రులకు వెళ్లొద్దు. వీలైనంత వరకూ ఫోన్లోనే వైద్యుల సలహాలు తీసుకోండి. అత్యవసరమైతే తప్పించి ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దు.
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment