పాచెఫ్‌స్ట్రూమ్: భారత జావెలియన్ త్రోయర్ శివ్‌పాల్ సింగ్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
దక్షిణాఫ్రికాలో జరిగిన ఏసీఎన్‌డబ్ల్యూ అథ్లెటిక్స్ మీట్‌లో శివ్‌పాల్ సింగ్ ఈటెను 85.47 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు.
ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్ అర్హత ప్రమాణం 85 మీటర్లను కూడా శివ్‌పాల్ సింగ్ అధిగమించాడు. భారత్ తరఫున టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన రెండో జావెలియన్ త్రోయర్ శివ్‌పాల్ సింగ్.
ఇప్పటికే నీరజ్ చోప్రా ‘టోక్యో’ బెర్త్ సాధించాడు.
ఒలింపిక్స్‌కు అమిత్, మేరీకోమ్, సిమ్రన్‌జిత్
భారత అగ్రశ్రేణి బాక్సర్లు అమిత్ పంఘాల్ (52 కేజీలు), మేరీకోమ్ (51 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు) 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.
ఆసియా క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో ఈ ముగ్గురూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు.
జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో మార్చి 9న జరిగిన పురుషుల విభాగం క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ అమిత్ పంఘాల్ 4-1తో కార్లో పాలమ్ (ఫిలిప్పీన్స్)ను ఓడించాడు.
మహిళల విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, 37 ఏళ్ల మణిపూర్ మెరిక మేరీకోమ్ 5-0తో ఇరిష్ మాగ్నో (ఫిలిప్పీన్స్)పై...
పంజాబ్‌కు చెందిన 24 ఏళ్ల సిమ్రన్‌జిత్ 5-0తో రెండో సీడ్ నమున్ మోన్‌ఖోర్ (మంగోలియా)పై ఘనవిజయం సాధించారు
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment