Skip to main content

ఐక్యరాజ్య సమితి పూర్తి సమాచారం...



*అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమష్టి కృషి చేస్తుంది.


ఐక్యరాజ్య సమితి (ఆంగ్లం: United Nations) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి , మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అవి: అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా , ఫ్రాన్స్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. దీని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుట్టెర్స్. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన అక్టోబరు 24వ తేదీని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవం గా పాటిస్తారు.


*సమితి ఆవిర్భావం

🟢రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే 1941 ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు థియోడార్ రూజ్‌వెల్ట్ , బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ అట్లాంటిక్ సముద్రంలో ఒక ఓడలో సమావేశమై కుదుర్చుకొన్న ఒప్పందాన్ని అట్లాంటిక్ ఛార్టర్ అంటారు. ప్రాదేశిక సమగ్రత కాపాడడం, యుద్ధభయాన్ని తొలగించడం, శాంతిని నెలకొల్పడం, నిరాయుధీకరణ వంటి ఎనిమిది అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ ఒప్పందమే తరువాత ఐక్య రాజ్య సమితి సిద్ధాంతాలకు మౌలిక సూత్రాలుగా గుర్తింపు పొందినది.

తరువాత 1944లో వాషింగ్టన్ లోని డంబార్టన్ ఓక్స్ వద్ద జరిగిన సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా ప్రతినిధులు ఐ.రా.స. ప్రకటన పత్రం ముసాయిదాను తయారు చేశారు. 1945 ఫిబ్రవరిలో యాల్టా సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా నేతలు ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను స్థాపించాలని తీర్మానం చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో 1945 ఏప్రిల్ 25నుండి జూన్ 26 వరకు జరిగిన అంతర్జాతీయ సమావేశంలో 51 దేశాల ప్రతినిధులు పాల్గొని ఐక్య రాజ్య సమితి ఛార్టర్‌పై సంతకాలు చేశారు. 1945 అక్టోబరు 24న న్యూయార్క్ నగరంలో ఐక్య రాజ్య సమితి లాంఛనంగా ప్రారంభమైంది.

*సమితి ఆశయాలు

యుద్ధాలు జరగకుండా చూడటం,
అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం,
దేశాల మధ్య స్నేహసంబంధాలను పెంపొందించడం,
అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించేటట్లు చేయడం,
*సాంఘిక అభివృద్ధి సాధించి, మానవ జీవితాలను సుఖమయం చేయడం.

*సమితి ప్రధాన అంగాలు

*సర్వ ప్రతినిధి సభ
ఈ సభలో సభ్యదేశాలన్నింటికీ ప్రాతినిధ్యం ఉంటుంది. ప్రతి దేశానికి సమానంగా ఒక్క ఓటు ఉంటుంది. సమావేశాలకు ప్రతి సభ్యదేశం గరిష్ఠంగా 5 గురు సభ్యులను పంపవచ్చు. ఈ సభ సంవత్సరానికి ఒక పర్యాయం, సాధారణంగా సెప్టెంబరు మాసంలో, సమావేశమౌతుంది. సమావేశానికి అధ్యక్షుడిగా సభ్యదేశాలు ఎన్నిక చేస్తాయి. కొత్త సభ్యదేశాలకు ప్రవేశం కల్పించడానికి, భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశాలను ఎన్నిక చేయుటలో ఈ సభకే అధికారముంది. సమితి ఆశయాలకు, లక్ష్యాలకు వ్యతిరేకంగా వ్యవహరించే సభ్యదేశాలను తొలగించే అధికారం కూడా ఈ సభకు ఉంది. అన్ని రంగాలలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం దీని కర్తవ్యం. ఈ సభ మూడింట రెండు వంతులు (2/3) మెజారిటీతో నిర్ణయాలు చేస్తుంది.

*భద్రతా మండలి

సమితి ప్రారంభమయ్యేనాటికి ఇందులో సభ్యదేశాల సంఖ్య 11. ప్రస్తుతం 15 సభ్యదేశాలు ఉన్నాయి. అందులో 5 శాశ్వత సభ్యదేశాలు కాగా 10 రెండేళ్ళ కాలవ్యవధి కొరకు ఎన్నిక కాబడు తాత్కాలిక సభ్యదేశాలు. అమెరికా, రష్యా, ఇంగ్లాండు, చైనా, ఫ్రాన్సులు ఇందులో శాశ్వత సభ్యదేశాలు. ఈ శాశ్వత సభ్యదేశాలకు వీటో అధికారం కూడా ఉంది. సమితి ప్రారంభమైనప్పటి నుంచి ఇందులో ప్రధానమైన రెండు మార్పులు చేసారు. ప్రారంభంలో 6 తాత్కాలిక సభ్యదేశాలుండగా దాని సంఖ్యను 10 కి పెంచారు. వీరిలో ఆసియా-ఆఫ్రికా దేశాలనుండి ఐదుగురు, లాటిన్ అమెరికా దేశాలనుండి ఇద్దరు, పశ్చిమ ఐరోపా నుండి ఇద్దరు, తూర్పు ఐరోపా‌నుండి ఒక్కరు ఎన్నికవుతుంటారు. నేషనలిస్ట్ చైనా స్థానంలో కమ్యూనిస్ట్ చైనాకు శాశ్వత సభ్యత్వం కల్పించారు. తాత్కాలిక సభ్యదేశాలను సాధారణ సభ ఎన్నిక చేస్తుంది. ఏ దేశం కూడా వరుసగా రెండు పర్యాయాలు ఎన్నిక కారాదు. దీనికి అధ్యక్షుడు ప్రతి మాసము మారుతుంటాడు. భద్రతా మండలి తన ఆదేశాలను పాటించని రాజ్యాలపై ఆంక్షలు విధిస్తుంది. సైనిక చర్య కూడా చేపట్టే అధికారముంది.


*సచివాలయం

ఇది ఐ.రా.స. వ్యవహారాలు నిర్వహించే కార్యనిర్వాహక విభాగం. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. ఇందులో పది వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తారు. సచివాలయానికి ప్రధానాధికారిని సెక్రటరీ జనరల్ అంటారు. ఐ.రా.స.కీ, దాని వివిధ విభాగాలకు, అనుబంధ సంస్థలకు అవుసరమైన సమాచారము, అధ్యయనం, సదుపాయాలు వంటి విషయాలు సచివాలయం అధ్వర్యంలో నిర్వహింపబడుతాయి. ఉద్యోగుల ప్రతిభ, నిజాయితీ, పనితనం , వివిధ ప్రాంతాలకు ఉచితమైన ప్రాతినిధ్యం అనే అంశాలు ఈ ఉద్యోగుల ఎంపికలో ముఖ్యమైన విషయాలని ఐ.రా.స. ఛార్టర్‌లో వ్రాయబడింది. ఐ.రా.స శాంతి సైనిక దళాలను Blue helmets అంటారు.

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

TET- PSYCHOLOGY REVISION BITS PART - 2

101. ప్రజ్ఞ అంటే? — సమస్య పరిష్కార సామర్థ్యం   102. ప్రజ్ఞను తీర్పు శక్తిగా నిర్వచించినవాడు? — బినెట్   103. వ్యక్తిత్వం అంటే? — సమగ్ర లక్షణాల సమాహారం   104. Trait Theory ఎవరిది? — ఆల్పోర్ట్   105. 16 Personality Factors ఎవరిది? — క్యాటెల్   106. Introvert ఎవరు? — ఒంటరిగా ఉండేవాడు   107. Extrovert ఎవరు? — సమాజంలో కలిసేవాడు   108. Ambivert అంటే? — రెండు లక్షణాల సమ్మేళనం   109. Learningను ప్రభావితం చేసేది? — ఆసక్తి   110. Behaviourను ప్రభావితం చేసేది? — వైఖరి   111. అభిరుచి అంటే? — ప్రత్యేక ఆకర్షణ   112. Aptitude ఏమి సూచిస్తుంది? — భవిష్యత్ విజయం   113. Achievement Test ఏమి కొలుస్తుంది? — నేర్చుకున్నది   114. Aptitude Test ఏమి కొలుస్తుంది? — భవిష్యత్ సామర్థ్యం   115. Personality Test ఏమి కొలుస్తుంది? — వ్యక్తిత్వం   116. Inkblot Test ఎవరిది? — రోర్షాక్   117. TAT రూపొందించినవాడు? — ముర్రే   118. Creativity ప్రధాన లక్షణం? ...

TET special ప్రజ్ఞా లబ్ది మరియు శిశు వికాస సిద్ధాంతాలపై పూర్తి వివరణ మరియు ప్రాక్టీస్ బిట్స్...

శిశు వికాస సిద్ధాంతాలు & ప్రతిపాదకులు (Child Development Theories & Founders) విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు: ఎడ్వర్డ్ లీ థోర్న్‌డైక్ (Edward L. Thorndike) ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు: విలియం జేమ్స్ (William James) ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు: విల్హెల్మ్ వుండ్ట్ (Wilhelm Wundt) మానసిక విశ్లేషణ సిద్ధాంతం (Psychoanalytic Theory): సిగ్మండ్ ఫ్రాయిడ్ (Sigmund Freud) ప్రముఖ వికాస సిద్ధాంతాలు సంగ్రహణాత్మక వికాస సిద్ధాంతం (Cognitive Development Theory) ప్రతిపాదకుడు: జీన్ పియాజే (Jean Piaget) వికాస దశలు జ్ఞానేంద్రియ చలన దశ (0-2 సంవత్సరాలు) పూర్వ కార్యాచరణ దశ (2-7 సంవత్సరాలు) నిర్దిష్ట కార్యాచరణ దశ (7-11 సంవత్సరాలు) అమూర్త కార్యాచరణ దశ (11+ సంవత్సరాలు) సాంఘిక-సాంస్కృతిక వికాస సిద్ధాంతం ప్రతిపాదకుడు: లెవ్ వైగోట్‌స్కీ (Lev Vygotsky) ముఖ్య భావనలు Zone of Proximal Development (ZPD) Scaffolding (ఆధార బోధన) నైతిక వికాస సిద్ధాంతం ప్రతిపాదకుడు: లారెన్స్ కోల్‌బర్గ్ (Lawrence Kohlberg) స్థాయిలు పూర్వ సంప్రదాయ స్థాయి సంప్రదాయ స్థాయి అనంతర సంప్రదాయ స్థాయి మనోసాంఘిక వికాస సి...

త్వరలోనే అకౌంట్లోకి తల్లికి వందనం.. ఈ మూడు పనులు చేయకపోతే డబ్బులు కట్..

ప్రభుత్వం అలర్ట్ వచ్చే నెలలో నిధులను జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు లబ్దిదారుల జాబితా సిద్దం చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మూడు చేయకపోతే డబ్బులు కట్ ఒకటి తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి. ఇక ఎన్‌పీసీఐ (Aadhaar Seeding) పూర్తయి ఉండాలి. ఇక మూడో విషయం బ్యాంక్ కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకుని ఉండాలి. ఈ మూడింటిలో ఏ ఒక్కటి పెండింగ్‌లో ఉన్నా నిధులు పొందటంలో అవాంతరాలు ఎదురయ్యే అవకాశముంటుంది. దీంతో అన్నీ వివరాలు సరిగ్గా ఉండేలా అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. చాలామంది విద్యార్థుల వివరాలు ఎన్‌పీసీఐ లాగిన్‌లో తెరుచుకోవడం లేదు. దీంతో గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రలు బ్యాంక్ ఖాతా వివరాలను విద్యార్థుల పేర్లతో నమోదు చేయించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సమాచారం అందించాలని సూచించింది. బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎన్‌పీసీఐ యాక్టివేషన్ కాకుంటే ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ తెరిపించాలని, దానికి ఎన్‌పీసీఐ లింకింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే జాబితా విడుదల త్వరలోనే తల్లికి వందనం అర్...