Skip to main content

జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు-




1) రాజ్యసభ సభ్యుడిగా నియమితులైన సుప్రీంకోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి ?
  జస్టిస్ రంజన్ గొగొయి

2) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గా పనిచేసి .. గతంలో రాజ్యసభ సభ్యుడిగా పదవి చేపట్టిన తొలి వ్యక్తి?
 జస్టిస్ రంగనాథ్ మిశ్ర (1998-2004)

3) 2020 ఫిబ్రవరిలో వార్షిక ద్రవ్యోల్బణం 540 శాతం చేరిన దేశం?
 జింబాబ్వే

4) కొత్త వాహన చట్టం అమల్లోకి తెచ్చిన తర్వాత ఏపీలో ఎంత శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు?
 7 శాతం

5) యస్ బ్యాంక్ కు ప్రస్తుత RBI నియమిత అడ్మినిస్ట్రేటర్ గా కొనసాగుతున్న ప్రశాంత్ కుమార్ చేపట్టున్న బాధ్యతలు?
 యస్ బ్యాంక్ సీఈవో, ఎండీగా

6) ఏపీ రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ఏ గ్రంథాన్ని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆవిష్కరించారు?
సారస్వత సౌరభం

7) తమిళనాడు రాజధాని చెన్నైలో నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ బెంచ్ (ఎన్ సీఎల్ ఏటీ) ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది?
 2020 మార్చి 18

8) ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో విజేతలు ?
  తైజు, విక్టర్

9) అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఒమన్ ఓపెన్ చాలెంజర్ ప్లస్ టోర్నమెంట్ లో విజయం సాధించిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు?
  భారత అగ్రశ్రేణి ఆటగాడు ఆచంట శరత్ కమల్

10) ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19 పై యుద్ధానికి సార్క్ దేశాలు కోవిడ్ -19 ఎమర్జెన్సీ ఫండ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి.  ఈ ఫండ్ కు భారత ప్రధాని మోదీ ప్రకటించిన మొత్తం?
 కోటి డాలర్లు (రూ. 73.95 కోట్లు)

11) పౌరహక్కుల పరిరక్షణకు చేసిన సేవలకు గుర్తింపుగా ముకుందన్ సి మేనన్ అవార్డును ..నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఎవరికి ప్రకటించింది?
  ప్రొపెసర్ సాయిబాబా..

12) ప్రస్తుత జపాన్ ప్రధాని?
 షింజో అబే

13) కోవిడ్ వైరస్ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఏ ఫండ్ కింద రాష్ట్రాలకు సహాయం అందించనుంది?
 స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ..

14) భారత దేశ వాళి క్రికెట్ ప్రధాన టోర్నీ రంజీ ట్రోఫీలో కొత్త చాంపియన్ గా అవతరించిన జట్టు ?
 సౌరాష్ట్ర జట్టు

15) రాష్ట్రంలో గొర్రెల కాపరులకు ఆర్థిక సాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన పథకం?
 వైఎస్సార్ కాపరి బంధు పథకం

16) ఒకే రోజు 1500 మంది కరోనా కేసులు అడ్మిట్ అయిన దేశం ?
 స్పెయిన్

17) అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాలు ?
 చైనా, ఇటలీ, ఇరాన్, స్పెయిన్..

18) ప్రస్తుత స్పెయిన్ ప్రధాని ?
 పెడ్రో శాంచెజ్

19) ఒమన్ ఓపెన్ టేబు ల్ టెన్నిస్ టోర్నమెంట్ లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ క్రీడాకారుడు?
  సూరావజ్జుల స్నేహిత్ (మూడో స్థానంలో నిలిచాడు)

20) దేశంలో కరోనా అనుమానితులు పెరుగుతుండటంతో కేంద్ర ఇతర దేశాలనుంచి వచ్చినవారికి కోవిడ్ అనుమానిత లక్షణాలు లేకపోయినా ఎలా ఉండాలని మార్గదర్శకం చేసింది?
 హోం ఐసోలేషన్ లో.. (ఇంట్లో ఒంటరిగా)

21)దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ను రూపొందించినది  ?
 హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ సెలెస్ట్రెయల్ ఈ మొబిలిటీ

22) వింగ్స్ ఇండియా సదస్సు 2020 ఎక్కడ నిర్వహించారు?
 హైదరాబాద్ బేగం పేట ఎయిర్ పోర్ట్

23)రష్యా పార్లమెంట్ బిల్లును ఆమోదించడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షుడిగా ఎప్పటివరకూ కొనసాగనున్నారు?
 2036

24)  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) చేపడుతున్న పారాదీప్ –హైదరాబాద్ డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ (డీఈఎఫ్) టెర్మినల్ ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు?
 మల్కాపూర్, యాదాద్రి భువనగిరి.

25) సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్ షేర్లు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిని ప్రభుత్వ రంగ బ్యాంక్?
 ఎస్ బి ఐ

26) భారత రాజ్యాంగ శిల్పి  బి.ఆర్ అంబేడ్కర్ ఉత్తర లండన్ లో నివసించిన ఇంటిని మ్యూజియంగా కొనసాగించడానికి బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది. అయితే అంబేద్కర్ ఆ నివాసంలో ఉన్న కాలం?
 1921-22  (లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో విద్యను అభ్యసించిన సమయంలో ..)

27) గ్రీస్  అధ్యక్ష పదవిని తొలిసారిగా చేపట్టిన మహిళ?
 కాటెరినా

28) ప్రస్తుత కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ?
 అశ్వినీ కుమార్ చౌబే..

29) WORLD CONSUMER RIGHTS DAY గా ఏ రోజును జరుపుకుంటారు..?
 15 మార్చి

30)Phool dei Festival ఏ రాష్ట్రంలో జరుపుకొనే సాంప్రదాయ పండుగ..?
ఉత్తరాఖండ్
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

తెలుసుకుందాం...

🌸జవాబు: గోత్రం అంటేనే అద్భుతమైన సైన్సు. ఈ శాస్త్రం ప్రకారం మన పూర్వీకులు గోత్ర విధానాన్ని ఎలా ఏర్పాటు చేశారో గమనించండి. మీరు పూజలో కూర్చున్న ప్రతిసారీ పూజారి మీ గోత్రం గురించి  ఎందుకు అడుగుతారో మీకు తెలుసా? _తెలీదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు?_ 💐గోత్రం వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు-  జీన్-మ్యాపింగ్. అది ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం  పొందిన అధునాతన శాస్త్రమే! 👉🏻 గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి? 👉🏻 మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది?  👉🏻 వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనం ఎందుకు భావిస్తాము? 👉🏻 కొడుకులకు ఈ గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది, కుమార్తెలకు ఎందుకు రాదు? 👉🏻 వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా/ఎందుకు మారాలి? 👉🏻 తర్కం ఏమిటి? 💐ఇది మనం అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం.   మన గోత్ర వ్యవస్థ వెనుక  జన్యుశాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం! గోత్రమ్ అనే పదం రెండు సంస్కృత పదాల నుంచి ఏర్పడింది.   మొదటి పదం 'గౌ'- అంటే ఆవు, రెండవ పదం 'త్రాహి' అంటే కొట్టం. గోత్రం అంటే 'గోశాల' అని అర్థం. జీవశాస్త్ర పరంగా, మానవ శరీరంలో 23 జతల క్...

నేటి మోటివేషన్... ఉద‌యం 8 లోపు చేసే (S.A.V.E.R.S.)….అనే ఈ 6 అల‌వాట్లు మీ జీవితాన్నే మారుస్తాయ్.!

హాల్ ఎలోర్డ్ అనే ప్ర‌ముఖ ర‌చ‌యిత రాసిన “ద మిరాకిల్ మార్నింగ్” అనే బుక్ లో ఉద‌యం 8 లోపు చేసే 6 ప‌నులు మ‌న జీవితాన్నే మారుస్తాయ్ అని చాలా స్ఫ‌ష్టంగా చెప్పాడు. కార్ యాక్సిడెంట్ అయ్యి కోమాలోంచి బ‌య‌ట‌ప‌డ్డ ఈ ర‌చ‌యిత ఇప్పుడు త‌న ర‌చ‌న‌ల‌తో ప్ర‌పంచాన్ని ఆలోచింప‌జేస్తున్నాడు. ఆనందానికి 6 అంశాల సూత్రం. S.A.V.E.R.S S-Silence( నిశ్శ‌బ్దం)....మ‌న ప్ర‌తి రోజును చాలా నిశ్శ‌బ్దంగా ప్రారంభించాలి…అంటే ప్ర‌శాంత‌త‌తో స్టార్ట్ చేయాలి..లేవ‌డం లేట‌య్యింది…అయ్యే ఎలా…? ఆఫీస్ ప‌ని…ఈ రోజు అత‌డిని క‌లుస్తాన‌ని చెప్పాను…ఎమోయ్…టిఫిన్ అయ్యిందా…..ఇదిగో ఇంత‌లా హైరానా ప‌డొద్దు… ప్ర‌శాంతంగా లేవ‌గానే….కాసింత సేపు మెడిటేష‌న్ చేయండి. లేదా…క‌ళ్ళు మూసుకొని ప్ర‌శాంత‌త‌ను మీ మ‌న‌స్సులోకి ఆహ్వానించండి. ఇక్క‌డే మ‌న రోజు ఎలా గ‌డుస్తుంది? అనేది డిసైడ్ అయిపోతుంది . A-Affirmations ( నీతో నువ్వు మాట్లాడుకోవ‌డం)…. అంద‌రి గురించి, అన్ని విష‌యాల గురించి అన‌ర్గ‌లంగా మాట్లాడే మ‌నం…మ‌న‌తో మ‌నం ఒక్క‌సారి కూడా మాట్లాడుకోలేక‌పోతున్నాం. అస‌లు మ‌న‌లోని మ‌న‌కు ఏం కావాలి? పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళ‌ల్లో ఖ‌చ్చితంగా ఈ ల‌క్ష‌ణం ఉంటుంది. ఈ మూడు పా...