సమయస్ఫూర్తి - గణితయుక్తి.
------------------------------------------
పూర్వం సకలరాయపురం అనే అగ్రహారంలో పాపయ్యశాస్త్రి అనే పండితుండేవాడు.పౌరోహిత్యంతోపాటు యజ్ఞాలు యగాలు నిర్వహించేవాడు.ఇతని టీమ్ లో పాపయ్యశాస్త్రీ తోపాటు 15 మంది పండితులుండేవారు.
ఓ మరుసటి రోజున భూపాలపురంలో హోమనిర్వహణ చేయాల్సి వుంటే మొత్తం 15 మంది అగ్రహారీకులు ముందురోజే ప్రయాణమైనారు. అలా కాలినడకన వెళుతున్నవారు భయంకరమైన అడవి దాటాల్సివచ్చింది.
అలా నడుచుకొంటూ వెళుతున్న బాపనలను కరుడుగట్టిన దారిదోపిడి ముఠా అడ్డగించి అందరిని కాళికాలయానికి పట్టుకుపోయారు. దొంగలు కూడా పదునైదు మందే వున్నారు.
గుడిని చేరిన తరువాత మీదగ్గరున్న సొత్తంతా ఇవ్వండి లేదంటే అమ్మవారికి అందరిని బలి ఇచ్చేస్తామని దొంగలు బెదిరించారు. పాపం పండితులు గజగజ వణికిపోసాగారు.
ఇంతలో కాళికామాత భీకరశబ్దంచేస్తూ మీలో సగంమంది నాకు బలి కావాలి లేదంటే అందరిని మింగుతానంది. దొంగలు భయంతో కొయ్యబారిపోయారు.
పాపయ్యశాస్త్రీ ఎలాగైనా తనవారిని రక్షించుకోవాలని ఒక ఉపాయం అలోచించి అమ్మా జగన్మాత పూర్తిగా బ్రాహ్మణులను పూర్తిగా దొంగలను బలితీసుకోవడం సమంజసం కాదు. మేము ముప్పైమంది వరుసగా నిలబడుతాం ఆ వరుసలో ప్రతి తొమ్మిదవవాడిని బలి తీసుకొని నీ ఆకలి చల్లార్చుకోమని ప్రాధేయపడ్డాడు. కాళిక సరేనంది. చదువురాని దొంగలు కూడా సరేనన్నారు.
అపుడు పాపయ్యశాస్త్రీ తనతోపాటు మిగిలిన 29 మందిని వరుసలో నిలబెట్టాడు. ఇపుడా వరుసలో ముప్పైమంది వున్నారు.
అన్నమాట ప్రకారం ఆ వరుసలో ప్రతి 9వ వాడిని అంబ బలితీసుకొంది.గమ్మత్తెమిటంటే ఆ వరుసలో ప్రతి తొమ్మిదవవాడు దొంగే అయినాడు.
ఇలా తెలివిగా పాపయ్యశాస్త్రీ దొంగలను మాత్రమే బలికానించి తన పండితులను కాపాడుకొన్నాడు.
ఇంతకి పాపయ్యశాస్త్రీ యుక్తిగా ఎలా బాపనలను దొంగలను నిలబెట్టాడో తెలుసా ? ఇలా!
XXXX 00000 XX 0 XXX 0 X 00 XX 000 X 00 XX 0.
X = బ్రాహ్మణ పండితులు.
0 = దోపిడి దొంగలు.
ఈ కథకో చమత్కారయుత రెండు పద్యాలు కూడా పెద్ద బాలశిక్షలో ఉన్నాయి. అవే మంటే...
సీ.
తార్కికుల్ నలుగురు, తస్కరు లేవురు,
శ్రోత్రియు లిద్దరు, చోరుఁ డొకఁడు,
భూసురుల్ ముగ్గురు, ముడియవి ప్పొక్కఁడు
సకలార్థనిపుణుఁడు శాస్త్రి యొకఁడు,
యల్లాపు లిద్దఱు, యాచకు లిద్దఱు,
బరివాండ్రు ముగ్గురు, బాపఁ డొకఁడు,
ఆగడీ లిద్దఱు, ఆరాధ్యు లిద్దఱు,
దుష్టాత్ముఁ డైనట్టి దొంగ యొకఁడు,
తే.గీ.
అరసి వారల నొక శక్తి యశనమునకు
సగము గోరఁగ, నవసంఖ్య జగతిసురుఁడు
చెప్ప, దొంగలు హతమైరి, చేటుదప్పి
విజయ మందిరి యావేళ విప్రు లెల్ల.
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment