తెలంగాణ యువ పర్వతారోహకుడు ఆంగోత్ తుకారాం మరో అరుదైన రికార్డు సృష్టించాడు.
ఆస్ట్రేలియా ఖండంలోనే ఎత్తైన పర్వతం కోస్సియుస్కోను మార్చి 10న అధిరోహించాడు.
ఏడు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంతో పర్వతారోహణ మొదలుపెట్టిన ఆంగోతు తుకారాం...
ఇప్పటికే నాలుగు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను అధిరోహించాడు.
తాజాగా కోస్సియుస్కోను
అధిరోహించడంతో ఐదు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను ఎక్కి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.
ఆస్ట్రేలియాలోని కోస్సియుస్కో పర్వతాన్ని అధిరోహించేందుకు మార్చి 5న హైదరాబాద్ నుంచి బయల్దేరిన తుకారాం..8న అక్కడికి చేరుకున్నారు.
మార్చి 8న సాహసయాత్ర ప్రారంభించి 10వ తేదీకి పూర్తి చేశాడు.
తుకారాం 2018 జూలైలో ఆఫ్రికాలోని కిలీమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. ఆ తర్వాత 2019 మే 22న ఆసియాలోని మౌంట్ ఎవరెస్ట్, 2019 జూలై 27న యూరప్‌లోని మౌంట్ ఎల్బ్రూస్,
2020 జనవరి 26న ఉత్తర అమెరికాలోని మౌంట్ అకాన్గువా పర్వతాలను అధిరోహించాడు.
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment