Skip to main content

NMMS scholarship 2025: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2025.. పూర్తి వివరాలు...


అర్హులైన విద్యార్థులు ఆగస్టు 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

🎯వివరాలు:
🌼 ఈ పథకానికి ఎంపికైన లక్ష మంది విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 
🌼 తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసే వరకు ఉపకారవేతనం లభిస్తుంది.

🎯అర్హత:
విద్యార్థులు ప్రభుత్వ/ప్రభుత్వ అనుబంధ పాఠశాలలు లేదా స్థానిక సంస్థల పాఠశాలల్లో 8వ తరగతిలో చదువుతూ ఉండాలి.
వారి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.50 లక్షలకు మించకూడదు.
విద్యార్థులు 7వ తరగతిలో కనీసం 55శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి (ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులకు 5శాతం సడలింపు ఉంటుంది).
🎯గమనిక:-
కేంద్రీయ విద్యాలయాలు, నవోదయలు, రెసిడెన్షియల్ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ వర్తించదు.
🎯వయోపరిమితి:
సాధారణంగా 13-15 సంవత్సరాల వయస్సులో 8వ తరగతి విద్యార్థులు అర్హలు.

🎯రాత పరీక్ష
ఈ స్కాలర్‌షిప్స్‌కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్రస్థాయిలో రెండు పేపర్ల రాత పరీక్షలు నిర్వహిస్తారు.

🎯పరీక్ష విధానం:
1. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (మ్యాట్‌):
 90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 90 మార్కులు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు.
2. స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్‌): 
90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు. మొత్తం 90 మార్కులు. 7, 8 తరగతుల స్థాయిలో సోషల్‌, సైన్స్, మ్యాథ్స్‌ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు.

🎯దరఖాస్తు విధానం:
 నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ (NSP) https://scholarships.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 దరఖాస్తును స్కూల్, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ధృవీకరిస్తారు.
 ధృవీకరణ అనంతరం విద్యార్థి బ్యాంక్ ఖాతాలో డైరెక్ట్ గా స్కాలర్‌షిప్ జమ చేస్తారు.

🎯ముఖ్య విషయాలు:
ఒక్కో విద్యార్థికి రూ.12,000 ప్రతి సంవత్సరం అందుతుంది.
స్కాలర్‌షిప్ అత్యధికంగా 4 సంవత్సరాల పాటు తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు కొనసాగుతుంది.
పదో తరగతిలో కనీసం 60శాతం మార్కులు (ఎస్సీ/ఎస్టీ 55%) సాధించాలి.
ఏదైనా కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ను ఒకే సమయంలో రెండవదాన్ని పొందలేరు.
స్కాలర్‌షిప్ ఎన్‌ఎస్‌పీ ద్వారా మాత్రమే పొందవచ్చు.
ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుంది.
 విద్యార్థులు మ్యాట్‌ & శాట్‌ పరీక్షల్లో కనీసం 40శాతం మార్కులు (ఎస్సీ/ఎస్టీలు 32శాతం) సాధించాలి.

🎯ముఖ్య తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం: 04.09.2025.
దరఖాస్తు చివరి తేదీ: 30.09.2025.
ఎన్‌ఎంఎంఎస్‌ఎస్‌ పరీక్ష సాధారణంగా ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో నిర్వహిస్తారు.
 ఎన్‌ఎస్‌పీ ద్వారా దరఖాస్తు గడువు తేదీలు సంబంధిత రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన ప్రకారం మారవచ్చు. కాబట్టి అధికారిక వెబ్‌సైట్, ప్రకటనలను పరిశీలించాలి.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Post a Comment

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺