Skip to main content

చరిత్రలో ఈ రోజు ఆగష్టు / - 05

🔎సంఘటనలు🔍

🌸1100: హెన్రీ I, వెస్ట్ మినిష్టర్ అబ్బే లో, ఇంగ్లాండ్ రాజుగా పట్టాభిషిక్తుడయాడు.

🌸1583: సర్ హంఫ్రీ గిల్బర్ట్ మొట్టమొదటి ఆంగ్లేయుల వలస ను, ఉత్తర అమెరికా లో, నెలకొల్పాడు. ఆ ప్రాంతాన్నిన్యూపౌండ్‌ లాండ్ లోని సెయింట్ జాన్ గా పిలుస్తున్నారు.

🌸1624: విలియమ్ జేమ్స్‌టౌన్, ఆంగ్లేయులు ఆక్రమించిన (వర్జీనియా, అమెరికా) లో పుట్టిన మొదటి నీగ్రో.

🌸1845: ఆస్ట్రేలియా లోని 'కింగ్ ఐలేండ్' ద్వీపానికి దగ్గరలో జరిగిన ఘోరమైన ఓడ (పేరు: కేటరక్వి) ప్రమాదంలో, 407 మంది మరణించారు.

🌸1858: మొట్టమొదటి ట్రాన్స్ అట్లాంటిక్ టెలిగ్రఫ్ కేబుల్ లైను వేసారు.

🌸1861: అమెరికా సైనిక దళాలు, 'సైనికులను కర్రలతో ఒక పద్ధతిగా చావబాదే' శిక్షను రద్దు చేసింది. (క్రమశిక్షణను పాటించని కొందరి సైనికులకు ఈ శిక్ష విధించేవారు) .

🌸1861: అమెరికా మొట్టమొదటి సారి ఆదాయపు పన్నును విధించింది. (800 డాలర్ల ఆదాయం దాటితే 3% పన్ను చెల్లించాలి)

🌸1864: తోకచుక్క వర్ణపటలము (సూర్యకాంతి ఏడురంగులను వర్ణపటలము అంటారు) ను మొదటిసారిగా చూసిన శాస్త్రవేత్త జియోవన్ని దొనాతి

🌸1874: ఇంగ్లాండ్లో ఉన్న పోస్టల్ సేవింగ్స్ సిస్టంని ఆదర్శంగా తీసుకుని, జపాన్ తన సొంత పోస్టల్ సేవింగ్స్ సిస్టంని ప్రవేశపెట్టింది.

🌸1879: రాత్రి సమయంలో మొట్టమొదటిసారిగా, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో 'గ్యాస్ లైట్ల' వెలుతురులో క్రికెట్ ఆడారు.

🌸1882: స్టీలుతో తయారయిన యుద్ధనౌకలను, అమెరికా నౌకాదళంలో వాడటానికి అమెరికా అనుమతించి, ఆధునిక నౌకాదళానికి నాంది పలికింది.

🌸1882: మార్షల్ లా (సైనిక దళాల న్యాయం), జపాన్లోచట్టమయ్యింది.

🌸1882: స్టాండర్డ్ ఆయిల్ కంపెనీని అమెరికాలో స్థాపించారు.

🌸1882: స్టేట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి, బెడ్లోస్ ఐలేండ్ (న్యూయార్క్ హార్బర్) శంకుస్థాపన జరిగింది. ఆ సమయంలో వర్షం కురుస్తున్నది.

🌸1905: నార్వే దేశం, స్వీడన్ దేశంతో దౌత్య సంబంధాలు తెంచుకుంది.

🌸1912: జపాన్ లోని టోక్యో నగరంలోని "గింజా" అనే చోట, మొట్టమొదటి సారిగా టాక్సి కేబ్ (అద్దె కారు- టాక్సీలు) లు ప్రారంభించారు.

🌸1914: మొదటి ప్రపంచ యుద్ధంలో, జర్మనీ దేశం, సోవియట్ యూనియన్ దేశం, మీద యుద్ధం ప్రకటించినప్పుడు, అమెరికాతనను తాను, తటస్థ దేశంగా ప్రకటించుకున్నది.

🌸1914: అమెరికా లోని ఒహాయో రాష్ట్రంలోని క్లీవ్‌లేండ్నగరంలో మొట్టమొదటి ట్రాఫిక్ లైట్లు ప్రారంభించారు.

🌸1923: ఇంగ్లీష్ ఛానెల్ని ఈదిన మొదటి అమెరికా ఈతగాడు హెన్రీ సల్లివాన్

🌸1962: నెల్సన్ మండేలాని నిర్బంధించి, చెఱ (ర) సాలలో బంధించారు.

🌸1963: ఆణ్వస్త్రాలు, భూమిలోపలే పరీక్షించాలి (వాతావరణంలో గాని, రోదసీలో గాని, నీటిలోపల గాని పరీక్షించకూడదు) అన్న మినహాయింపుతో అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపై అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్ దేశాలు సంతకాలు చేసాయి

🌸1963: అమెరికా, ప్రయోగించిన రోదసీ నౌక, మారినర్-7, మొట్టమొదటి సారి, కుజగ్రహం చిత్రాలను, ప్రసారంచేసింది.

🌸1973: ఇద్దరు ఆరబ్ తీవ్రవాదులు, ఏథెన్స్ లోని విమానాశ్రయంలో గుంపుగా ఉన్న ప్రయాణీకుల మీద కాల్పులు జరపగా, ముగ్గురు మరణించగ, 55 మంది గాయపడ్డారు.

🌸1984: జోన్ బెనోయిట్, స్త్రీల మొదటి ఒలింపిక్ మారథాన్గెలుచుకున్నది.

🌼జననాలు🌼

💝1896: తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి, లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు. (మ.1990)

💝1862: జోసెఫ్ కేరీ మెర్రిక్, ఏనుగు-మనిషి ఆకారంలో పుట్టిన వ్యక్తి. 27 సంవత్సరాలు బ్రతికాడు. (మరణం ఏప్రిల్ 11, 1890) .

💝1908: చక్రపాణి, బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత, దర్శకులు. (మ.1975)

💝1930: నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి మనిషి. (మ.2012)

💝1974: కాజోల్, భారతీయ సినీ నటి.

💝1982: జెనీలియా, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ సినిమా నటి.

💐మరణాలు💐

🍁1895: ఫ్రెడరిక్ ఎంగెల్స్, జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రచయిత, రాజకీయ సిద్ధాంతవాది, తత్త్వవేత్త. (జ.1820)

🍁1950: గోపీనాధ్ బొర్దొలాయి, స్వాతంత్ర్యానంతర అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. (జ.1890)

🍁1962: మార్లిన్ మన్రో, ప్రముఖ హాలీవుడ్ నటి. ఖాళీ నిద్రమాత్రల సీసాతో, ఆమె పడకగదిలో శవమై పడి ఉంది. (జ.1926)

🍁1991: సొయిఛిరో హోండా, హోండా కంపెనీ స్థాపకుడు., కాలేయ కేన్సర్ తో 84వ ఏట మరణించాడు (జ.1906)

🍁1984: రిచర్డ్ బర్టన్, హాలీవుడ్ నటుడు, తన 58వ ఏట మరణించాడు (జ.1925 నవంబరు 10)

🍁1997: బోడేపూడి వెంకటేశ్వరరావు, కమ్యునిష్టు నాయకుడు. (జ.1922)

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

క్యాలిక్యులేటర్ లో ఉండే ఈ GT, MU, M+, M-, MRC బటన్ల అర్థాలు, ఎందుకు వాడుతారో తెలుసా..?

ఇప్పుడంటే అన్నీ కంప్యూటర్ మయం అయిపోయాయి. దానికి తోడు స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం గడవదు. ప్రతీ దానికి యాప్ లు వచ్చేసాయి. ఇప్పుడంటే మనం సులభం గా పెద్ద పెద్ద అమౌంట్స్ కూడిక వెయ్యటానికి కాలిక్యులేటర్ యాప్ లను వాడుతున్నాం. అయితే ఫిజికల్ కాలిక్యులేటర్ వాడకం మాత్రం ఇంకా తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికీ షాపుల్లో, ఆఫీసుల్లో అకౌంట్స్ సెక్షన్స్ లో దీని అవసరం ఉంటూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాలిక్యులేటర్ ను సరిగా చూసినట్లయితే అందులో కొన్ని ప్రత్యేకమైన బటన్స్ ఉంటాయి. GT, MU, M+, M-, MRC ఇలా కొన్ని స్పెషల్ బటన్లు ఉంటాయి. కాలిక్యులేటర్ ను వాడే చాలా మందికి అవేంటో ఎందుకు వాడతారో తెలియదనే చెప్పాలి. అసలు ఆ బటన్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందామా... 1. GT - గ్రాండ్ టోటల్ (Grand Total) GT బటన్ మీకు గ్రాండ్ టోటల్ ను చెప్తుంది. అంటే ఉదాహరణకు 4 × 2 = 8 అని ఒక గుణకారాన్ని వేసుకుని తరువాత 7 × 6 = 42 అనే వేరే లెక్కను వేసారనుకోండి. ఇప్పుడు GT అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు టోటల్ 50 (08 + 42 = 50) అనే ఆన్సర్ వస్తుంది. సో ఇది పెద్ద పెద్ద మొత్తాలలో లెక్కలు చేసినప్పుడు ఈజీ గా గ్రాండ్ టోటల్ తెలుసుకోవడానికి పనికొస్తుంది. ఒకసారి ట్రై చ...

IIIT అప్లై చేసిన మీ 10th మార్క్స్ పెరిగితే ఏమి చేయాలి

ప్రధానోపాధ్యాయులకు/ప్రధానాచార్యులకు తెలియజేయునది. 10వ తరగతి పాసైన కొంతమంది విద్యార్థులకు IIIT అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత కొంతమంది విద్యార్థులకు రి వెరిఫికేషన్ మరియు రికౌంటింగ్ అప్లై చేసిన తర్వాత వారి మార్కులు మారి పెరగడం జరిగింది Already అప్లై చేసిన విద్యార్థులకు మరలా తిరిగి అప్లై చేసే అవకాశం లేదు కావున అట్లాంటి విద్యార్థుల కోసం కన్వీనర్ IIIT వారికి అడ్రస్ చేస్తూ గతంలో అప్లై చేసిన అప్లికేషన్ నంబర్తో ఒక రిక్వెస్ట్ లెటర్ ను రాస్తూ మార్కులు పెరిగిన తర్వాత కొత్తగా వచ్చిన మార్కులు మెమోని ఈ రిక్వెస్ట్ లెటర్ తో పాటు అటాచ్ చేసి ఈ క్రింది తెలిపిన రెండు Mail id లకు Convener Admissions RGUKT-AP •   convener.admissions@rgukt.in Assistant Registrar, Academics - RGUKT Nuzvid •   ar.academics@rguktn.ac.in  మెయిల్ చేసినట్లయితే పెరిగిన మార్కులను పరిగణలోకి తీసుకొని IIIT అవకాశం వచ్చే విధంగా కన్వీనర్ గారు చర్యలు తీసుకుంటారు. కావున ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయ/ప్రధానాచార్య మిత్రులు గమనించవలసిందిగా కోరుతున్నాం. IIIT అప్లై చేసిన మీ 10th మార్క్స్ రీవెరిఫికేషన్/రీకౌంటింగ్ లో పెరిగితే...

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ