తల్లి గర్భం నుండి మట్టి గర్భాన చేరే క్షణం వరకు ప్రతీ మనిషి ప్రయాణం ఒంటరే..
జననం ఒంటరి..
మరణం ఒంటరి..
నడుమ ప్రయాణం ఒంటరే..
నీ సంతోషం, బాధ, కష్టాలు, కన్నీళ్లు, ఎన్నో ఆరాటాలు, పోరాటాలు... అన్నీ నీవే.. నీకు నువ్వే ఎదురుకోవాలి..
నీ బాధే కాదు సంతోషం కూడా నేడు పంచుకోవటానికి ఎవరికి సమయం, విశాల హృదయం లేదు..
మాటల్లో మమకారం..
చేతల్లో లేదు ఎవరికి సహకారం...
తన స్వార్థం, తన సంటే మాత్రమే చూసుకునే ఈనాటి మనిషి... తనకి బాదొచ్చినా, సంతోషం వచ్చిన మనిషి కి సానుభూతి, స్పందన, అన్నీ సహకారం ఆశించే మనిషి ఎదుట వ్యక్తి విషయం లో ఆ సహకారం చూపే ఆస్కారం మాత్రం ఉండదు..
పేరుకే అందరూ.. అవసరం లో ఆపదలో ఎవరికి ఎవరు అండగా ఉండరు..
నీడ లో నీ నీడే నీకు తోడుండదు..
నీ పుట్టుక నుండి మరణం వరకు నీకు తోడుండేది.. నీ కష్టాల్లో నీకు ధైర్యం ఇచ్చేది కేవలం నీ ఆత్మ స్థైర్యం ఒక్కటే..
జీవితం లో యే సమస్య వచ్చిన, నీ లక్ష్యాన్ని కై, నీ ఆశలకై, నీ ఆశయాలకై.. చివరికి నీ మనసు తో, నీతో నువ్వు అయినా.. నీవే ఒంటరిగా యుద్ధం చెయ్ . పోరాడు..
గెలుపు లో అందరు నీ వెంటే..
అదే ఓటమి లో నీ గుండె ధైర్యం యే నీతోడు..
ఈ జీవితం నీది.. నీవే పోరాడు.. సాధించు.. అందులో గెలిచినా ఓడినా... ఆ గెలుపు నీదే..
జగమంతా కుటుంబం అయినా ఆపదలో అందరివి ఏకాకి జీవితాలే..
ఒంటరి అని మిగలక, కృంగక, ఒంటరిగా పోరాడి... గెలిచి ఓటమిని తరిమికొట్టు ఒక్కనివై...
Suri
ReplyDeleteSuri
ReplyDelete