స్వీటీ చదువుతో పాటు ఆటపాటల్లోనూ ఎంతో చురుగ్గా ఉంటుంది కానీ... నోరు తెరిస్తేచాలు వెంటనే అబద్ధం చెప్పేస్తుంది. దీంతో ఒక్కోసారి చిన్నారి నిజం చెప్పినా తల్లి నమ్మడం లేదు. కొంతమంది పిల్లలు ఇలాగే చేస్తుంటారు.
👉వారితో అబద్ధాలు మాన్పించాలంటే...
సాధారణంగా పిల్లలు భయంతోనే అబద్ధాలు చెబుతుంటారు. ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఆ విషయం తల్లిదండ్రులతో చెబితే కొడతారనే ఆందోళన... వారితో అలా మాట్లాడిస్తుంది.
🌿కాబట్టి ఆ తప్పును నిజాయతీగా ఒప్పుకుంటే దండించమనే భరోసా ఇవ్వాలి. అప్పుడే నిజం చెప్పడాన్ని అలవాటు చేసుకుంటారు.
🌿తల్లిదండ్రులతో అన్ని విషయాలనూ పంచుకునే చనువు పిల్లలకు ఉండాలి. భయపడకుండా స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం ఇంట్లో కల్పించాలి. అలా మాట్లాడుతుంటే ప్రోత్సహించాలి. సందర్భాన్ని బట్టి
చిన్నచిన్న కానుకలూ ఇస్తుండాలి.
చిన్నచిన్న కానుకలూ ఇస్తుండాలి.
ఇలా చేయడం వల్ల కొంతకాలానికి నిజం చెప్పడం వారి అలవాటుగా మారుతుంది.
కొంతమంది పిల్లలు తప్పుచేసి వెంటనే దాన్ని పక్కవాళ్ల మీదకు నెట్టేస్తుంటారు. దాంతో వారితో స్నేహం చేయడానికి ఎవరూ ముందుకు రారు.
ఈ విషయాన్ని వారికి అర్థమయ్యేట్లు చెప్పగలిగితే సమస్య పరిష్కారమవుతుంది.
Comments
Post a Comment