Skip to main content

నేటి మోటివేషన్... ఆపద దాటాలంటే...


ఆపద దాటాలంటే శత్రువుతో నైనా స్నేహం చెయ్యాలి. గండం తీరగానే శత్రువును దూరంగా వుంచాలి.  

ఒక మర్రిచెట్టు తొర్రలో ' రోమాంశుడు ' అనే పిల్లి , దగ్గరలో ఒక కన్నంలో ' పలితుడు ' అనే ఎలుక కాపురం వుంటున్నాయి.

ఒకరాత్రి వేటగాడు ఆ చెట్టుక్రింద వలపన్ని వెళ్ళాడు. తెల్లవారి చెట్టుదిగిన పిల్లి ఆవలలో చిక్కుకుని పోయింది. గిలగిలలాడసాగింది, తప్పించుకొనలేక. ఇంతలో ప్రక్కనే కన్నంలోనుంచి ఎలుక బయటకు వచ్చింది. తన శత్రువైన పిల్లి , వలలో చిక్కుకొనడం చూసి చాలా సంతోషించింది. 

పిల్లి ఎలుకని చూసి ' ఓ చిట్టెలుకా ! ఈ వలను నీ పదునైన పళ్లతో కొరికి నన్ను రక్షించు ' అని అడిగింది.
ఎలుక పకపకా నవ్వి ' సహజశత్రువైన నిన్ను రక్షించడమా ' అని పిల్లిని ఏడిపిస్తూ గంతులు వెయ్యసాగింది.  

ఇంతలో అక్కడికి గుడ్లగూబ వచ్చి ఎలుకని తన్నుకెళదామని అవకాశం కోసం చూస్తున్నది. అది గమనించి ఎలుక , పిల్లి వున్న వలదగ్గరకు వెళ్లి కొరుకుతున్నట్లు నటించసాగింది.  

యెంతసేపటికి ఎలుక దూరంగా రాకపోయేటప్పటికీ విసిగిపోయి గుడ్లగూబ వెళ్ళిపోయింది. గండం గడిచిందని ఎలుక మళ్ళీ పిల్లిని యేడిపిస్తూ గంతులు వెయ్యసాగింది.  

పిల్లి ఆశ్ఛర్యపోయి, ' ఓ మూషికమా ! ఇంతసేపు వలని యెందుకు కొరకలేదు ? కొరుకుతున్నట్లు యెందుకు నటించావు ? ' అని అడిగింది. దాని బాధచూసి జాలిపడి ఎలుక ఆ వలని కొరికి పిల్లి బయటకు రావడానికి మార్గం సుగమం చేసింది.  

వేటగాడువచ్చి వల కొరకబడి వుండడం, జంతువు పారిపోవడం చూసి, దిగాలుగా వెళ్లిపోయాడు.  

తొర్రలో దూరిన పిల్లి బయటకు వచ్చి ' మిత్రమా ! నీవు చేసిన సాయానికి నీకు మంచి భోజనం పెడతాను మా ఇంటికి విందుకురా' అని పిలిచింది. పిల్లి మాటలకు ఎలుక మళ్ళీ పకపకా నవ్వి ' ఓ మార్జాలమా ! గుడ్లగూబ నుంచి రక్షించుకోవడానికి కొంతసేపు నీతో స్నేహం చేశాను. దాని బారినుంచి బయటపడ్డాను. నిన్ను వుపయోగించుకున్నందుకు కృతజ్ఞతగా నీకు ప్రాణదానం చేశాను. మన యిద్దరి కష్టాలు గడిచాయి.'

' ఇప్పుడు ఆకలితో వున్న నువ్వు చేసే విందు నాకుకాదు. నీకు. నేను పొరపాటున నీ యింటికి వస్తే నువ్వే నన్ను విందారగిస్తావు. కనుక నేనురాను. మన స్నేహం ఇంతటితో సరి.' అంటూ తుర్రుమంది. ఎలుక తెలివికి పిల్లి ఆశ్ఛర్యపోయింది. తన యెత్తు పారలేదని బాధపడింది.  

' అవసరం వున్నంతవరకు ఆపద తీరేవరకు, శత్రువుతో నైనా తాత్కాలికంగా స్నేహం చెయ్యాలి తప్ప ఆ స్నేహం శాశ్వతంగా భావించకూడదు. '


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

INDIAN POLITY - (Telugu / English)

1. అనేక రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ ప్రాంతాల పాలన, నియంత్రణకు సంబంధించిన పత్యేక నిబంధనలు భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్‌లో ఉన్నాయి? జ: అయిదవ 2. అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు ఉద్దేశించిన నిబంధన ఏది? జ: నిబంధన- 29 3. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం సాంస్కృతిక, విద్యాయపరమైన హక్కులు కల్పించారు? జ: నిబంధనలు - 29, 30 4. మతం ప్రాతిపదికన భారతీయ పౌరుడికి ప్రభుత్వ పదవిని తిరస్కరిస్తే అతడికి ఏ ప్రాథమిక హక్కును లేకుండా చేసినట్లవుతుంది? జ: సమానత్వపు హక్కు 5. ప్రాథమిక హక్కుల సిద్ధాంతం దేన్ని సూచిస్తుంది? జ: పరిమిత ప్రభుత్వం 6. మతం లాంటి అంశాల మీద వివక్షను నిషేధించడం (భారత రాజ్యాంగం నిబంధన-15) దేని కింద వర్గీకరించిన ప్రాథమిక హక్కు? జ: సమానత్వపు హక్కు 7. భారత రాజ్యాంగంలో అంతర్జాతీయ శాంతిభద్రతలను ఎక్కడ పేర్కొన్నారు? జ:  రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు 8. భారత రాజ్యాంగం ఏడో షెడ్యూల్‌లోని కేంద్ర జాబితాలో ఉన్న అంశం ఏది? జ: గనుల్లోనూ, చమురు క్షేత్రాల్లోనూ శ్రమను, భద్రతను క్రమబద్ధం చేయడం 9. భారత రాజ్యాంగం నిబంధన 164(1) ప్రకారం మూడు రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమానికి మంత్రి ఉండాలి....