🔎సంఘటనలు🔍
🌸1787: అమెరికా రాజ్యాంగ ప్రతి తాలుకు, 60 (ప్రూఫ్ షీట్లు) పుటలను, అమెరికా రాజ్యాంగ సభ సమావేశానికి అందించారు.
🌸1806: పవిత్ర రోమన్ సామ్రాజ్యం అధికారికంగా ముగిసింది.
🌸1825: బొలీవియాకు స్వాతంత్ర్యం, 300 సంవత్సరాలు స్పెయిన్ పాలకుల చేతిలో నలిగి పోయిన బొలీవియా 1825 ఆగష్టు 6 న స్వతంత్ర రిపబ్లిక్ గా ఏర్పడింది.
🌸1861: బ్రిటన్, నైజీరియాకు చెందిన, లాగోస్ ని, తన సామ్రాజ్యంలో కలుపుకున్నది.
🌸1889: ప్రైవేట్ స్నానాలగదులు కలిగిన, మొదటి బ్రిటిష్ హోటల్, "సావోయ్ హోటల్" లండన్ లో ప్రారంభమైంది.
🌸1890: న్యూయార్క్ లో ఉన్న, ఆబర్న్ జైలులో, విద్యుత్ కుర్చీ మీద కూర్చుని మరణశిక్ష అనుభవించాలని, శిక్ష విధించబడిన మొదటి వ్యక్తి హంతకుడు విలియమ్ కెమ్లెర్.
🌸1915: మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, వార్సా, జర్మనీచేతుల్లోకి వచ్చింది.
🌸1926: గెర్త్రుడ్ ఏడెర్లె, ఇంగ్లీష్ ఛానల్ ని, 14 గంటల 30 నిమిషాలలోమ్ ఈదిన మొదటి మహిళ.1926 ఆగష్టు 6 రోజు ఉదయం 07:05 వద్ద ఫ్రాన్స్ లో కాప్ గ్రిస్-నెజ్ వద్ద మొదలు పెట్టి, 14 గంటల 30 నిమిషాల తరువాత, ఆమె కింగ్స్‌డౌన్, కెంట్, ఇంగ్లాండ్ వద్ద ఒడ్డుకి వచ్చింది. 1950లో, ఫ్లోరెన్స్ చాడ్విక్ 13 గంటల 20 నిమిషాల్లో ఇంగ్లీష్ ఛానెల్ ని ఈదినంతవరకు, ఆమె నమోదు చేసిన రికార్డు అలాగే ఉంది.
🌸1945: హిరొషిమా మీద బాంబ్ ప్రయోగించబడింది. 1945 ఆగష్టు 6 న 'ఎనొల గే' అనే అమేరికా బి-29 బాంబర్ (బాంబులను ప్రయోగించడానికి వాడే విమానం), మొదటి సారి ఒక అణ్వాయుధాన్ని జపాన్ లోని, హిరోషిమా పట్టణం పైన విడిచింది. ప్రపంచ చరిత్రలో, అణ్వాయుధాన్ని ఒక దేశం పై ప్రయోగించడం అదే ప్రథమం. ప్రయోగించిన కొద్ది నిముషాల్లొనే మహా విస్పొటనం సంభవించింది. దీని నుంచి వెలువడిన అగ్నిక్షనాలోనే పట్టణం అంతా వ్యాపించి భస్మం చేసింది. ఈ విస్ఫోటనంలో, 70, 000 అక్కడికక్కడే మరణించారు. అంటే ఈ సంఖ్య హిరోషిమా పట్టణ జనాభాలో మూడవ వంతు. మళ్ళీ, మూడవ రోజు, అతి పెద్ద తీరప్రాంత పట్టణమైన, నాగసాకి పై, అటువంటిదే, మరో అణ్వాయుధాన్ని అమెరికా ప్రయోగించింది. దీనితో జపాన్ రెండవ ప్రపంచ యుద్ధం లో, అమెరికాకు, లొంగి పోక తప్పలేదు. ఇది ప్రపంచ చరిత్ర లోనే, అతి ఖరీదైన యుద్ధం గా, మిగిలి పోయింది. రెండు పట్టణాలు మరల నిర్మించ బడ్డాయి, కాని, మానవ చరిత్రలో మరిచి పోలేని పీడ కలగా ఈ సంఘటన మిగిలి పోయింది. 1945 ఆఖరికి 2 లక్షల మందికి పైగా, యుద్దబాధితులుగా మిగిలారు. వీరిలో చాలామంది జీవించ గలిగినా, తరువాత చాలా వ్యాధులకు గురయ్యారు.
🌸1961: రష్యా వ్యోమగామి (కాస్మోనాట్) మేజర్ ఘెర్మన్ టితోవ్రోదసీలో ఒక రోజు (24 గంటలు) గడిపి, ప్రపంచాన్ని, ఆశ్చర్యంలో, ముంచాడు.
🌸1962: జమైకాకు స్వాతంత్ర్యం. 300 సంవత్సరాలు బ్రిటిష్ పాలకుల క్రింద వున్న జమైకా 1962 ఆగష్టు 6 న స్వతంత్ర దేశంగా ఏర్పడింది.
🌸1991: వరల్డ్ వైడ్ వెబ్ (www) ఇంటర్నెట్ లో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన రోజు. అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి సర్ టిమ్ బెర్నెర్స్ లీ.
🌸1991: ఆగస్టు 6 1991న చుండూరు, ఆంధ్రప్రదేశ్ గ్రామంలో దళితులపై అగ్రకులస్తులు(రెడ్డి, తెలగలు) చేసిన దాడి, హత్యాకాండలను చుండూరు ఘటనగానూ, చుండూరు హత్యాకాండగానూ అభివర్ణిస్తారు.
🌸1997: శ్రీలంక క్రికెట్ జట్టు టెస్ట్ క్రికెట్‌లో 6 వికెట్లకు 952 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.
🌼జననాలు🌼
💕1890: మల్లెల దావీదు, తెలుగు క్రైస్తవ కీర్తనాకారుడు. (మ.1971)
💕1912: కొత్త రఘురామయ్య, రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియూ లోక్‌సభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా పనిచేశాడు. (మ.1979)
💕1931: గడ్డవరపు పుల్లమాంబ, రచయిత్రి, స్త్రీల సాహిత్య వేదిక స్థాపకురాలు.
💕1933: ఎ.జీ. కృపాల్ సింగ్, భారత టెస్ట్ క్రికెట్ ఆటగాడు. (మ.1987)
💕1934: కొత్తపల్లి జయశంకర్, తెలంగాణా సిద్ధాంతకర్త, తెలంగాణా పితామహుడు. (మ.2011)
💕1943: కె.శివారెడ్డి, సుప్రసిద్ధ వచన కవి, అభ్యుదయ కవి, విప్లవకవి.
💕1881: అలెగ్జాండర్ ఫ్లెమింగ్, పెన్సిలిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1955)
💕1809: అల్ఫ్రెడ్ టెన్నిసన్, ఆంగ్ల కవి. (మ.1892)
💐మరణాలు💐
🍁1925: సురేంద్రనాథ్ బెనర్జీ, భారత జాతీయోద్యమ నాయకుడు. (జ.1848)
🍁1951: ఆచంట రుక్మిణమ్మ
🍁1962: ఆచంట లక్ష్మీపతి, ఆయుర్వేద వైద్యుడు, సంఘసేవకుడు. (జ.1880)
🍁1978: పోప్ పాల్ VI, తన 80వ ఏట, తన వేసవి విడిది వద్ద గుండెపోటుతో మరణించాడు.
🍁1981: దండమూడి రాజగోపాలరావు, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (జ.1916)
🍁1986: విలియం J స్క్రోడర్స్, మనిషి చేసిన కృత్రిమ గుండె (జార్విక్ VII) తో, ఎక్కువ కాలం (620 రోజులు) బ్రతికాడు.
🍁2012: కె.ఎస్.ఆర్.దాస్, తెలుగు, కన్నడ సినిమా దర్శకుడు. (జ.1936)
🍁2019: సుష్మాస్వరాజ్ భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి (జ.1952)
🍁2020: సోలిపేట రామలింగారెడ్డి, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే (జ.1961)
🇮🇳జాతీయ / దినాలు🇮🇳
👉 1825: బొలివియా స్వాతంత్ర్యదినోత్సవం.స్పెయిన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నది. ప్రపంచం 1847 జూలై 21 లో గుర్తించింది.
👉 1962: జమైకా స్వాతంత్ర్యదినోత్సవం.
👉 హిరోషిమా దినోత్సవం.
Comments
Post a Comment