సమాజంలో 90శాతం మంది ఆలోచనలు ఎదుటి వారిని ఒప్పించడం కోసమే ఉంటాయి. ఫలానా పని చేస్తే వాళ్లేం అనుకుంటారో, వీళ్లేమనుకుంటారో అనే ఆలోచనల్లో మునిగి తేలుతారు. అందుకే ఏ పని కూడా స్వేచ్ఛగా చేయలేరు. ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి.. ఈ ప్రపంచంలో మీ గురించి అదేపనిగా ఆలోచించేది మీ ఒక్కరు మాత్రమే. మిగతావాళ్లంతా వాళ్ల గురించి వాళ్ళు ఆలోచించుకోవడంలో బిజీగా ఉంటారు. అప్పుడప్పుడు మీ గురించి మాట్లాడతారేమో గానీ, మీ గురించి మాట్లాడడమే పెట్టుకుంటే వాళ్ల పనులు, జీవితం ఆగిపోతుంది.
చిన్న ఉదాహరణ చెబుతాను.. ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతోంది అనుకుంటే.. మనలో చాలామంది మనం సెంటర్ పాయింట్ లో ఉండి, మిగతావాళ్లంతా మనల్ని చూస్తూ, మనల్ని జడ్జ్ చేస్తూ ఉంటారన్న భ్రమలో ఉంటాం. విచిత్రమేమంటే మీరు నేనే కాదు, మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరు కూడా తామే సెంట్రల్ పాయింట్ లో ఉన్నామని.. తాము మిగిలిన వాళ్ళను ఇంప్రెస్ చేయాలని తాపత్రయపడుతుంటారు. ఇదంతా అబద్ధం. అన్ని పనులు పక్కన పెట్టి అదే పనిగా ఎవరూ మనల్ని గమనిస్తూ కూర్చోరు.
కాబట్టి ఇతరులను కన్విస్ చెయ్యడం కోసం మీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకండి. మీకు ఏం చేయాలి అనిపిస్తే అది మాత్రమే చేయండి. అది తప్పయినా ఒప్పయినా! ఇతరులను ఎక్కువగా పట్టించుకోవడం వలన మనలో ఆత్మనూన్యతా పెరిగిపోతుంది. ఏ పనీ స్వేచ్ఛగా చేయలేం. ఏ పని చేయాలన్నా మన చుట్టూ ఉన్న ముఖ్యమైన 10 మంది వ్యక్తులు గుర్తొస్తారు. వాళ్ళు ఎలా ఫీలవుతారో అన్న ఆలోచనలు చుట్టుముడతాయి. ఇదంతా ఒక విషవలయం దానినుండి వీలైనంత త్వరగా బయటకు వచ్చి ఒక స్వేచ్ఛా జీవి గా మీ జీవితాన్ని మీకు మీరు ఆస్వాదించటం మొదలు పెట్టండి.
Comments
Post a Comment