ఒక ఉన్నతాధికారి రిటైర్ అయ్యాకా తన విశ్రాంతజీవితానగ్ని గడపడానికి గేటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్ కొనుక్కుని స్థిర పడ్డాడు. రోజూ సాయంత్రం వాకింగ్ చేస్తూ తాను గొప్ప అధికారినని, తనను ఎవ్వరూ స సరిగ్గా గుర్తించడం లేదనిలోలోపల ఉక్రోషంతో, చిరాకు పడుతూ ఆవిషయాన్ని రోజూ అక్కడే పార్క్ లో కూర్చున్న మరొక వ్యక్తితో చెపుతూ ఉండేవాడు. కొద్ది రోజులు ఓపికగా ఆయన గొప్పలు విన్న ఆ పెద్దాయన నెమ్మదిగా ఇలా చెప్పాడు.
ఇక్కడున్న పెద్దల మందరం ప్రస్తుతం ఫ్యూజ్ లేని బల్బులు / పనైపోయిన ట్యూబులైట్లు లాంటి వాళ్ళమే. అది 20 ఓల్ట్స్, 40 ఓల్ట్స్, 60 ఓల్ట్స్, 100 ఓల్ట్స్, ఎంతైనా ఇక్కడ అందరూ ఒకటే టైపుఅంటూ.. నేను రెండుసార్లు పార్లిమెంటేరియన్ గా మంత్రిగా ఎన్నో పదవులు భాధ్యతగా నిర్వర్తించి విశ్రాంతిగా జీవితం ఇక్కడ ఆనందంగా గడుపుతున్నాను.
అదిగో. అక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఒకరు నాసా డైరెక్టర్ గా రిటైర్డ్, ఒకరు మిలటరీ జనరల్ గా రిటైర్డ్, మరొకరు సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి, ఇంకొకరు ప్రఖ్యాతిచెందిన వైద్యుడు, ఇంకొకరు పేరుగాంచిన చార్టెడ్ అకౌంటెంట్, ఇంకొకరు దేశంలో పేరెన్నికగన్న లాయర్, మరొకరు ప్రపంచంలో అత్యంత పెద్ద కంపెనీలకు ఆ అధిపతి, వాళ్ళెవరూ నాకు చెప్పలేదు.నేనే తెలుసుకున్నాను.
ఉదయించే సూర్యుడు,అస్తమించే సూర్యుడు ఒకేరకమైన శక్తినిస్తారని తెలిసీనా.. మన దేశంలో ఉదయించే సూర్యశక్తికి ఆర్య మిచ్చి పూజచేస్తారు కానీ అస్తమించే సూర్యుడుకి కాదు. దానీని గౌరవించి నమస్కరిస్తారంతే!
ఇది గుర్తుపెట్టుకుని ఒకప్పుడు మనం ఏమిటి అన్నది కాదు, ఇప్పుడు ఏమిటి అని ఆలోచించుకుంటే విశ్రాంత జీవితాన్ని కూడా ప్రశాంతగా గడపగలుగుతాము అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
పాపం జీవిత సంధ్యాసమయంలో అవసానదశలో కూడా ఇంకా కీర్తి కండూతి కోసం వెంపర్లాడే పెద్దాయన ఆలోచనలో పడిపోయాడు.
మనిషి జీవుతంలో వాస్తవపరిస్థితులు ఎరిగి సత్యంలో జీవిస్తే జీవితమంతా ఆనందమే కదా...!
🙏🙏 🙏🙏🙏
Comments
Post a Comment