Skip to main content

చరిత్రలో ఈ రోజు ఆగష్టు / - 18

🔎సంఘటనలు🔍

🌸1274: ఇంగాండ్ రాజుగా ఎడ్వర్డ్- I పట్టాభిషేకం జరిగింది.

🌸1833: కెనడాకు చెందిన రాయల్ విలియం, పేరు గల మొదటి ఓడ (ఆవిరి శక్తితో నడిచే ఓడ) నోవా స్కోటియా నుంచి ది ఐస్ల్ ఆప్ విఘట్ వరకూ, పూర్తిగా తన ఆవిరి శక్తితోనే, ప్రయాణించి అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటింది. ఆ ఓడ, నొవా స్కొటియా నుంచి ప్రయాణం మొదలుపెట్టిన రోజు,

🌸1835: మసాచుసెట్స్ లోని స్ప్రింగ్‌ఫీల్డ్కి చెందిన సోలిమన్ మెర్రిక్, మనం వాడుతున్న రెంచ్కి పేటెంట్ పొందాడు.

🌸1868:గుంటూరులో సంపూర్ణ సూర్య గ్రహణాన్ని చూస్తూ పియరీ జూల్స్‌ సీజర్‌ హాన్సెన్‌ అనే శాస్త్రవేత్త హీలియం ఉనికిని కనుగొన్నాడు.

🌸1891:న్యూయార్క్ నగరంలో మొట్టమొదటి సారిగా ప్రజల కోసం స్నానాల గది" ని ఏర్పాటు చేసారు.

🌸1903: మొట్టమొదటి పులిట్జర్ బహుమతి ఇచ్చిన రోజు. కొలంబియా విశ్వవిద్యాలయా నికి జోసెఫ్ పులిట్జర్ మిలియన్ డాలర్లు దానం. ఈ డబ్బును పులిట్జర్ బహుమతి కి, నిధిగా వాడుకుంటూ, దానం చేసిన జోసెఫ్ పులిట్జర్ పేరు మీదుగా, ఈ బహుమతికి పులిట్జర్ పేరు మీదుగా బహుమతులు ఇవ్వటం మొదలు పెట్టారు.

🌸1915: టెక్సాస్ లోని గాల్వెస్టన్ నగరాన్ని, హరికేన్ (తుఫాను) తాకి 275 మంది మరణించారు.

🌸1915: డెట్రాయిట్ నగరానికి చెందిన ఛార్లెస్ ఎఫ్. కెట్టెరిన్గ్ఎలెక్ట్రిక్ ఆటోమొబైల్ సెల్ఫ్-స్టార్టర్ కి పేటెంట్ పొందాడు.

🌸1959: 7.5 మేగ్నిట్యూడ్ మీద జరిగిన భూకంపం వలన క్వేక్ లేక్ ఏర్పడింది. భూకంపం వలన ఏర్పడిన సరస్సు కాబట్టి, "భూకంప సరస్సు" (క్వేక్ లేక్) అని పేరు పెట్టారు.

🌸1960: గాబన్ దేశపు స్వాతంత్ర్య్య దినోత్సవము.

🌸1999: టర్కీలో జరిగిన భూకంపంలో (7.4 మేగ్నిట్యూడ్), 17, 000 మందికి పైగా మరణించారు

🌸2006: నెట్‌వర్క్ సమస్య మూలంగా, వికిమీడియా సర్వర్లు 3 గంటలపాటు పనిచేయలేదు.

🌸2008: పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ తన రాజీనామాను ప్రకటించాడు.

🌸2011: నేడు, లోక్‌సభ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (సవరణ) బిల్లు 2011ని ఆమోదించింది. దేశంలో, మరింత మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించటం, ఈ బిల్లు ఉద్దేశం. అలాగే, గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే వైద్యులను ప్రోత్సహించటానికి, కావలసిన చర్యలు కూడా తీసుకున్నారు. ప్రైవేటు రంగంలో, వైద్యకళాశాలలు స్థాపించే వారికి, మరిన్ని సౌకర్యాలు, వెసులుబాట్లు కల్పించారు. రాబోయే, 5 ఏళ్ళలో, వైద్య విద్యార్థుల కోసం 15, 000 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను పెంచుతారు.

🌸2011: జిప్మెర్, పుదుచ్చెర్రీ చట్టము 2008కి సవరణగా, ప్రతిపాదించిన, జిప్మెర్ (జవహర్ లాల్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‍గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్), పుదుచ్చెర్రీ (సవరణ) బిల్లు 2011 ని, లోక్‍సభ ఆమోదించింది.

🌸2011: రాజ్యసభ, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్ర సేన్పై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించి, అతనిని పదవినుంచి తొలగించమని కోరింది. 1990లో న్యాయవాదిగా ఉండగా 24 లక్షల రూపాయల దుర్వినియోగం చేసాడని నేరారోపణ.

🌸2011: పాఠశాల విద్యార్థులకు ఇచ్చే, నేషనల్ కేడెట్ కోర్ (ఎన్.సి.సి) శిక్షణ కోసం, 2010 సంవత్సరంలో, 707 కోట్లు ఖర్చుపెట్టగా, 79 మంది కేడెట్లు మాత్రమే సైనిక దళాలలో చేరారు.

🌸2011: సాధారణ వర్గానికి (జనరల్ కేటగిరి), సూచించబడినటువంటి, కనీస అర్హత మార్కులలో, 10 శాతం కంటే తక్కువ మార్కులు, పొందకపోతే, ఒ.బి.సి విద్యార్థులు 27 శాతంరిజర్వేషన్లు కోటా కింద ప్రవేశానికి అర్హులు అని సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది.

🌸2018: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణం చేశాడు.

🌸2018: 18 వ ఆసియా క్రీడలు ఇండొనీషియా రాజధాని జకార్తాలో ప్రారంభమయ్యాయి.

🌼జననాలు🌼

💞1587: వర్జీనియా డేర్, ఆంగ్లేయ దంపతులకు, అమెరికా నేల మీద, పుట్టిన మొదటి బిడ్డ.

💞1650: సర్వాయి పాపన్న, గెరిల్ల సైన్యాన్ని తయారు చేసి, ఆ సైన్యం ద్వారా మొగలు సైన్యం పై దాడి చేసినవాడు. (మ.1709)

💞1685: బ్రూక్ టేలర్, గణితంలో టేలర్ థీరమ్ (టేలర్ సిద్ధాంతం) కనుగొన్న గణితమేధావి.

💞1700: పేష్వా బాజీరావ్ I మరాఠా సామ్రాజ్యానికి చెందిన 6వ పేష్వా. (మ.1740)

💞1734: రఘునాథరావ్ మరాఠా సామ్రాజ్యానికి చెందిన 13వ పేష్వా (మ.1783)

💞1792: లార్డ్ జాన్ రస్సెల్, ఇంగ్లాండ్ ప్రధానమంత్రి (1846 నుంచి 1852 వరకు, 1865 నుంచి 1866 వరకు) .

💞1904: జాన్ విట్నీ, పబ్లిషర్, డిప్లొమాట్.

💞1920: హర్భజన్ సింగ్ పంజాబీ రచయిత, విమర్శకుడు, సాహిత్యకారుడు, అనువాదకుడు. (మ.2002)

💞1925: సుభద్రా శ్రీనివాసన్, ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకురాలు. (మ.1972)

💞1941: జయకృష్ణ, భారతీయ సినిమా నిర్మాత. (మ.2016)

💞1959: నిర్మలా సీతారామన్, భారతీయ రాజకీయ నాయకురాలు, మోడీ మంత్రివర్గంలో సహాయఆర్ధికమంత్రి.
💐మరణాలు💐

🍁1227: చెంఘిజ్ ఖాన్, మంగోలియాకి చెందినవాడు (జ.1162).

🍁1945: సుభాష్ చంద్రబోస్, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1897)

🍁1953: మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ, మహబూబ్ నగర్ జిల్లాలోని ఒకనాటి గద్వాల సంస్థానాన్ని పాలించిన మహారాణి.

🍁1998: ప్రొతిమా బేడి, ఒడిస్సీ సాంప్రదాయ భారతీయ నృత్య కళాకారిణి. (జ.1948)

🍁2006: కొండపల్లి పైడితల్లి నాయిడు, 11వ, 12వ, 14వ లోక్‌సభ లకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు (జ.1930) .

🍁2018: చెన్నుపాటి విద్య, లోక్‌సభ మాజీ సభ్యురాలు (జ. 1934).

🍁2018: కోఫీ అన్నన్, ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరణం (జ. 1939).

🍁2018: వేదగిరి రాంబాబు, రచయిత, హైదరాబాదులో మరణం (జ.1952)..

🍁2020: ఎడ్మ కిష్టారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (జ. 1947)

🇮🇳జాతీయ / దినాలు🇮🇳

👉 ప్రపంచము - ప్రపంచ హీలియం దినము.

👉 1960: గాబన్ దేశపు స్వాతంత్ర్య దినోత్సవము.

👉 2011: జొరాస్ట్రియన్లు లేదా పార్శీలు తమ నూతన సంవత్సరాన్ని నవ్‌రోజ్ని ఈరోజు జరుపుకుంటున్నారు. 3000 సంవత్సరాల క్రితం పెషాడియన్ వంశానికి చెందిన "షా జమ్‌షెడ్" సింహాసనం ఈ నవ్‌రోజ్ నాడు ఎక్కాడు. నవ్ అంటే కొత్త, రోజ్ అంటే రోజు అని పార్శీలు చెబుతారు. ఈ పవిత్రమైన రోజున అగ్నిదేవాలయంకి వెళతారు. బంధు, మిత్రులతో కలిసి, పెద్ద పండుగ, చేసుకుని, విందు, వినోదాలతో గడుపుతారు. నవ్‌రోజ్ ముందు రోజుని, "పాతేటి అంటారు. గత సంవత్సరం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారు "పాతేటి" రోజున. ముంబైలో హోటళ్లు, భోజన ప్రియులైన పార్శీల కోసం, ప్రత్యేక మైన వంటలు చేస్తాయి

👉 అంతర్జాతీయ స్వదేశీ దినం.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

తెలుసుకుందాం...

🌸జవాబు: గోత్రం అంటేనే అద్భుతమైన సైన్సు. ఈ శాస్త్రం ప్రకారం మన పూర్వీకులు గోత్ర విధానాన్ని ఎలా ఏర్పాటు చేశారో గమనించండి. మీరు పూజలో కూర్చున్న ప్రతిసారీ పూజారి మీ గోత్రం గురించి  ఎందుకు అడుగుతారో మీకు తెలుసా? _తెలీదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు?_ 💐గోత్రం వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు-  జీన్-మ్యాపింగ్. అది ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం  పొందిన అధునాతన శాస్త్రమే! 👉🏻 గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి? 👉🏻 మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది?  👉🏻 వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనం ఎందుకు భావిస్తాము? 👉🏻 కొడుకులకు ఈ గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది, కుమార్తెలకు ఎందుకు రాదు? 👉🏻 వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా/ఎందుకు మారాలి? 👉🏻 తర్కం ఏమిటి? 💐ఇది మనం అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం.   మన గోత్ర వ్యవస్థ వెనుక  జన్యుశాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం! గోత్రమ్ అనే పదం రెండు సంస్కృత పదాల నుంచి ఏర్పడింది.   మొదటి పదం 'గౌ'- అంటే ఆవు, రెండవ పదం 'త్రాహి' అంటే కొట్టం. గోత్రం అంటే 'గోశాల' అని అర్థం. జీవశాస్త్ర పరంగా, మానవ శరీరంలో 23 జతల క్...

నేటి మోటివేషన్... ఉద‌యం 8 లోపు చేసే (S.A.V.E.R.S.)….అనే ఈ 6 అల‌వాట్లు మీ జీవితాన్నే మారుస్తాయ్.!

హాల్ ఎలోర్డ్ అనే ప్ర‌ముఖ ర‌చ‌యిత రాసిన “ద మిరాకిల్ మార్నింగ్” అనే బుక్ లో ఉద‌యం 8 లోపు చేసే 6 ప‌నులు మ‌న జీవితాన్నే మారుస్తాయ్ అని చాలా స్ఫ‌ష్టంగా చెప్పాడు. కార్ యాక్సిడెంట్ అయ్యి కోమాలోంచి బ‌య‌ట‌ప‌డ్డ ఈ ర‌చ‌యిత ఇప్పుడు త‌న ర‌చ‌న‌ల‌తో ప్ర‌పంచాన్ని ఆలోచింప‌జేస్తున్నాడు. ఆనందానికి 6 అంశాల సూత్రం. S.A.V.E.R.S S-Silence( నిశ్శ‌బ్దం)....మ‌న ప్ర‌తి రోజును చాలా నిశ్శ‌బ్దంగా ప్రారంభించాలి…అంటే ప్ర‌శాంత‌త‌తో స్టార్ట్ చేయాలి..లేవ‌డం లేట‌య్యింది…అయ్యే ఎలా…? ఆఫీస్ ప‌ని…ఈ రోజు అత‌డిని క‌లుస్తాన‌ని చెప్పాను…ఎమోయ్…టిఫిన్ అయ్యిందా…..ఇదిగో ఇంత‌లా హైరానా ప‌డొద్దు… ప్ర‌శాంతంగా లేవ‌గానే….కాసింత సేపు మెడిటేష‌న్ చేయండి. లేదా…క‌ళ్ళు మూసుకొని ప్ర‌శాంత‌త‌ను మీ మ‌న‌స్సులోకి ఆహ్వానించండి. ఇక్క‌డే మ‌న రోజు ఎలా గ‌డుస్తుంది? అనేది డిసైడ్ అయిపోతుంది . A-Affirmations ( నీతో నువ్వు మాట్లాడుకోవ‌డం)…. అంద‌రి గురించి, అన్ని విష‌యాల గురించి అన‌ర్గ‌లంగా మాట్లాడే మ‌నం…మ‌న‌తో మ‌నం ఒక్క‌సారి కూడా మాట్లాడుకోలేక‌పోతున్నాం. అస‌లు మ‌న‌లోని మ‌న‌కు ఏం కావాలి? పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళ‌ల్లో ఖ‌చ్చితంగా ఈ ల‌క్ష‌ణం ఉంటుంది. ఈ మూడు పా...