Skip to main content

నేటి మోటివేషన్... తల్లిదండ్రులారా ఈ తప్పులెవరివి?


పిల్లలపై అత్యంత ప్రభావం చూపేది కుటుంబం, కుటుంబ వాతావరణం, తల్లిదండ్రుల ప్రవర్తన,
 వారి పెంపకం. 

కానీ ఈ వాస్తవాన్ని అంగీకరించేందుకు, ఆ బాధ్యతను అంగీకరించేందుకు మనం సిద్ధంగా లేము.

 ఎందుకంటే... మన పిల్లలు తప్పుదారి పట్టడానికి మనమే కారణమని అంగీకరించలేము.

 తల్లిదండ్రులందరూ తప్పు చేశారనను, చేస్తున్నారనను. పెళ్లయ్యాక పిల్లలు పుట్టడం సహజంగా జరిగే చర్య. కానీ పిల్లల పెంపకం అంత సులువుగా, సహజంగా జరిగే చర్య కాదు. 

అదో సైన్స్, ఆర్ట్. ఏ వయసులో పిల్లలు ఎలా పెరుగుతారో, ఎలా ఆలోచిస్తారో, ఎలా స్పందిస్తారో తెలియకుండానే, తెలుసుకోకుండానే పిల్లల్ని పెంచేస్తున్నాం. 

ఫలితమే ఇలాంటి సమస్యలు.

మరి_ఈ_తప్పులెవరివి?

❓ఉదయం లేచింది మొదలు మొబైల్ లేదా ల్యాప్ టాప్ పై గడిపే తండ్రి తన కూతురు మొబైల్ ఫోన్ కు అడిక్ట్ అయ్యొందంటూ కౌన్సెలింగ్ కు తీసుకువచ్చారు. ఆ మొబైల్ కొనిచ్చిందెవరు? ఎవర్ని చూసి ఆమె మొబైల్ వాడకం నేర్చుకుంది? నువ్వు చేస్తుంది ఏంటి డాడీ అని ఆ అమ్మాయి అడిగితే ఆ తండ్రి ఏం సమాధానం చెప్తాడు?

❓చదువుకోసం, బంగారు భవిష్యత్తు అందించేందుకు కొడుకుని చిన్నప్పటినుంచీ ఇంటికి దూరంగా రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో చదివించిన తల్లిదండ్రులు ఇప్పుడు అమెరికాలో స్థిరపడిన కొడుకు తమను పట్టించుకోవడంలేదని బాధపడుతూ కౌన్సెలింగ్ కు వచ్చారు. బంధాలు, అనుబంధాలకు దూరంగా మార్కులు, ర్యాంకులకు దగ్గరగా పెంచి, ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం?

❓కెనడాలో స్థిరపడిన ఓ భారతీయ కుటుంబం తమ కూతురు ఆల్కహాల్ కు అడిక్ట్ అయ్యిందంటూ సంప్రదించారు. కానీ తాగడం తమ దగ్గరినుంచే నేర్చుకుందనే విషయం దాచిపెడతారు. ఎవర్ని మోసం చేసేందుకు?

❓విజయవాడకు చెందిన ఓ వ్యాపారకుటుంబం తమ కూతురికి రోజుకు మూడు వేలు... ఎస్, రోజుకు మూడువేలు పాకెట్ మనీ ఇచ్చారు. అంత పాకెట్ మనీ ఇవ్వడం గర్వంగా ఫీలయ్యారు. ఇప్పుడదే సమస్యగా మారింది. కౌన్సెలింగ్ కు వచ్చారు. కూతురుకి రోజుకు మూడువేలిచ్చిన తండ్రి నా ఫీజు మాత్రం వెయ్యి తగ్గించి ఇచ్చాడు. దేనికి డబ్బు ఖర్చు పెట్టాలో, ఎక్కడ పొదుపుగా ఉండాలో తల్లిదండ్రులకే తెలియకపోతే ఆ పిల్లకెలా తెలుస్తుంది?

❓సౌత్ ఆఫ్రికాలో ఉద్యోగం చేస్తున్న యువకుడు ఒంటరితనంతో బాధపడుతున్నానంటూ సంప్రదించాడు. తన కుటుంబ సభ్యులు తన సంపాదన కోసమే చూస్తున్నారు తప్ప తనను పట్టించుకోవడంలేదని ఏడ్చేశాడు.

❓తిరుపతి చెందిన ఓ తండ్రి అమెరికాలో చదువుతున్న కొడుక్కి కారు కొనిపెట్టాడో తండ్రి. అతను దారితప్పి ఇండియాకు వచ్చేశాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కౌన్సెలింగ్ కు తీసుకొచ్చారు. చదువుకునే కొడుక్కి కారు ఎందుకనే ప్రశ్న తండ్రికి రాలేదు. అవసరానికి (నీడ్) ఆడంబరానికి (వాంట్) మధ్య తేడా తెలీకుండా పెంచి ఇప్పుడు బాధపడితే ఏం ప్రయోజనం? కొడుక్కి కారు కొనిచ్చిన తండ్రి కౌన్సెలింగ్ ఫీజు దగ్గర మాత్రం కూరగాయల బేరాలాడటం కొసమెరుపు.

ఏం_నేర్పిస్తున్నాం?

⁉ కొడుకు ప్రాజెక్టు వర్క్ కోసం ఆపీసు నుంచి ప్రింట్లు తీసుకొచ్చే తండ్రి పరోక్షంగా అతనికి ఏం నేర్పిస్తున్నాడు?

⁉ నచ్చిన చీర కొనుక్కుని ఆ విషయం భర్తకు చెప్పొద్దని చెప్పే తల్లి ఆ కూతురుకి ఏం నేర్పిస్తుంది?

⁉ పిల్లల ఎదురుగా భర్త లేదా భార్యతో గొడవపడటం ద్వారా మీరేం నేర్పిస్తున్నారు?

⁉ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు నవ్వుతూ ఆహ్వానించి, వారు వెళ్లిపోగానే విమర్శించే మీనుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారో తెలుసా?

⁉ లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిని తల్లిపై బిడ్డలకు ఏం గౌరవం ఉంటుంది?

⁉ పిల్లలు చదువుతుండగా మీరు టీవీ చూస్తుంటే వారిపట్ల మీకేం శ్రద్ధ ఉన్నట్లు?

⁉ పిల్లల్ని కూర్చోబెట్టుకుని జబర్దస్త్ లాంటి షోలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే విలువలు ఎక్కడినుంచి వస్తాయి?

⁉ మార్కులు, ర్యాంకుల గురించి కాకుండా ఇతర విషయాల గురించి మీరెప్పుడైనా మాట్లాడారా? వారి ఇష్టాయిష్టాలేమిటో తెలుసుకున్నారా? అసలు వారికిష్టమైన కోర్సు చదవనిచ్చారా?

⁉ చదువుల పేరుతో లక్షలకు లక్షలు ఖర్చుచేస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన తీరులో ఆలోచించడం నేర్పిస్తున్నారా? దానికోసం రూపాయైనా ఖర్చు చేస్తున్నారా?

⁉ అసలు పిల్లల్ని ఎలా పెంచాలో మీకు తెలుసా? అందుకోసం కనీసం ఒక్క పుస్తకమైనా కొని చదివారా? ఒక్క వీడియో అయినా చూశారా? ఒక్క క్లాసయినా విన్నారా?

⁉ అవసరానికి, ఆడంబరానికి మధ్య ఉన్న తేడా మీ పిల్లలకు తెలిసేలా చేశారా?

⁉ సరదాకు, విచ్చలవిడితనానికి తేడా ఏమిటో వివరించారా?

⁉ వారి జీవితానికి వారే బాధ్యులని ఎన్నడైనా చెప్పారా?

⁉ మీ పిల్లలు చెడిపోవడానికి మీడియా, సోషల్ మీడియా, టెక్నాలజీనే కారణమని తిడుతూ మీరు మీ బాధ్యతనుంచి తప్పించుకుంటున్నారని ఎన్నడైనా గుర్తించారా?
మీ పిల్లలు మిమ్మల్ని నిరంతరం గమనిస్తుంటారని, మిమ్మల్నే అనుసరిస్తారని, వారిపై అన్నింటికంటే మీ ప్రభావమే ఎక్కువని తెలుసుకోండి.
అన్నిటికీ సమాజాన్ని తిట్టడం మానేసి మార్పు మీనుంచి, మీ ఇంటినుంచి మొదలుపెట్టండి.

కన్నవారి బాధ్యత

ఏ విషయమైనా మనసుకు కాస్త నచ్చితే చాలు, పిల్లలు వె ంటనే ప్రభావితమైపోతారు. చెప్పిన ఆ వ్యక్తికి బాగా దగ్గరైపోతారు. 

👉ఇది పాజిటివ్‌ విషయాలకైతే సరే గానీ, నెగెటివ్‌ విషయాలకు కూడా అలా ప్రభావితమైతే ఏమిటి పరిస్థితి?

 సమస్య ఏమిటంటే, పసివయసులో పాజిటివ్‌ విషయాల కన్నా నెగెటివ్‌ విషయాలే ఎక్కువగా ఆకర్షిస్తాయి. 

బాల్యంలో ప్రభావితం చేసిన విషయాలు, జీవిత కాలమంతా వెంటాడుతూనే ఉంటాయి. 

అందువల్ల ఇంటి నుంచి స్కూలుకు, స్కూలు నుంచి ఇంటికీ రావడం-పోవడం మధ్య పిల్లలు ఏ తరహా విషయాలకు ప్రభావితమవుతున్నారో గ్రహించాలి.


ఇటీవలి కాలంలో అతి చిన్న వయసులోనే పిల్లలు పొగతాగడం, మద్యానికీ, మాదక ద్రవ్యాలకూ అలవాటు పడటం అందరూ గమనిస్తున్నదే. 

ఇలాంటివి ఒకసారి అలవాటైతే చాలు... కొద్ది రోజుల్లోనే అవి వ్యసనంగా మారి పిల్లలు వాటికి బానిసలైపోతారు. 

👉అందుకే నిరంతరం పిల్లలు వేసే అడుగుల్ని ఓ కంట కనిపెట్టి ఉండడం కన్నవారి బాధ్యత.

సామి సుధాకర్ రావు
గుడివాడ

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Post a Comment

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

తెలుసుకుందాం...

🌸జవాబు: గోత్రం అంటేనే అద్భుతమైన సైన్సు. ఈ శాస్త్రం ప్రకారం మన పూర్వీకులు గోత్ర విధానాన్ని ఎలా ఏర్పాటు చేశారో గమనించండి. మీరు పూజలో కూర్చున్న ప్రతిసారీ పూజారి మీ గోత్రం గురించి  ఎందుకు అడుగుతారో మీకు తెలుసా? _తెలీదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు?_ 💐గోత్రం వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు-  జీన్-మ్యాపింగ్. అది ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం  పొందిన అధునాతన శాస్త్రమే! 👉🏻 గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి? 👉🏻 మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది?  👉🏻 వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనం ఎందుకు భావిస్తాము? 👉🏻 కొడుకులకు ఈ గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది, కుమార్తెలకు ఎందుకు రాదు? 👉🏻 వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా/ఎందుకు మారాలి? 👉🏻 తర్కం ఏమిటి? 💐ఇది మనం అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం.   మన గోత్ర వ్యవస్థ వెనుక  జన్యుశాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం! గోత్రమ్ అనే పదం రెండు సంస్కృత పదాల నుంచి ఏర్పడింది.   మొదటి పదం 'గౌ'- అంటే ఆవు, రెండవ పదం 'త్రాహి' అంటే కొట్టం. గోత్రం అంటే 'గోశాల' అని అర్థం. జీవశాస్త్ర పరంగా, మానవ శరీరంలో 23 జతల క్...

నేటి మోటివేషన్... ఉద‌యం 8 లోపు చేసే (S.A.V.E.R.S.)….అనే ఈ 6 అల‌వాట్లు మీ జీవితాన్నే మారుస్తాయ్.!

హాల్ ఎలోర్డ్ అనే ప్ర‌ముఖ ర‌చ‌యిత రాసిన “ద మిరాకిల్ మార్నింగ్” అనే బుక్ లో ఉద‌యం 8 లోపు చేసే 6 ప‌నులు మ‌న జీవితాన్నే మారుస్తాయ్ అని చాలా స్ఫ‌ష్టంగా చెప్పాడు. కార్ యాక్సిడెంట్ అయ్యి కోమాలోంచి బ‌య‌ట‌ప‌డ్డ ఈ ర‌చ‌యిత ఇప్పుడు త‌న ర‌చ‌న‌ల‌తో ప్ర‌పంచాన్ని ఆలోచింప‌జేస్తున్నాడు. ఆనందానికి 6 అంశాల సూత్రం. S.A.V.E.R.S S-Silence( నిశ్శ‌బ్దం)....మ‌న ప్ర‌తి రోజును చాలా నిశ్శ‌బ్దంగా ప్రారంభించాలి…అంటే ప్ర‌శాంత‌త‌తో స్టార్ట్ చేయాలి..లేవ‌డం లేట‌య్యింది…అయ్యే ఎలా…? ఆఫీస్ ప‌ని…ఈ రోజు అత‌డిని క‌లుస్తాన‌ని చెప్పాను…ఎమోయ్…టిఫిన్ అయ్యిందా…..ఇదిగో ఇంత‌లా హైరానా ప‌డొద్దు… ప్ర‌శాంతంగా లేవ‌గానే….కాసింత సేపు మెడిటేష‌న్ చేయండి. లేదా…క‌ళ్ళు మూసుకొని ప్ర‌శాంత‌త‌ను మీ మ‌న‌స్సులోకి ఆహ్వానించండి. ఇక్క‌డే మ‌న రోజు ఎలా గ‌డుస్తుంది? అనేది డిసైడ్ అయిపోతుంది . A-Affirmations ( నీతో నువ్వు మాట్లాడుకోవ‌డం)…. అంద‌రి గురించి, అన్ని విష‌యాల గురించి అన‌ర్గ‌లంగా మాట్లాడే మ‌నం…మ‌న‌తో మ‌నం ఒక్క‌సారి కూడా మాట్లాడుకోలేక‌పోతున్నాం. అస‌లు మ‌న‌లోని మ‌న‌కు ఏం కావాలి? పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళ‌ల్లో ఖ‌చ్చితంగా ఈ ల‌క్ష‌ణం ఉంటుంది. ఈ మూడు పా...