సమస్యనే లొంగదీసుకుంటావో, సమస్యకే లొంగిపోతావో నీ ఇష్టం, చస్తే ఏమొస్తుంది పదిమంది ఏడుపు తప్ప, చావు ముందు ఎంత సమస్య అయినా చిన్నదే.
కాళ్ళు విరిగాయని జింక ఆత్మహత్య చేసుకుంటుందా, రెక్కలు విరిగాయని పక్షి ఆత్మహత్య చేసుకుంటుందా, సమస్య లేని మనిషి ఈ ప్రపంచంలోనే లేడు, భూమికే తప్పలేదు ఓ వైపు చీకటి, మనుషులం మనమెంత.
ఊరికే ఏడుస్తూ కూర్చుంటే నీ కన్నీటికి కూడా విలువ లేకుండా పోతుంది.
కష్టపడి పని చేయడానికి కాళ్ళూ చేతులూ ఉన్నాయిగా, బ్రతకడానికి తెలివుందిగా, ఉపయోగించు.
అలా కాదు, నాకు తెలివి లేదు, అని దేవుడికి పదిరూపాయల కొబ్బరికాయ కొట్టి,లక్ష రూపాయల సమస్య తీర్చమంటే, తీర్చడానికి ఆయన మనలా వెర్రోడు కాదు.
నీ సుఖం నువ్వే అనుభవిస్తున్నప్పుడు,నీ కష్టం కూడా నువ్వే అనుభవించాలి.
ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, పరిష్కారం లేకపోతే అది సమస్యే కాదు.
చిన్న చిన్న సమస్యలకే లొంగిపోతే నీ జీవితాన్ని ఎప్పుడు గెలుస్తావ్?
చూడాల్సింది చాలా ఉంది,బ్రతకడానికి కావాల్సింది ఆస్తులు,అంతస్తులు కాదు,బ్రతకాలనే ఆశ,అదే నిన్ను బ్రతికిస్తుంది.
పీక మీద కత్తి పెట్టి పది కోట్లు కావాలా, ప్రాణం కావాలా అని అడిగితే,ప్రాణాలే కోరుకుంటాడు ప్రతి మనిషి.
ప్రాణానికి ఉన్న విలువ ఈ ప్రపంచంలో దేనికీ లేదు.
బ్రతికి సాధించు, బ్రతికితేనే సాధించగలవు.
Comments
Post a Comment