Skip to main content

నేటి మోటివేషన్... మనిషిని అభిమానించండి, వస్తువులను కాదు.


ఒక సెలవురోజు భార్య భర్తతో "మనం కాసేపు మాట్లాడుకోవాలి! మీ ఫోను స్విచ్ ఆఫ్ చేయండి!!" అంది
  "ఫోన్ ఉంటే ఏమౌతుంది?"
ఏమీ కాదు అందుకే మీరు ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి.
    "సరే చెప్పు !! "ఏం మాట్లాడాలి?" అన్నాడు. భర్త ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ..
   "మీరు మారిపోయారు!"
"మన పెండ్లి నిశ్చితార్థం నుండి పెండ్లి వరకు ఎలా ఉన్నారు?"
  "అప్పుడు గంట గంటకు మెసేజ్ లు లేదా ఫోన్లు!" లేచిన తర్వాత మొదటిమాట నీతోనే..పడుకునే ముందు చివరిమాట నీతోనే... మొదటీ చివరీ మాటల మధ్య రోజంతా నీ ఆలోచనలతోనే అనేవారు.. అలాగే ఉండేవారు'.
"పెండ్లైన సంవత్సరం వరకు ఎలా ఉన్నారు?"
"మీ కళ్ళలో..ప్రవర్తనలో ఎంతప్రేమ కనిపించేది ఇష్టంగా చూస్తున్న మీ కళ్ళలోకి చూస్తేనే మైకం కమ్మేది నాకు ఇప్పుడు కూడా అప్పటి మీ చూపులు గుర్తొచ్చినపుడు మనసంతా తన్మయత్వంగా అనిపిస్తుంది
"ఇప్పుడెలా వున్నారు?"
"మీ ప్రేమంతా ఎటుపోయింది?ఆ ఇష్టంగా చూసే చూపులేవి?
ఒక గోడనో.. వస్తువునో చూసినట్లుండే ఆ చూపులు నాకు నచ్చట్లేదు!!"
"మీరెందుకు మారి పోయారు?నాకు కారణం తెలియాలి!!
నా వల్లేమైనా తప్పుజరిగిందా?? చెప్పండి.. ఉంటే మార్చుకుంటాను" అంది భార్య.
    "ఛ అదేం లేదు, అదంతా సహజంగా జరిగేదే!" అన్నాడు భర్త.
   "అదే ఎలా జరుగుతుంది? నాకు జరగలేదే! మీ కోసం వేచి ఉన్నా ఫోన్ తో గడుపుతున్నారు, అంటే నేను ఫోన్ పాటి విలువచేయనా?" అడిగింది భార్య.
    అబ్బా ప్లీజ్ అపార్థం చేసుకోకు అదంతా సహజమేనని, నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు రెంట్ కు ఉన్న మా ఇంటి ఓనర్ అంకుల్ కూడా చెబుతుండేవాడు. అతనో ఎక్జాంపుల్ కూడా చెప్పాడు, అది వింటే నువ్వు కూడా కరెక్టే అంటావు" అన్నాడు భర్త.
  సరే ఆ ఎక్జాంపుల్ ఏమిటో చెప్పండి అడిగింది.
   అతను చిరునవ్వుతో..
సాదారణంగా మీకు బంగారునగలమీద ఆకర్షణ ఉంటుంది. కొత్తలో ఫ్రెండ్స్ కూ..బంధువులకూ..అపురూపంగా చూయించుకుంటూ మురిసిపోతుంటారు, తర్వాత బీరువాలోని 
 లాకర్ లోపెట్టేసుకుంటారు.
రోజూ వెళ్లి చూస్తుంటారా?
అలా అని వాటిమీద నిర్లక్ష్యమని అర్థం కాదుగా??
వస్తువు మనదే అయినపుడు, దూరంగా ఉన్నా తృప్తిగా ఉంటుంది. అన్నాడు
 అతని ఈ వాదన విన్నాక ఆమె ఒక్కసారిగా ఆశ్చర్య పోయింది తర్వాత కాసేపటి వరకు నవ్వుతూనే ఉంది.
అలా ఎందుకు నవ్వుతుందో అర్థం కాక అతను ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు.
కాసేపటి తర్వాత ఆమె ఇలా చెప్పసాగింది
"చాలా థాంక్సండీ నన్ను-ఒక రాయితోనో రప్పతోనో కాకుండా బంగారంతోనైనా పోల్చినందుకు
   మీ అంకుల్ కు ఒక నమస్కారం
కానీ..మనుషులంటే ప్రాణంలేని వస్తువులు కారు.మనకు బాగా ఇష్టమైన ఒక మొక్కను తెచ్చి పెంచుకుంటాము
అసలు ఆ మాటలోనే ఉంది 
చూడండి..  
మొక్కను పెంచుకుంటాము..
బంగారాన్ని ఉంచుకుంటాము
సరే ఆ మొక్కను తెచ్చి నాలుగు రోజులు మురిసిపోయి తర్వాత బీరువా లాకర్ లో పెట్టి చూడండి
క్రమంగా వాడిపోయి నిర్జీవమౌతుంది
దాన్ని రోజూ కేర్ గా చూసుకోవాలి.. నీళ్లుపోయాలి..బలం కోసం ఎరువు వేయాలి అవసరమైతే కంచె కూడా వేయాలి అప్పుడే అది పుష్పిస్తుంది.. ఫలిస్తుంది..సుగంధ పరిమళాలతో నిన్ను ముంచెత్తుతుంది.
మనుషుల ప్రేమలైనా అనుబంధాలైనా అంతే
నిజం చెప్పాలంటే.. మన పెండ్లి వరకు నాకు నీమీదుంది కేవలం ఆకర్షణ మాత్రమే ఎప్పుడైతే మన పెండ్లి తర్వాత నా సర్వస్వాన్ని నీకర్పించానో అప్పుడే ప్రేమించడం ప్రారంభించాను
ఇప్పుడు కూడా నువ్వెలా వున్నా నేను ప్రేమిస్తూనే ఉంటాను కూడా, కానీ సజీవమైన నీచూపులకు అలవాటు పడ్డ నేను నీ నిర్జీవమైన చూపులకు తట్టుకోలేకపోతున్నాను..
ఒక్క విషయం నిజం చెప్పు కుటుంబ పరంగా చూసినపుడు నువ్వు ఇప్పుడు హ్యాపీ గా ఉన్నావా? అప్పుడా
భార్య విశ్లేషణతో ఆలోచనలో పడ్డ అతను అప్పుడే అన్నాడు నిజాయితీగా..
మీలో నాకు బాగా నచ్చే విషయాల్లో ఇది కూడా ఒకటి మీరు ఏ విషయంలోనైనా కన్వీనెన్స్ అయితే చాలు అది ఖచ్చితంగా పాటిస్తారు నిజాయితీగా ఒప్పుకుంటారు కూడా అంది భార్య.
నిజంగా చాలా చాలా థాంక్స్
ఏ మనిషైనా కష్టమైన పనుల కంటే ..ఈజీగా చేసే పనులకు సపోర్ట్ గా వుండే వాదనకే తొందరగా కన్వీనెన్స్ అవుతాడు.
అంకుల్ వాదనతో కన్వీనెన్స్ అయిన నాకు ఆ మాటలు సబ్ కాన్సియస్ మైండ్ లో ఫిక్స్ అయిపోయాయి..
"నీ మాటల్లో ఉన్న నిజం నా హృదయానికి కూడా తెలుస్తోంది...
ఈ రోజు మన మధ్య జరిగిన సంభాషణ ఒక్క నీ విషయంలోనే కాదు..నా జీవితానికి కూడా ముఖ్యమైనది...మనుషుల పట్ల నా వైఖరిని మార్చివేసేది....
ప్రాణంలేని వస్తువులకు..ప్రాణమున్న మనుషులకు మధ్య తేడా కూడా అర్థమైంది.
ఆ బంగారాన్ని బీరువాలాకర్ లో బందించాలి.
ఈ బంగారాన్ని హృదయంలో దాచుకోవాలి అంతే కదా
ఉండు నిన్నిక ప్రతిక్షణం నా చూపులతో గుచ్చి గుచ్చి చంపేస్తాను చూడు అన్నాడతను ఆమె కళ్ళలోకి ప్రేమగా.. చూస్తూ.

మనిషిని అభిమానించండి, వస్తువులను కాదు.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

నెలల వారీగా తేదీ ---- ప్రత్యేకత

జనవరి » 10 - ప్రపంచ నవ్వుల దినోత్సవం   » 19 - ప్రపంచ శాంతి దినోత్సవం   » 25 - అంతర్జాతీయ ఉత్పాదక దినోత్సవం, అంతర్జాతీయ ఎక్సైజ్ దినోత్సవం   » 26 - అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం   ఫిబ్రవరి » రెండో ఆదివారం - ప్రపంచ వివాహ దినోత్సవం  ఫిబ్రవరి రెండో ఆదివారం - ప్రపంచ వివాహ దినోత్సవం » 14 - ప్రేమికుల దినోత్సవం » 21 - ప్రపంచ మాతృభాషా దినోత్సవం   మార్చి » 8 - అంతర్జాతీయ మహిళా దినోత్సవం  మార్చి 8 - అంతర్జాతీయ మహిళా దినోత్సవం » 15 - ప్రపంచ వినియోగదారుల దినోత్సవం, ప్రపంచ వికలాంగుల దినోత్సవం » 21 - ప్రపంచ అటవీ దినోత్సవం, అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం   » 22 - ప్రపంచ నీటి దినోత్సవం   » 23 - ప్రపంచ వాతావరణ దినోత్సవం, వరల్డ్ మెటలర్జికల్ డే   » 24 - ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం   ఏప్రిల్ » 1 - ఆల్ ఫూల్స్ డే   » 7 - ప్రపంచ ఆరోగ్య దినోత్సవం   » 12 - ప్రపంచ అంతరిక్ష యాత్ర, విమానయాన దినోత్సవం   » 16 - ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం   » 18 - ప్రపంచ సాంస్కృతిక దిన...