ఒకరోజు పీతకి సముద్రంలో బోరుకొట్టి అలా ఒడ్డుకి షికారు కొచ్చింది.
అలా నడుస్తూంటే తన పాద ముద్రలు తనకే చాలా ముద్దొచ్చింది. ఇంకా సరదాగా నడవసాగింది.
ఇంతలో అలలు వచ్చి ఆ పాదముద్రలని చెరిపేసాయి. అది చూసి పీతకి కోపం వచ్చి, అలల వైపు తిరిగి, బుంగమూతి పెట్టుకుని "మనం ఇద్దరూ మంచి స్నేహితులుకదా, మరి నీవు యిలా నా పాదముద్రలు చెరిపి, నా సరదాను పాడుచేసేది ఏమైనా బాగుందా?" అని అడిగింది
అందుకు అల పీత వైపు చూసి నవ్వుతూ "అయ్యో, నిన్ను బాధపెట్టాలని నేను ఆ పని చేయలేదు. నీ పాదముద్రలను అనుసరిస్తూ ఒక జాలరి నిన్ను పట్టుకోవడానికి వస్తున్నాడు. అతనికి నీ జాడ తెలియకూడదనే అలా చేసాను" అని చెప్తుంది.
వెనక్కి తిరిగి చూసుకున్న పీతకు తనను వెతుకుతున్న జాలరి కనిపించాడు......
అంతే ఒక్క వుదుటున సముద్రంలోకి బుడుంగ్ అని మునిగి, అలకి క్షమాపణ మరియు కృతజ్ఞత తెలుపుకుంది....
"స్వచ్ఛమైన స్నేహంలో అనుమానాలకు తావు లేదు" !!
Comments
Post a Comment