Skip to main content

నేటి మోటివేషన్... ఎవరి ప్రేమ గొప్పది...


తల్లితండ్రులకు చెప్పకుండా ఎవడో మధ్యలో పరిచయం అయిన ఒక అనామకుడిని నమ్మి వెళ్ళిపోయిన ఒక కూతురికి నాదొక సూటి ప్రశ్న.

నీ ప్రేమ ఎలా గొప్పది?

రక్త మాంసాలు కడుపున మోస్తూ
నెత్తుటి ముద్దను ముద్దుగా చూస్తూ

సమయం అయ్యింది నన్నింక బయటకు వదలమని నువ్వు ఆ కడుపులో కాళ్లతో తంతుంటే
ఆ బాధను కనురెప్పలు దాటకుండా దాచి
నీకోసం తన ప్రాణాలకు తెగించి
శంకరా నేను చచ్చినా పర్వాలేదు నా బిడ్డను బ్రతికించు అని
నీకు జన్మనిచ్చిన.
ఆ అమ్మ ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పదా.
?
నువు పుట్టిన క్షణం నుంచి నీకోసం ఆలోచిస్తూ
నువ్వు ఎక్కడ అడుగు వేస్తె అక్కడ నీ పాదం కింద తన అరచేతిని పెడుతూపెడుతూ
నీకు బాధ వేస్తె తన బాధగా భరిస్తూ
నీకు కష్టం వస్తే తన కష్టంగా మోస్తూ
ఎండనకా వాననకా కష్టపడుతూ నీకోసం తన జీవితాన్ని కరిగిస్తూ

నువ్వు ఏది అడిగినా కాదనకా తన స్వేదాన్ని నీ సంతోషంగా మారుస్తూ.
అయ్యో నా బిడ్డ ఎక్కడ బాధపడుతుందో అని అనుక్షణం ని గురించి తపించే
ఆ నాన్న ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పదా?
నీ ప్రేమ ఎలా గొప్పది??
4 రోజుల క్రితం మా ఇంటి దగ్గర జరిగిన ఒక విషయం ఇది.
((ప్రేమ పేరుతో ఇంట్లో చెప్పకుండా ఎవరితోనో వెళ్ళిపోయిన(లేచిపోయిన అనడం సమంజసం ఏమో) కూతుర్ని తలచుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తున్న ఆ అమ్మనాన్నలు.
బయటకు వస్తే నీ కూతురు ఎక్కడ అని ఇరుగుపొరుగు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేక బయటకు రాను భయపడి విలపిస్తున్న ఆ అమ్మానాన్నలు.
ఎవరైనా దగ్గరి ఆత్మీయులు ఓదార్చటానికి వెళ్తే, నా గుండెలపై ఎక్కించుకొని పెంచానయ్య నా బిడ్డను అని చెప్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ నాన్న బాధను.
తలుపు చప్పుడు వస్తే నా బిడ్డ వచ్చింది అని పిచ్చి ఆశతో వెళ్లి చూసి ఏడుస్తున్న ఆ అమ్మ పడే ఆవేదనను. చూశాక మనసు చలించి.నేను అడిగిన సూటి ప్రశ్న ఇది
అమ్మాయిలూ. ఇంటినుంచి బయటకు వెళ్ళే ముందు ఒక్క క్షణం మీ అమ్మనాన్న ల గురించి ఆలోచించండి.
ఇది చదివాక అందరూ మారకున్న ఒక్కరైనా ఆలోచిస్తారని ఆశిస్తూ..... 🙏🙏


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺