Skip to main content

నేటి మోటివేషన్... తెలివితేటలుంటే ఏదైనా సాద్యమే...!

తెలివితేటలుంటే ఏదైన సాద్యమే అని మన తల్లీదండ్రులు అంటూవుంటారు.తెలివితేటలకు పెద్దవాళ్లు చిన్నవాళ్లు అని తేడా లేదు. చిన్న పిల్లలు తమ మేధాశక్తితో పెద్దవాళ్లను ఆశ్చర్య పరిచే ప్రతిభ ప్రదర్శిస్తుంటారు.

లింగాపురం అనే ఊరిలో సుబ్బయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు.వారిలో ఒకరికి తన వ్యాపారం బాద్యతలు అప్పగించాలిని అనుకుంటున్నాడు సుబ్బయ్య. అయితే ఇద్దరి కొడుకుల్లో ఎవరు తెలివైనవారో తెలుసుకుని వారికీ వ్యాపారాన్ని అప్పజెప్పాలని ఆలోచిస్తాడు. దీనికోసం ఇద్దరు కొడుకులుకు ఒక పరీక్షపెడతాడు సుబ్బయ్య. అందులో ఎవరు నెగితే వారికీ వ్యాపారం బాధ్యతలను అప్పజెబుతానని కొడుకులతో అంటాడు.కొడుకులిద్దరకి కొంత డబ్బును ఇచ్చిన సుబ్బయ్య ఈ డబ్బుతో ఎవరైతే ఇంటినిపూర్తిగా నింపగల వస్తవులను కొని తెస్తారో వారికే వ్యాపారం అప్పజెబుతానని అంటాడు.దీనితో తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకుని ఉన్నపళంగా మార్కెట్ వైపుకు వేగంగా వెళ్ళాడు పెద్దకొడుకు. మార్కెట్లో ఉన్న వస్తువులన్నిటి గురుంచి 

అడిగి తెలుసుకున్నాడు. తండ్రి యించిన డబ్బుతో మొత్తానికి గడ్డి కొని నింపసాగాడు. ఎంత గడ్డి వేసినా ఇల్లు నిండలేదు. 

రెండోకొడుకు మాత్రం తండ్రి అప్పజెప్పిన పనిని ఎంత తెలివితేటలతో పూర్తిగా చేయాలని దీర్ఘంగా ఆలోచించాడు. చివరకి ఒక రూపాయని ఖర్చుచేసి ఒక కొవ్వతిని కొని ఇంటికి తెస్తాడు. వెంటనే దాన్ని వెలిగించగానే ఇల్లంతా వెలుగు వెంటనే దానిని వెలిగించగానే ఇల్లంతా వెలుగు పరుచుకుంటుంది. దీన్ని చూసిన సుబ్బయ్య తెలివితేటలతో ఇంటినంతా వెలుగుతోనింపిన చిన్న కొడుకు ఆలోచనకు సంతృప్తి చెంది అతడికి వ్యాపార భాద్యతలను అప్పజెబుతాడు. సారిక ఆలోచించలేక గడ్డితో ఇంటిని నింపుతున్న పెద్ద కొడుకు అవస్థను చూసి దగ్గరకి పిలిచి తమ్ముడికి సహాయంగా వ్యాపారం చూసుకోమని చెబుతాడు సుబ్బయ్య. తెలివితేటలతో ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు అలాగె తెలివితేటలతో దేనినైనా సాధించవచ్చు. నిజజీవితంలో చాలా మంది చదువు లేకపోయినా తెలివితో వ్యాపారం చేస్త్తున్నారు.....!!

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

నెలల వారీగా తేదీ ---- ప్రత్యేకత

జనవరి » 10 - ప్రపంచ నవ్వుల దినోత్సవం   » 19 - ప్రపంచ శాంతి దినోత్సవం   » 25 - అంతర్జాతీయ ఉత్పాదక దినోత్సవం, అంతర్జాతీయ ఎక్సైజ్ దినోత్సవం   » 26 - అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం   ఫిబ్రవరి » రెండో ఆదివారం - ప్రపంచ వివాహ దినోత్సవం  ఫిబ్రవరి రెండో ఆదివారం - ప్రపంచ వివాహ దినోత్సవం » 14 - ప్రేమికుల దినోత్సవం » 21 - ప్రపంచ మాతృభాషా దినోత్సవం   మార్చి » 8 - అంతర్జాతీయ మహిళా దినోత్సవం  మార్చి 8 - అంతర్జాతీయ మహిళా దినోత్సవం » 15 - ప్రపంచ వినియోగదారుల దినోత్సవం, ప్రపంచ వికలాంగుల దినోత్సవం » 21 - ప్రపంచ అటవీ దినోత్సవం, అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం   » 22 - ప్రపంచ నీటి దినోత్సవం   » 23 - ప్రపంచ వాతావరణ దినోత్సవం, వరల్డ్ మెటలర్జికల్ డే   » 24 - ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం   ఏప్రిల్ » 1 - ఆల్ ఫూల్స్ డే   » 7 - ప్రపంచ ఆరోగ్య దినోత్సవం   » 12 - ప్రపంచ అంతరిక్ష యాత్ర, విమానయాన దినోత్సవం   » 16 - ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం   » 18 - ప్రపంచ సాంస్కృతిక దిన...