ప్రతీ మనిషి జీవితంలో గెలుపు ఓటమి రెండు భాగాలే,కొందరు తొలి ప్రయత్నం లోనే విజయం సాదిస్తారు,మరి కొందరు ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఉండగా విజయం పొందుతారు.విజయం పొందే మార్గంలో కొందరు ఓటమి పాలు అవుతూ ఉంటారు.
అంత మాత్రాన వారిని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు.వాళ్ళ ప్రయత్నాన్ని,శ్రమను గమనించి ఓదార్పు ఇవ్వాలి గాని మాటలతో ఇంకా బాధ పెట్టకూడదు.
ఓడి పోవడం తప్పు కాదు కాని మనం ఎందుకు ఓడిపోయామో,ఆ ఓటమి నుంచి మనం మళ్ళీ ప్రయత్నించేటప్పు ఏమి చెయ్యాలో ఏం చెయ్యకూడదో అని పరిశీలించకపోవడమే తప్పు.జీవితంలో ఓటమి నేర్పే పాఠం ఇంకేది నేర్పలేదు.ఆ ఓటమి గురించి పదే పదే భాదపడటం వ్యర్థం.
నిన్నెవరో ఏదో అంటున్నారని అసలు భాదపడకు,అలా అనేవాళ్ళకు ఏం తెలుసు కష్టం విలువ అని అనుకుని మనల్ని మనమే సముదాయించుకోవాలి.కాబట్టి మనం ఓడి పోవడానికి కారణం ఏదైనా కావచ్చు కానీ మనం తిరిగి ప్రయత్నించక పోవడమే నిజమైన ఓటమి.
Comments
Post a Comment