Skip to main content

నేటి మోటివేషన్... కష్టాలను తరిమికొట్టండి... ఆనందంగా జీవించండి.....!!

మన జీవితంలో కష్టాలను తరిమికొట్టండి...ఆనందంగా జీవించండి..అప్పుడే బాగుంటుంది

ఒక పాము చాలా హుషారుగా పాకుతూ,దొర్లుతూ అటువైపుగా వెళ్తోంది.దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది...ఆ పాము కోతిని కాటు వేయబోయింది...భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంది... గట్టిగా అరవసాగింది కోతి.. 

చుట్టుకున్న మిగతా కోతులన్నీ ఇలా అనుకున్నాయి.
ఇక ఈ కోతి బ్రతకడం కష్టం..కోతి పామును వొదిలితే కచ్చితంగా కాటు వేస్తుంది...మనం దగ్గరికెళితే మనం కూడా పాము కాటుకు బలి కావాల్సిందే...మనం దూరంగానే ఉండటం మంచిది అని వెళ్లిపోయాయి...

తనవాళ్ళంతా తనని రక్షిస్తారేమో అని ఎదురుచూసిన
కోతికి నిరాశే ఎదురయ్యింది...అలాగే భయంతో కూర్చుంది.అటువైపుగా ఒక ముని వెళుతూ కోతి స్థితిని
అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు..
' నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చింది..వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు.దాన్ని వదిలేయి" అన్నారు ముని...కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు ఎక్కేసింది...ఇందులోని నీతి ఏంటంటే...
నీకు కష్టం వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం నిన్ను వదిలి పోదు...కష్టాన్ని దూరంగా విసిరి కొట్టే పరిష్కారం వెతకాలి.

అలాగే నువ్వు ఇబ్బందిలో ఉంటే నీ బంధువులు,ఎవ్వరూ నిన్ను రక్షించడానికి నీ కష్టం తీర్చడానికి ముందుకు రారు.
ఆ కష్టం తమను అంటుకుంటాయని దూరంగా వెళ్ళిపోతారు... నువ్వు కష్టం వచ్చినప్పుడు ఎవరిసహాయం కోసం చూడకూడదు..కష్టాన్ని భూతద్దంలో చూడకూడదు...కష్టాన్ని మంచి పరిష్కారంలో తరిమికొట్టాలి అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు..

నిజమే కదా! పాత కథే అయినా ధైర్యాన్నిచ్చే చక్కని కథ.

కష్టాలను తరిమికొట్టండి... ఆనందంగా జీవించండి.....!!

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

నేటి మోటివేషన్... ధైర్యం పై చిన్న #కధ. )

ధైర్యంతో ప్రయత్నిస్తే సమస్తం నీ వశం. లక్ష్య సాధనకై ధైర్యంతో అడుగిడరా.... జయమ్ము నిశ్చయమ్మురా..... వ్యక్తి జీవిత పయనంలో విజయవంతం కావాలంటే ధైర్యమే మూలం. లక్ష్యాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ ధైర్యంతో కష్టపడి తే విజయం దానంతట అదే దాసోహమంటుంది. ధైర్యంతో అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. మన భయాలను దూరం చేసుకోవడానికి ధైర్యం అవసరం. సరైన ప్రణాళికతో కష్టపడితే విజయం తప్పక లభిస్తుంది. జీవితంలో ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనే ప్రయత్నిస్తారు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని ధైర్యంతో పని చేస్తే సమస్త శక్తి మనలోనే ఉంటుంది. దేనినైనా సాధించ గలుగుతాము. ధైర్యలక్ష్మి తోడుంటే ఇతర లక్ష్ములు ఏ విధంగా తోడు ఉంటాయో తెలిపే చిన్న కథను తెలుపుతాను. పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు. అతని రాజ్యం సమస్త ధనరాశులతో సిరి సంపదలతో తులతూగుతూ ఉండేది. అక్కడి ప్రజలందరూ ఎంతో ఆనందంగా జీవించేవారు. అతని రాజ్యం లో అష్టలక్ష్ములు స్థిరనివాసం ఏర్పరుచుకున్నాయి. ఒక నాడు అక్కడున్న అష్టలక్ష్ములకు ఆ రాజును పరీక్షించాలని అనిపించింది. అతని వద్దకు ఒక్కొక్క లక్ష్మి వచ్చి ఈ విధంగా అడగటం ప్రారంభించింది. "రాజా నేను రాజ్యం విడిచి వెళ్లాలనుకుంటు...