Skip to main content

నేటి మోటివేషన్... ఇరుగుపొరుగువారితో స్నేహబంధాలు పెంచుకోవాలి



పెద్ద పెద్ద పట్టణాల్లో నివసించేవారు ఎవరికి వారే యమునాతీరేలాగా తమ చుట్టూముట్టు గిరిగీసుకుని ఇరుగు పొరుగు వారితో సంబంధం లేకుండా, ఎవరి తోనూ మాట్లాడకుండా ఉంటున్నారు. అందుకు కారణం, కుటుంబంలోని ప్రతి వారూ బిజీగా ఉండటమే, ఆలుమగలి ద్దరూ ఉద్యోగం చేయడం, పిల్లలు కూడా స్కూలు నుంచి వచ్చిప్పటినుండి హోమ్ వర్కులు, చదువుతో గడుపుతూ ఆరు బయట ఆడుకోకపోవడం, ఆ తర్వాత టి.వి.ముందు కుర్చోవడం చేస్తారు. ఆలు మగలిద్దరూ యాంత్రిక దినచర్యతో, ఉద్యోగంతో బిజీగా ఉండటంతో,చుట్టు ప్రక్కల ఎవరున్నారో, వారేంచేస్తారో, వారి పేర్లేమిటీ కూడా పట్టించుకోరు.

• చుట్టు ప్రక్కలవారు స్నేహబాంధవ్యాలు పెంచు కోవడం ప్రతివారికీ అవసరం. ఏదో ఒక సమయంలో ఇరుగు పొరుగువారి అవసరం తప్పనిసరి అవుతుంది. ఏకష్టమొచ్చినా, దు:ఖంలోనూ, బాధల్లోనూ మొట్టమొదటగా ఆడుకునేవారు ఇరుగుపొరుగులే అని తెలుసుకోవాలి.

• ఇతరులతో అంటీ ముట్టనట్టుగా ప్రవర్తించకూడదు. ఎవరి మటుకు వారు మౌనంగా ఉంటూ నాలుగు గోడల మధ్యనే కాలం గడుపాలను కోకూడదు. సమాజంలో తోటి మనుషుల మధ్యకలిసి బ్రతుకుతున్నప్పుడు కలిసి కట్టుగా స్నేహబంధాన్ని పెంచుకుంటూ మెలగాలి.

• ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడు తీరిక సమ యంలో ఇరుగుపొరుగులతో మాట్లాడటం వల్ల ఎవరెటువంటి వారో, ఎవరితో స్నేహం చేయవచ్చో, ఎవరిని దూరంగా ఉంచాలో అనేది తెలుస్తుంది.

• కష్టమొచ్చినా, సుఖ మొచ్చినా కలిసి పంచుకునేవారు ఇరుగు పొరుగులు, స్నేహితులేనన్న విషయాన్ని ఎన్నడూ మరువ కూడదు. రకరకాల మనస్తత్వాలతో ప్రవర్తించే ఇరుగుపొరుగు వారితో వైర భావాన్ని పెంపొదించుకోకుండా, సర్థుకు పోవడం అలవర్చుకుంటే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇరుగు పొరుగు వారితో స్నేహబంధాలు పెంపొదించుకోవాలి.

• మన పేరు, చేసే ఉద్యోగం గురించిన వివ రాలను వారికి తెలియజేస్తే మన ఇంటి గురించి వెతుక్కునే వారికి చుట్టుపక్కల వారు మన అడ్రసు తెలియజేేసి సాయ పడుతారు.

• ఎంతమంది బంధువులున్నా సమయానికి ఏ ఆనారోగ్యంకలిగినా, తక్షణం ఆదుకునేది ఇరుగు పొరుగులే కనుక ఆస్తి అంతస్తు కుల, మత, అసౌకర్యం, ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ ఓర్పుతో మంచితనంతో సంయమనంతో ప్రవర్తిం చాలి. మాటలు విసురుకుంటూ కలహం ఏర్పరచకూడదు. ఇరుగు పొరువారిని నొప్పించకుండా, తాము అశాంతి గురి కాకుండా ప్రవర్తించడమన్నది ఒక కళ. ఆ కళను ప్రతివారు అభ్యసించాలి.

ఇరుగు పొరుగు వారితో స్నేహం ఆత్మీయత, అనుబంధం, పెంపొందాలం టే కొన్ని విషయాలను పాటించాలి.

• ఇరుగు పొరుగున ఉన్న మనస్సు గాయపడేలా. వారి ఆత్మాభిమానం దేబ్బతినేలా మాట్లాడకూడదు. ప్రతివారిలోనూ మంచి గుణాలున్నట్టే లోపాలు ఉంటాయి. ఎదుటివారి లోపాలు పట్టించుకోకుండా వారి స్నేహంలోని మంచితనాన్ని,మంచి గుణాలను మాత్రమే ఆలోచించాలి.

• ఎంతసేపూ ఎదుటివారు వినాలనీ, మన అభిప్రాయలను వారు అంగీకరించాలనీ, అనుకోకూడదు. ఎదుటివారి మాటలకు విలువనిచ్చి గౌరవిస్తే వారు మనల్ని ఆదరిస్తూ స్నేహభావంతో ఉంటారు.

• ఇరుగు పొరుగు వారు పనుల ఒత్తిడితో బిజీగా ఉన్నప్పుడు వారింటికి వెళ్లి, వారి అమూల్యమైన కాలాన్ని పాడుచేస్తూ వరి సహనానికి పరీక్ష పెట్టకూడదు.

• ఇరుగు పొరుగువారి నుంచి సహాయం పొందడమే కాకుండా అవసరమ యినప్పుడు మనమూ సహాయన్ని అందిం చాలి.

• ముఖప్రీతి మాటలు మాట్లాడి పబ్బం గడుపుకునే మాటలు వారిలోని స్వార్థపరత్వాన్ని గ్రహించి ఇతరులు వారితోచెలిమికి ఇష్టపడరు. సాధ్యమైనం తవరకు అటువంటి వారికి దూరంగా ఉంటారు.

• స్నేహం పేరిట అతి చనువును పెంచుకుని, ఇరుగు పొరుగు వారి వ్యక్తిగత విషయాల్లో ఆసక్తి కనపరచడం, వారి స్వవిషయాల్లో జోక్యం కలిగించుకోవడం అన్నది మంచిపద్దతి కాదు.

• ఇరుగు పొరుగువారికి ఉచిత సలహాలు ఇవ్వటం వల్ల అవతవారికి మన పట్ల చిరాకు కలుగుతుందని అర్థం చేసుకోవాలి.

• ఇరుగుపొరుగు వారు మనల్ని నమ్మి వారి కష్టసుఖాలను , సమస్యలను అంతరంగి విషయాలను మనతో చెప్పుకున్నప్పుడు. ఆ విషయాలు పెదవి దాటి బయటకు రాకూడదు. విచక్షణతో ఆలోచనతో ఉం డాలి.

• వారిమీద కోసం వచ్చినప్పుడు వారి గుట్టు రట్టుచేస్తే స్నేహానికి అర్థమే ఉండదు. మనం ఎదుటి వారికిఎంత విలువ ఇస్తామో, ఆదరిస్తామో , ఆదే గౌరవాన్ని మనమూ పొందుతాము.

• ఎవరో, ఎదో చెప్పారనీ, నిజాలు తెలుసుకోకుండా చెప్పు డు మాటలకు ప్రాథాన్యత నిస్తూ ఇరుగు పొరుగు వారిని అపార్థం చేసుకొని, దూరం చేసుకోకూడదు. ఒక ఇంట్లో నిశ్చింతగా, ఆనందంగా గడపడం మన్నది ఇరుగుపొరుగు వారితో మనం ప్రవర్తించే తీరు, మన నడవడి బట్టే ఉంటుంది.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ