Skip to main content

నేటి మోటివేషన్... ఏవి అసలైన ముత్యాలు...



ఒక పాప దగ్గర పెట్టెలో కొన్ని ముత్యాలున్నాయి. వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ వుండేది. ఒకరోజు ఆ పాప పడుకుని వుండగా తండ్రి పక్కనే కూర్చుని, “నీ ముత్యాలు నాకివ్వవా అమ్మా....?!” అని అడిగాడు.
“అవంటే నాకిష్టం డాడీ. నేను పెద్దవుతున్నాగా... కావాలంటే నా బేబీ డాల్ తీసుకో....!” అంది. 
“థాంక్యూ... వద్దులే అమ్మా... ఐ లవ్యూ...!” అని నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్లిపోయాడు తండ్రి.
అయిదు సంవత్సరాలు గడిచాయి. ఒక రోజు పక్కమీద పాప పడుకుని వుండగా, తండ్రి వచ్చి పక్కన కూర్చొని “నీ ముత్యాలు ఇవ్వవా తల్లీ....?!” అని అడిగాడు.
“సారీ డాడీ... కావాలంటే నా సైకిల్ తీసుకో... పెద్దయ్యాగా....!” అంది.
“వద్దులే అమ్మా....! థాంక్యూ.... డాడీ లవ్స్ యు....!” అని వెళ్లిపోయాడు. అలా కొంత కాలం గడిచింది.
ఒకరోజు ఆ అమ్మాయి తల్లితో కలిసి దేవాలయానికి వెళ్లింది. అక్కడ భగవద్గీత పారాయణం జరుగుతోంది. పాప శ్రద్ధగా వింది.
ఆ రోజు రాత్రి తండ్రి వచ్చి మళ్ళీ అదే అడిగాడు. ఆ అమ్మాయి ముత్యాల పెట్టె ఇచ్చేస్తూ.... “తీసేసుకో డాడీ. నాకివీ అవసరంలేదు....!” అంది.
అప్పుడా తండ్రి జేబులోనుంచి అలాంటి పెట్టేనే మరొక దాన్ని తీశాడు. దాన్ని ఆమెకిస్తూ “వీటిని నీకిద్దామని ఎప్పటినుంచో నా దగ్గిరే వుంచుకున్నాను. ఇవి నిజమైన ముత్యాలు. ఇప్పటివరకూ నువ్వు భద్రంగా దాచుకున్నవి నకిలీవి తల్లీ...!” అంటూ కూతురికి అందించాడు అసలైన ముత్యాలని. 
ముందువాటి కన్నా ఇవి ఎంతో స్వచ్ఛంగా మెరుస్తునాయి.... ఆ పాప కళ్ళలాగే ......!!!

భగవంతుడు కూడా ఇలాగే అసలు ముత్యాలయిన ఆనందం... ప్రేమ... ప్రకృతి పట్ల ఇష్టం…. సంగీతం పట్ల ఆరాధన.... కరుణ... ఆప్యాయత లాటి గుణాల్ని ‘ఇవ్వటానికి’ సిద్ధంగా వుంటాడు. 
కానీ మనమే తాత్కాలిక ఆనందాన్నిచ్చే అసూయ... ద్వేషం... కోపం... స్వార్ధం... శాడిజం... లాంటి నకిలీ ముత్యాల్ని పట్టుకుని అవే ‘నిజమైన’వనుకుని ఆనందం పొందుతూ వుంటాం.....! వాటిని వదిలేస్తే తప్ప నిజమైనవి దొరకవని తెలుసుకున్న మనిషే ధన్యుడు...

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🎯 GENERAL ELECTIONS – ఓట్ల రకాలు పోటీ పరీక్షల ప్రత్యేక అధ్యయన మెటీరియల్ ముఖ్యమైన మల్టీపుల్ ఛాయస్ బిట్స్ తో పాటు.

భారతదేశ ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. అర్హత, విధులు, ఎన్నికల నియమాలను బట్టి ఈ పద్ధతులు మారుతాయి. 📌 1. ఎన్నికల్లో ముఖ్యమైన ఓట్ల రకాలు 1️⃣ Ordinary Vote – సాధారణ ఓటు సంబంధిత పోలింగ్ కేంద్రంలో ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునే సాధారణ విధానం. ప్రస్తుతం సాధారణంగా EVM ద్వారా ఓటు నమోదు చేస్తారు. 2️⃣ Postal Ballot – పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల నియమాల ప్రకారం అర్హత పొందిన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును నమోదు చేసే విధానం. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు ఉద్యోగులు, అర్హులైన సర్వీస్ ఓటర్లు, నిబంధనలకు లోబడిన ఇతర వర్గాలకు ఈ సదుపాయం ఉంటుంది. 3️⃣ EDC – Election Duty Certificate ఎన్నికల విధుల్లో ఉన్న అర్హుడైన ఉద్యోగి, తాను ఓటరుగా నమోదైన నియోజకవర్గంలోనే విధులు నిర్వహిస్తున్నప్పుడు, వర్తించే నిబంధనల ప్రకారం EDC ద్వారా ఓటు వేయవచ్చు. 4️⃣ Service Vote – సర్వీస్ ఓటు సాయుధ దళాలు, వర్తించే చట్టాల పరిధిలోని బలగాలు, భారతదేశం వెలుపల పనిచేస్తున్న అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు వంటి నిర్దిష్ట వర్గాలకు చెందిన సర్వీస్ ఓటర్లు వినియోగించుకునే ఓటు హక్కు. వర్తించ...