Skip to main content

నేటి మోటివేషన్... యువతీ, యువకులు ఉన్న తల్లిదండ్రులకు విజ్ఞప్తి.



ఈ కాలంలో ప్రేమలు,  పెళ్లిళ్లు, తర్వాత హత్యాయత్నాలు, ఆత్మ హత్యలు, తొందరపాటు వివాహాలు, బాధాకర పర్యవసానాలు చూస్తుంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిదనిపిస్తుంది.


 మీ పిల్లలకు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలని చిన్నప్పటినుండే బోధించండి.

 స్థిరపడాలనే ఆలోచన కలిగించండి. తర్వాతే పెళ్ళిళ్ళని చెప్పండి. స్థిరపడకపోతే,తమ కాళ్ళ మీద తాము నిలబడకపోతే కష్టాలు ఎలా ఉంటాయో వివరించి చెప్పండి.

 వారిలో ఒక ఆత్మ విశ్వాసాన్ని కలిగించండి. 

ఇలా మీరు చిన్నప్పటి నుండి వారిని దగ్గరకు తీసుకొని మాట్లాడడం వల్ల వారిలో విశేషమైన ఆత్మవిశ్వాసం  నెలకొంటుంది.

ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించాలని, ఉన్నతమైన పదవులు అలంకరించాలని, ఉన్నతమై జీవితం జీవించేందుకు ప్రయత్నించాలని చెపితే టీనేజ్ వయసులో కలిగే ప్రేమలు దాదాపుగా కలుగవు. 

 ముఖ్యంగా తల్లిదండ్రులు టీనేజ్లో ఉన్న అమ్మాయి లతో తమ సాన్నిహిత్యాన్ని పెంచుకోండి. కాలేజీ నుండి రాగానే ఏం పాఠాలు చెప్పారు? ఏ ఫ్రెండ్స్ ను కలిశారు? కాలేజీలో ఏం జరిగింది? ఇవన్నీ ప్రశ్నలు అడిగిన విధంగా కాకుండా మాటల సందర్భంలో అడగడం వల్ల నిజాలు బయటకు వస్తాయి. స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొల్ప బడుతుంది. 

 అంతే కాకుండా అప్పుడప్పుడూ కాలేజీకి వెళ్లి పిల్లల మిత్రులను‌, లెక్చరర్లను, ప్రిన్సిపాల్ ను కలిసి పిల్లల  ప్రవర్తన ఎలా ఉంది? స్నేహసంబంధాలెలా ఉన్నాయి అని కనుక్కోవడం వల్ల ఒక బాధ్యతాయుత వాతావరణం క్రియేట్ చేసిన వాళ్లమవుతాం.

 ప్రేమలు అందుబాటులో ఉన్న వ్యక్తుల మధ్యే కలుగుతాయి*. తెలిసీ తెలియని వయసులో వారే సర్వస్వం అని అనుకుంటారు. కనుచూపు   మేర అంటే వీధిలో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, ఎవరైనా చదువుకున్నవారుగాని చదువుకోనివారుగాని, ఎవరైనా కానీ దగ్గర ఉన్న వారి తోనే  ప్రేమలు కలుగుతాయి.

ఇలాంటి వాతావరణం నిరోధించాలంటే.

 చుట్టుపక్కల ఎవరున్నారు? 
ఎలాంటి వారు ఉన్నారు? అనేది కూడా గమనించాల్సిన విషయం.
చుట్టుపక్కల ప్రేమ పేరుతో ఎవరైనా వెంట పడుతున్నారా? కలుస్తున్నారా? అనే విషయాన్ని మొదట గమనించాలి. ఒకవేళ స్నేహం చేసినా అది మంచి స్నేహంగా పరిణమించేందుకు దోహదం చేయాలి.

  పిల్లల దృష్టి చదువు మీద, ఒక వ్యక్తిత్వ వికాసం మీద ఉండే విధంగా మన మాటలు ఉండాలి. సినిమాల గురించి, ప్రేమల గురించి, పక్కవాళ్ల వైఫల్యాల గురించి మాట్లాడవద్దు.

 తల్లిదండ్రులు ఆంతరంగిక విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లల్ని దూరంగా ఉంచడం ఎంతో మంచిది. 

  కొన్ని రహస్య విషయాలు వారి ముందు చర్చించుకోకపోవడం ఎంతో మంచిది.  

  కెరీర్ గురించి, అభివృద్ధి గురించి, చదువు, మంచి స్నేహం, సామాజిక ప్రవర్తన, దేశవిదేశాల విషయాలు, స్పోర్ట్స్ విషయాలు..... ఇలాంటి మానసిక అభివృద్ధి కలిగే విషయాలు మాట్లాడితే వాళ్లకు టీనేజీ అపరిపక్వ ఆలోచనలు తగ్గిపోయి, మంచి భవిష్యత్తు పట్ల ఒక లక్ష్యం ఏర్పడి అభివృద్ధి బాట పడతారు. 

  పిల్లలు చెడిపోవడంలో లేదా తప్పటడుగు వేయడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో గొప్పది. వారి బాధ్యతారాహిత్యాన్ని విస్మరించలేం. 
పిల్లలు పారిపోయిన తర్వాత బాధపడేకంటే, మన నియంత్రణలో ఉన్నప్పుడే మంచి వాతావరణం సృష్టించడం మన బాధ్యత.

అసభ్యమైన సినిమాలు,సీరియల్స్ నుండి కాపాడుకోండి. 

నచ్చితే పాటించండి

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺