ఎదుటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో మనమే అంచనా వేయడం:
కొన్నిసార్లు వేరొక వ్యక్తి మన గురించి ఎలాంటి అభిప్రాయాలను కలిగి ఉన్నారో తెలియకుండానే వారు మన గురించి ఫలానా విధంగా ఫీలవుతూ ఉండి ఉండొచ్చు అని మనమే ఓ కన్ఫర్మేషన్ కి వస్తుంటాం. మనం ఇలా ఇతరుల ఆలోచనల్ని ఊహించడంలో ఓ లోపముంది. వివిధ సందర్భాల్లో, వివిధ వ్యక్తుల గురించి మనం ఎలాగైతే ఫీలవుతామో ఇతరులూ మనలాంటి ఫీలింగులనే కలిగి ఉంటారని భ్రమిస్తాం. మనం అంచనా వేసే దానికి భిన్నంగా అవతలి వ్యక్తి మన పట్ల ఫీలయ్యే విధానం ఉండవచ్చు.
ప్రతీ సంఘటనా మనకు కేవలం రెండు ఫలితాలనే ఇస్తుంది:
ఒక సంఘటన జరిగినప్పుడు ఓ సగటు మనిషిగా మనం ఆలోచించేది.. అది మనకు మంచి చేస్తుందా, చెడు చేస్తుందా, ఆనందపరుస్తోందా, విచారంలో ముంచుతోందా.. ఇలా కేవలం రెండు ఫలితాలే మన ఆలోచనలకు తడతాయి తప్ప ప్రతీ సంఘటనలోనూ mixed ఫలితాలూ ఉంటాయనీ.. వాటిలో మనకు కావలసిన కాంబినేషన్లని మనం గ్రహించి మనసుకి ఫీల్ అవ్వొచ్చనీ ఆలోచించం. దీంతో మనం సక్సెసా, ఫెయిలా, హాపీనా, డిజప్పాయింటెడ్డా వంటి పరిమితమైన conclusions మాత్రమే మనకు మిగులుతుంటాయి.
అందరి అభిప్రాయాలూ అందరికీ సరైనవే:
మనం సరైనదని నమ్మిన దాన్ని ఇతరులు ఆమోదించనప్పుడు మనం విపరీతమైన అసహనానికి లోనవుతాం. నిజాయితీ, మంచితనం అనే లక్షణాలు ఇలా తరచూ సంఘర్షణకు గురవుతూ ఉంటాయి. మనం ఫలానా విధంగా ఉంటే నిజాయితీపరులం అనుకుంటాం. మరొకరు వారి పరిమితులూ, వారి కంఫర్టబులిటీలకు తగ్గట్లు నిజాయితీని define చేసుకుంటారు. నిజాయితీకి మనమే సరైన నిదర్శనం అనుకుంటాం తప్ప మనమూ మనకు కంఫర్టబులిటీకి అనుగుణంగా ఆ లక్షణాన్ని define చేసుకున్నాం అని గ్రహించం. ఇక్కడే మన ఆలోచనలతో ఇతరులు ఎందుకు విభేదిస్తున్నారన్న conflict మొదలవుతుంది.
మన పెట్టుబడికి రాబడి రాబడి ఆశిస్తుంటాం:
మనం సమాజానికీ, మనుషులకూ, బంధువులూ, స్నేహితులకూ పెట్టిన ఎమోషన్స్, టైమ్, మనీ వంటి అన్ని రకాల పెట్టుబడుల నుండీ ఏదో రూపేణా రాబడిని అంతర్గతంగా ఆశిస్తుంటాం. మనం కోరుకున్న సమయంలో మన పెట్టుబడిని రాబడి లభించకపోతే నిరుత్సాహపడతాం. ద్వేషాన్ని పెంచుకుంటాం.
మన ఫీలింగ్ మొదటి దశలోనే నూటికి నూరుశాతం నిజమని నమ్మేస్తాం:
మన మనసు నుండి వచ్చే ప్రతీ ఆలోచనా అది stupidదైనా, బోరింగ్ దైనా, అష్టవంకరలతో కూడుకున్నది అయినా నూటికి నూరుశాతం దాన్ని మనం accept చేస్తాం, దాన్ని మన standగా నిలుపుకుని వాదించడానికి సిద్ధపడతాం. అదే ఇతరుల ఆలోచనలను స్వీకరించాల్సి వచ్చినప్పుడు ఓ జడ్జ్ గా ఆ ఆలోచనల్లోని లోపాలను వెదికిపట్టడానికి ప్రయత్నిస్తాం.
పై కారణాలన్నీ మనలో ఓ matured though process లేకపోవడానికి కారణమవుతుంటాయి. వీటిని అర్థం చేసుకుని మనల్ని మనం పాలిష్ చేసుకోవడం చాలా అవసరం.
Comments
Post a Comment