Skip to main content

నేటి మోటివేషన్... పెద్దలను గౌరవించండి..



నాని : నాన్నా! ఈ నెల తాతయ్య మన ఇంటికి రాలేదేంటి?
తల్లి: మీ నాన్న వెళ్ళి మీ తాతయ్యను తీసుకుని రాకపోయినా మీ పెద్దనాన్న
ఇక్కడికి వచ్చి మీ తాతయ్యను దింపివెళతారులేరా!( ఎగతాళిగా)
అనుకున్నట్లుగానే ఫోను రింగ్ అయింది.....
తల్లి: నేను చెప్పాను కదా! మీ అన్నయ్యగారే అయిఉంటారు......మీ నాన్నగారిని
తీసుకెళ్ళమని చెప్పడానికే! (భర్తను ఉద్దేశించి)
తండ్రి: అవును . అన్నయ్యనే కాల్ చేస్తున్నాడు.
అంటూ ఫోను తీసుకుని ఇలా మాట్లాడాడు.......
పెద్దనాన్న: ఏరా! ఎలా ఉన్నారు.......ఏంటి ఇంకా నాన్నగారిని తీసుకుని
వెళ్ళలేదు . ప్రొద్ధుటి నుండి నాన్నగారు కలవరిస్తున్నారు
చిన్న కొడుకు రాలేదని! త్వరగా వచ్చి తీసుకుని వెళ్ళు/
తండ్రి: ఇదుగో వచ్చేస్తున్నాను అన్నయ్యా! ఆఫీసులో కాస్త పని ఒత్తిడి వల్ల
సాయంకాలం తీసుకుని వొద్దామనుకుంటుండగా నీవు కాల్ చేశావు.
అంటూ ఫోను పెట్టేసి నసుగుతూ.........బయలుదేరాడు.......
ఇదంతా గమనిస్తున్న నానీ ( మనవడు) నాన్నగారిని ఇలా అడిగాడు.
నాని: నాన్నా! నాకో డౌటు.......తీరుస్తారా????????
తండ్రి: ఇప్పుడేం డౌటు రా! ముందు మీ తాతయ్యను తీసుకుని రానివ్వు.
తరువాత నీ డౌటు తీరుస్తాను......
నాని: ఇప్పుడే చెప్పండి. నాన్నా! తాతయ్యకు ఇద్దరు కొడుకులు..
ఒక నెల మీరు...........ఒక నెల పెద్దనాన్న ....ఇలా మార్చి మార్చి
తాతయ్యను చూసుకుంటున్నారుకదా! మరి మీకు నేను ఒక్కడినే
కొడుకును కదా! నేను పెద్దయ్యాక ఒక నెల మా ఇంట్లో ఉంటారు.
మరి మరుసటి నెల ఎక్కడికి పోతారో చెప్పండి నాన్నా!
ఎవరో చాచి చెంపదెబ్బ కొట్టినట్లు ఉలిక్కిపడ్డాడు ఆ తండ్రి..........
కన్నవారిని పంచుకోకండి....వారు మీకు ప్రేమను పంచినవారు........
వారి కంట కన్నీరు బిడ్డలమైన మనకు మంచిదికాదు.......దయచేసి
తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోకపోయినా,,, భారంగా తలచి....
చివరిదశలో వారిని అలక్ష్యం చేయకండి..రేపు మనమూ పెద్దవారము
అవుతాము మన పిల్లలు అలా చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి
ఆలోచించిండి.........పెద్దలను గౌరవించండి.......

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

RRB NTPC 8050 జాబ్స్ నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2025 సంవత్సరానికి సంబంధించి 8,050 ఖాళీలతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్) సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (CEN 2025)ను ఒక ప్రకటనలో విడుదల చేసింది. మొత్తం 8,050 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో 5,000 పోస్టులు గ్రాడ్యుయేట్, 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. అర్హత: గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. ముఖ్య తేదీలు: గ్రాడ్యుయేట్ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.11.2025. అండర్ గ్రాడ్యుయేట్ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.11.2025.  మరిన్ని వివరాల కోసం అలాగే పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చేయగలరు  https://www.rrbapply.gov.in/#/auth/landing (Join us on whatsapp at) https://chat.whatsapp.com/JuVLXd0zVNNGnadLIN4Pr8?mode=ems_copy_t https://whatsapp.com/channel/0029VbAmA2K4SpkJgaw7uJ3u 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺