Skip to main content

నేటి మోటివేషన్... లక్ష్యం సాధించాలంటే



జీవితంలో లక్ష్యాలను సాధించి, ఉన్నత స్థానాలను పొందినవారిని చూసినప్పుడల్లా, వీరికి ఎలా సాధ్యమవుతోందని అనుకోవడం సహజం. మనకంటూ ఓ పట్టికను తయారుచేసుకుని దాన్ని రోజూ అనుసరించగలిగితే విజయం మన సొంతం కావడానికి ఎక్కువ సమయం పట్టదు.‌ అవకాశాలను చేజిక్కించుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉండాలి. అలాగే దొరికిన అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లో జారవిడుచుకోకుండా చూసుకోవాలి. సూర్యోదయాన్ని చూడటానికి ఆలస్యం చేస్తే... మళ్లీ మర్నాటి కోసం ఆగాల్సిందే. అవకాశం కూడా అలాంటిదే. ఒకసారి వదిలేస్తే మరోసారి వచ్చేవరకూ ఎదురు చూస్తుండాలి. 
 ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నిత్యం వ్యాయామం చేస్తే ఆరోగ్యం మీ సొంతమవుతుంది. మానసికంగానూ దృఢంగా ఉంటారు. అప్పుడే లక్ష్యసాధనలో శారీరక, మానసిక బలం మీ వద్ద ఉన్నట్లే.


సానుకూల దృక్పథాన్ని పెంచుకోవాలి. యోగాతో దీనిని సాధించవచ్చు. ప్రతికూలంగా ఆలోచించడం మానేయడం, అలా చెప్పేవారిని దూరంగా ఉంచడం ఎంతో అవసరం. అప్పుడే విజయం మీ వైపు ఉంటుంది. 
 రోజూ చేయవలసిన పనులను ఓ పట్టికలా రూపొందించి, అనుకున్న సమయానికి వాటిని పూర్తి చేసేలా చూడాలి. అప్పుడే లక్ష్యంవైపు వెళ్లే మార్గం సుగమం అవుతుంది. 
 కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల కోసం సమయాన్ని కేటాయించాలి. వారితో అన్ని విషయాలను పంచుకోవాలి. మీ ఆలోచనలకు వారి చేయూత మీలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది.


 లక్ష్యం వెంట పరుగులు వద్దు. మీకు నచ్చినట్లు, నమ్మకంతో ప్రయత్నించండి. మీరు చేరుకోవలసిన లక్ష్యం మిమ్మల్ని వెతుక్కుంటూ అదే వస్తుంది. 
 ఒకే దిశగా ఆలోచిస్తే పరిష్కారం దొరకదు. దీనికోసం ఆలోచనాశక్తిని పెంపొందించుకుంటే, ఫలితం మీకే తెలుస్తుంది.
ఎవరైనా లక్ష్యం చేరుకోలేకపోతున్నారంటే, కారణం వారికి తగినంత శక్తి లేకపోవడం కాదు, కావలసినంత విజ్ఞానం లేకపోవడం కూడా. కాబట్టి విజ్ఞానాన్ని పెంచుకుంటూ, సాధించాలనే తపనా, కోరిక ఉండాలి. అప్పుడే అనుకున్నది సొంతమవుతుంది.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...