Skip to main content

నేటి మోటివేషన్... నీకు అది ఉంటే అంతరించక తప్పదు...



చాలా కాలం క్రితం ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. ఆయన ఎంత గొప్ప శిల్పకారుడంటే, ఆయన చెక్కిన శిల్పాలలో జీవ కళ ఉట్టిపడుతూ ఉండేది. చుట్టుపక్కల ఊళ్ళల్లో ఆ శిల్పికి, ఆయన శిల్పకళా నైపుణ్యానికి ఎంతో పేరుండేది.
దానితో ఆయన తన నైపుణ్యంపై ఎంతో గర్వపడేవాడు. 

కాలక్రమంలో, ఆయనకు తాను మరణించే సమయం ఆసన్నమైనదని, ఇంకా ఎక్కువ రోజులు తాను బతకననే అందోళనలో పడిపోయాడు. అందుకే తనను తీసుకెళ్ళేందుకు వచ్చిన యమదూతలను భ్రమింపజేయడానికి ఒక *పథకం* వేశాడు.
అచ్చం తనలాగే ఉండే పది ప్రతిమలను తయారు చేసుకొని వాటి మధ్య కూర్చున్నాడు.

యమదూతలు అతన్ని తీసుకెళ్ళడానికి వచ్చి అక్కడున్న ప్రతిమలను చూసి ఆశ్చర్యంతో ఇరకాటంలో పడిపోయారు.
అక్కడున్న ప్రతిమలకు అసలైన మనిషికి తేడా తెలుసుకోలేక “ఆ శిల్పి ప్రాణం తీసుకెళ్ళలేకపోతే సృష్టి నియమం ఉల్లంఘించినట్లవుతుంది.
సత్యం తెలుసుకోవడానికి ప్రతిమలను పగలగొడితే కళను అవమానించినట్లవుతుంది” అని ఆలోచిస్తూ నిలబడిపోయారు..  

అంతలో మానవ సహజమైన లోపాల పట్ల అవగాహన ఉన్న ఒక యమదూతకు ఒక ఆలోచన వచ్చింది.
అతను ఆ ప్రతిమల వంక చూస్తూ "నిజంగా శిల్పి ఎంత అందమైన ప్రతిమలను తయారు చేశాడు.
కాని ఈ ప్రతిమలలో ఒక చిన్న లోపం ఉంది.
అతను నా ముందుండి ఉంటే చెప్పేవాణ్ని ఆ లోపం ఏమిటో" అన్నాడు. అది విని ఆ శిల్పికి ఎక్కడలేని కోపం వచ్చింది.
నా జీవితమంతా శిల్ప కళ కోసమే అంకితం చేశాను.
నేను చెక్కిన ప్రతిమలలో లోపమా ?* అని మనలో అనుకుంటూ బయటికి అడిగాడు "ఏం లోపం ఉంది" అని. 

వెంటనే యమదూతలు అతన్ని పట్టుకుని అన్నారు.
"ఇదే నీలో ఉన్న లోపం. ప్రాణం లేని ప్రతిమలు అహంకారంతో మాట్లాడవు"     

ఈ కథలో నీతి ఏమిటంటే.... నేను ఏ తప్పూ చేయను, నేను 100% కరెక్ట్ అనే అహంకారం వల్ల అనుకోని బాధలు, చిక్కులు తప్ప మరేది పొందలేమని... అహంకారంతో విర్రవీగేవారు ఎంతటివారైనా అంతరించక తప్పదని...  చరిత్రలో ఎన్నో సాక్ష్యాలున్నాయి. 
🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺