Skip to main content

నేటి మోటివేషన్... గురువు ఎలా ఉండాలి...




గురుర్బ్రహ్మగురుర్విష్ణు
గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః

     
మన సనాతన ధర్మంలో
 
"గురువు" యొక్క స్ధానము
ఐహికంగాను...
ఆధ్యాత్మికంగాను...
ఉత్కృష్టమైనది.

వృత్తి రీత్యా 
ఉపాధ్యాయులు అయినవారు 
మనకు...
మన సమాజంలో గౌరవనీయ...
పూజనీయ స్థానం... 
లభించినదని భావించి 
ఆదర్శ నీయులుగా తమను 
నిరంతరం తీర్చిదిద్దుకొంటుండాలి.

తమ పాఠశాలను స్వగృహముగా...
తమ విద్యార్థులను కన్నబిడ్డలుగా భావించాలి.
వారిని ప్రేమించాలి.
వారిచే ప్రేమించబడుతుండాలి.

పాఠశాల ప్రారంభసమయానికి ఖచ్చితంగా హాజరు కావాలి.
ఆదర్శవంతంగా 
పాఠశాల అసెంబ్లీ నిర్వహించాలి.
పాఠశాల ఆవరణ 
పరిశుభ్రతకు గల ప్రాధాన్యత విద్యార్థులకు
అర్థం అయ్యేలా...
సమయ పాలన పాటించేలా మార్గదర్శనం చేయాలి.

ఖచ్చితంగా 
తరగతి గదిలోనికి 
నిర్దేశిత సమయంలో వెళ్లి రావాలి.

తన తరగతిలో విద్యార్థులకు 
ప్రారంభంలో లేదా 
పాఠ్యబోధన మధ్యలో...
ధ్యానం... శ్లోకం... పద్యం...
జాతీయ నాయకుల పరిచయం... నైతికబోధ...
ఆదర్శ కధనం...
ఇలా
ఏదేని ఒక అంశం గురించి 
ప్రతిరోజూ 
పది నిమిషాలు కేటాయిస్తూ... పాఠ్యబోధన చేయాలి.

విద్యార్థులు 
ఉపాధ్యాయులందరిని 
గౌరవించేలా తీర్చిదిద్దాలి.
ఆ క్రమంలో మనం ఆదర్శంగా ఉండాలి...
విద్యార్థులలో ఏవేని
లోపాలుంటే ప్రేమతో సరిదిద్దాలి.

విద్యార్థులలో 
వ్యక్తిగత ద్వేషాలు 
తలెత్తకుండా గమనిస్తూ... 
ఒకే కుటుంబభావన నిర్మాణం చేయాలి.

విద్యార్థులకు 
విద్యయొక్క విలువ 
స్వయంగా గ్రహించి...
"శ్రద్ధ"... పెంపొందించుకొనే 
విధంగా తీర్చిదిద్దాలి.

విద్యార్థులలో 
సాత్విక భావాలు...
సానుకూల (పాజిటివ్) దృక్పథం పెరిగేలా...చూడాలి.

జీవితం అంటే సుఖసంతోషాలేకాదు...
కష్టనష్టాలు...
సమస్యలు ఉంటాయని...
వాటిని ధైర్యంగా ఎదిరించి 
విజయం సాధించే మనోశక్తి ఉండాలనే దృక్పథం పెంపొందించాలి.

నిరాశావాదులుగా...హింసావాదులుగా కాకుండా ఆశావాదులుగా...
అహింసావాదులుగా మార్చాలి.

మాతృభాషపై ప్రేమ...ప్రావీణ్యం... పెంపొందించి 
అన్ని భాషలు... 
సబ్జెక్టు లలో మెరుగుదలకు 
మాతృభాష మూలమనే 
ఎరుకను కలుగజేయాలి.

మాతృభూమి 
ఘనతపై 
అవగాహన కలిగించేలా...
దేశభక్తి పెంపొందేలా 
మన బోధనలో విషయాలు జోడించాలి.

విద్యార్థుల లోని ప్రతిభను గుర్తించి ప్రశంసించాలి.
మన పరిధిలో ప్రోత్సహించాలి.

విద్యార్థుల తల్లి /తండ్రులతో సత్సంబంధాలు కలిగి ...
విద్యార్థులతో 
వ్యక్తిగత సంబంధం కలిగి 
విద్యాప్రగతి...
బలాలు 
బలహీనతలు గమనించి 
పరిధికి లోబడి స్పందించాలి.

"జ్ఞానము"నేర్పించే విషయం కాదు...
అజ్ఞానం తొలిగిస్తే జ్ఞానం కలుగుతుంది.

అయితే "విజ్ఞానం" నేర్పించే విషయం

 కాబట్టి ఉపాధ్యాయులు 
నిరంతర విద్యార్ధులుగా 
విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకొంటుండాలి.

విద్యార్ధుల సామర్ధ్యానికి 
తగినరీతిలో 
మనం నేర్చుకొన్న విషయాలు 
వారికి అందించాలి.

"శ్రద్ధావాన్ 
లభతే జ్ఞానం" 


🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

నేటి మోటివేషన్... ధైర్యం పై చిన్న #కధ. )

ధైర్యంతో ప్రయత్నిస్తే సమస్తం నీ వశం. లక్ష్య సాధనకై ధైర్యంతో అడుగిడరా.... జయమ్ము నిశ్చయమ్మురా..... వ్యక్తి జీవిత పయనంలో విజయవంతం కావాలంటే ధైర్యమే మూలం. లక్ష్యాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ ధైర్యంతో కష్టపడి తే విజయం దానంతట అదే దాసోహమంటుంది. ధైర్యంతో అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. మన భయాలను దూరం చేసుకోవడానికి ధైర్యం అవసరం. సరైన ప్రణాళికతో కష్టపడితే విజయం తప్పక లభిస్తుంది. జీవితంలో ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనే ప్రయత్నిస్తారు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని ధైర్యంతో పని చేస్తే సమస్త శక్తి మనలోనే ఉంటుంది. దేనినైనా సాధించ గలుగుతాము. ధైర్యలక్ష్మి తోడుంటే ఇతర లక్ష్ములు ఏ విధంగా తోడు ఉంటాయో తెలిపే చిన్న కథను తెలుపుతాను. పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు. అతని రాజ్యం సమస్త ధనరాశులతో సిరి సంపదలతో తులతూగుతూ ఉండేది. అక్కడి ప్రజలందరూ ఎంతో ఆనందంగా జీవించేవారు. అతని రాజ్యం లో అష్టలక్ష్ములు స్థిరనివాసం ఏర్పరుచుకున్నాయి. ఒక నాడు అక్కడున్న అష్టలక్ష్ములకు ఆ రాజును పరీక్షించాలని అనిపించింది. అతని వద్దకు ఒక్కొక్క లక్ష్మి వచ్చి ఈ విధంగా అడగటం ప్రారంభించింది. "రాజా నేను రాజ్యం విడిచి వెళ్లాలనుకుంటు...