Skip to main content

SIR ఓటర్ మ్యాపింగ్ – తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు


SIR ప్రక్రియలో ప్రతి ఓటరు తన వివరాలను సరిగా మ్యాపింగ్ చేయించుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా వివాహం తర్వాత వేరే గ్రామం లేదా పట్టణానికి మారిన మహిళలు, అలాగే 2002 తర్వాత ఓటర్లుగా నమోదైన వారు తమ వివరాలను ఒకసారి తప్పకుండా పరిశీలించుకోవాలి.

వివాహం తర్వాత కొత్త ప్రాంతానికి మారిన మహిళల విషయంలో, వారు ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోని 2002 ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడం సహజం. అలాంటి సందర్భంలో, పుట్టిన ఊరిలోని 2002 ఓటర్ల జాబితాలో తల్లిదండ్రుల వివరాలు లేదా సంబంధిత కుటుంబ వివరాలను గుర్తించి, ఆ సమాచారాన్ని ప్రస్తుత ప్రాంతంలోని BLOకి అందించడం ద్వారా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

2002 ఓటర్ల జాబితా ప్రతి మండల తహసీల్దార్ కార్యాలయం ద్వారా సంబంధిత BLOలకు అందుబాటులో ఉంటుంది. అవసరమైతే మీ పుట్టిన ఊరి BLOని సంప్రదించి సంబంధిత వివరాలను తెలుసుకోవచ్చు.

SIR మ్యాపింగ్‌లో సాధారణంగా మూడు రకాల ప్రక్రియలు ఉంటాయి.

1. Self Mapping
   2002 జాబితాలో కూడా పేరు ఉండి, ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో కూడా అదే పేరు కొనసాగుతున్న వారికి ఇది వర్తిస్తుంది.

2. Add Progeny
   2002లో ఓటు హక్కు వయస్సు లేకపోవడం వల్ల పేరు నమోదు కాకపోయినా, ప్రస్తుతం ఓటరుగా ఉన్నవారు కుటుంబ సభ్యుల (తల్లిదండ్రులు లేదా తాతమ్మల) 2002 వివరాల ఆధారంగా ఈ మ్యాపింగ్ చేయించుకోవచ్చు.

3. Self Progeny
   2002లో ఓటు హక్కు వయస్సు ఉన్నప్పటికీ ఏదైనా కారణంతో పేరు నమోదు కాలేదంటే, కుటుంబ సభ్యుల 2002 రికార్డుల ఆధారంగా ఈ మ్యాపింగ్ చేయించుకోవచ్చు.

మ్యాపింగ్ కోసం BLOని కలిసే ముందు, 2002 ఓటర్ల జాబితాలో సంబంధించిన కుటుంబ సభ్యుల వివరాలు, పేజీ లేదా సీరియల్ నంబర్, అలాగే ప్రస్తుత ఓటర్ ID సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.

ఓటరు వివరాలు సక్రమంగా ఉండేలా చూసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. సందేహాలు ఉంటే సంబంధిత BLO లేదా ఎన్నికల అధికారులను సంప్రదించి సరైన మార్గదర్శకత్వం పొందండి.

Lakshya Educational Groups

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🎯 GENERAL ELECTIONS – ఓట్ల రకాలు పోటీ పరీక్షల ప్రత్యేక అధ్యయన మెటీరియల్ ముఖ్యమైన మల్టీపుల్ ఛాయస్ బిట్స్ తో పాటు.

భారతదేశ ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. అర్హత, విధులు, ఎన్నికల నియమాలను బట్టి ఈ పద్ధతులు మారుతాయి. 📌 1. ఎన్నికల్లో ముఖ్యమైన ఓట్ల రకాలు 1️⃣ Ordinary Vote – సాధారణ ఓటు సంబంధిత పోలింగ్ కేంద్రంలో ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునే సాధారణ విధానం. ప్రస్తుతం సాధారణంగా EVM ద్వారా ఓటు నమోదు చేస్తారు. 2️⃣ Postal Ballot – పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల నియమాల ప్రకారం అర్హత పొందిన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును నమోదు చేసే విధానం. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు ఉద్యోగులు, అర్హులైన సర్వీస్ ఓటర్లు, నిబంధనలకు లోబడిన ఇతర వర్గాలకు ఈ సదుపాయం ఉంటుంది. 3️⃣ EDC – Election Duty Certificate ఎన్నికల విధుల్లో ఉన్న అర్హుడైన ఉద్యోగి, తాను ఓటరుగా నమోదైన నియోజకవర్గంలోనే విధులు నిర్వహిస్తున్నప్పుడు, వర్తించే నిబంధనల ప్రకారం EDC ద్వారా ఓటు వేయవచ్చు. 4️⃣ Service Vote – సర్వీస్ ఓటు సాయుధ దళాలు, వర్తించే చట్టాల పరిధిలోని బలగాలు, భారతదేశం వెలుపల పనిచేస్తున్న అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు వంటి నిర్దిష్ట వర్గాలకు చెందిన సర్వీస్ ఓటర్లు వినియోగించుకునే ఓటు హక్కు. వర్తించ...