Skip to main content

నేటి మోటివేషన్... ఈ కధ చదవండి... ఇటువంటి వాళ్లున్న చోట వృద్ధాశ్రమం అవసరం రాదు.



తాత - మనుమడు 

🌞ఆ రోజు  ఒక పేరున్న రెష్టారెంట్ ముందు కారు లో సుమారు తొంబై దాటిన వారి తాతగార్ని నెమ్మదిగా చెయూత నిచ్చి నడిపించుకొని తీసుకు వచ్చాడు. ఓ మూల ఉన్న టూ సిట్టర్ టేబుల్ దగ్గరకు నడిపించుకుని  జాగ్రత్తగా కూర్చో బెట్టాడు.

చెప్పండి తాతగారు ! ఏంటి తింటారు ? అడిగాడు మనవడు.

🌞నాకు మటన్ చాలా ఇష్టం, కాని పళ్లు లేవుగా! ఎలా తింటాను అన్నాడు.
ఓస్ ! ఇంతే కదా ! అని బేరర్ ను పిలిచి, ఓ ప్లేట్  చాల మెత్తని మటన్ ఖైమా,  బాగుండాలని ఆర్డర్ పెట్టాడు. ఇదిగో! అది అయ్యేలోపు చికెన్ సూప్ ఫ్రెష్ గా పట్టుకు రా ! అని చెప్పాడు.
🌞ఐదు నిమిషాల్లో  చికెన్ సూప్ వచ్చింది!
ఆ మనుమడు ఒక తెల్లటి టవల్ ను తాతయ్య మెడ ముందు అమర్చి.... సూప్ నెమ్మదిగా స్పూన్ తో త్రాపిస్తున్నాడు. అయినా అది ఆబోసి నోరు చుట్టూ అంటుకుంది.  కర్చిఫ్ తో మూతి శుభ్రం చేసాడు. ఈ లోగా మటన్ ఖైమా వచ్చింది.
🌞తాతయ్యకు నెమ్మదిగా స్పూన్ తో తినడం వలన చాలా సమయం పట్టింది...! ఐనా విసుగు చెందకుండా నెమ్మదిగా తాతయ్యతో కబుర్లు చెబుతూ.... నానమ్మ పై జోకులు వేస్తూ తినిపించాడు. చనిపోయిన భార్య జ్ఞాపకాలు అంత అందంగా మనవడు గుర్తు చేసినందుకు, ఆ తాతయ్య కళ్లలో ఆనందం... ఓ పక్క కంటనీరు.
🌞రెష్టారెంట్ లో అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఆ కుర్రాడు ఏమాత్రం పట్టించుకోలేదు. బిల్ పే చేసి నెమ్మదిగా మరలా నడపించుకొని తీసుకు వెళ్లిపోయాడు.
కొడుకు, కోడలు చాలా మంచి వాళ్లు, జాగ్రత్తగా చూసుకుంటారు. ఆరోగ్యం పాడవుతుందని ఏది పడితే అది పెట్టరు. మనవడు అలా కాదు. వచ్చిన ప్రతీ సారి తాతయ్యను కార్లో వేసుకుని షికారు తిప్పడమే కాకుండా, చిన్న పిల్లలకు తినిపించినట్లు, ఐస్ క్రీమ్స్ , రక రకాల చిరుతిండి తినిపిస్తాడు. తండ్రి చెప్పినా వినడు! 
ఒక్కరోజుకు ఏం కాదు డాడీ.... నేను చూసుకుంటాను కదా అని.... రాత్రి పడుకునే ముందు జీర్ణం కావడానికి పళ్ల రసం, టాబ్లెట్ వేసేస్తాడు.
🌞మామూలు సమయంలో చాలాఇబ్బంది పడే పెద్దాయన.... చిత్రంగా మనవడు వచ్చినపుడు హుషారుగా ఉంటారు. ఒక్క కంప్లైంట్ కూడ ఉండదు. కొడుకు ముసి ముసిగా నవ్వుకుంటాడు. 
🌞ఓసారి ఉండలేక కొడుకుని అడిగాడు..,, ఏరా! వచ్చినపుడల్లా తాతయ్యను కుషీ చేస్తావ్ ! తాతయ్య అంటే అంత ఇష్షమా? 
దానికి కొడుకు చెప్పిన సమాధానం.... డాడీ ! నా చిన్నతనంలో అమ్మా, మీరు క్షణం తీరిక లేకుండా ఉద్యోగాల వలన బిజీగా ఉండేవారు. ఇంట్లో నాన్నమ్మ తాతయ్య, నా విషయంలో చాలా శ్రద్ధ చూపేవాళ్లు. తాతయ్యా ! ... నన్ను స్కూల్ నుండి తీసుకొని వస్తూ.... నేను ఏది అడిగితే అది కొనిచ్చి ముద్ధు చేసేవారు. ఒక్కోసారి నా బట్టలు పాడు చెసేవాడిని. తాతయ్య నాన్నమ్మ ఆ రోజులలో నాకు చేసిన సేవలు గుర్తున్నాయి. నేను ఏమిచ్చి వాళ్లను ఆనంద పరచ గలను. నానమ్మ ఇప్పుడు లేదుగా. అందుకే వచ్చిన  ప్రతిసారీ కనీసం తాతయ్య తో ఒక్కరోజైనా గడపి నా జ్ఞాపకాలు సజీవం గా ఉంచుకుంటాను అని చెప్పాడు.
🌞సమాధానం విన్న తండ్రి కళ్లలో నీళ్లు.... నీ జ్ఞాపకాల మాటేమో గాని... నీవు వచ్చిన వెంటనే తాతయ్య కళ్లలో ఉత్సాహం.. చూస్తుంటే నేను ఆయనకు ఎంత రుణపడి ఉన్నానో అర్ధం అవుతుంది. నాకు మీ అమ్మకు అందమైన వార్ధక్యం కళ్ల ముందు కనిపిస్తూంది...!

గమనిక :-డబ్బువెనుక పరుగులుపెట్టే ఈ కాలంలో  ఇలాంటి సంబంధ బాంధవ్యాలు కాపాడుకునే కుటుంబాలు మాత్రం నిజంగా స్వర్గధామాలే.... !అన్ని కుటుంబాలు కూడా ఇలాగే ఉండలని ఆశిస్తూ...!,

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🎯 GENERAL ELECTIONS – ఓట్ల రకాలు పోటీ పరీక్షల ప్రత్యేక అధ్యయన మెటీరియల్ ముఖ్యమైన మల్టీపుల్ ఛాయస్ బిట్స్ తో పాటు.

భారతదేశ ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. అర్హత, విధులు, ఎన్నికల నియమాలను బట్టి ఈ పద్ధతులు మారుతాయి. 📌 1. ఎన్నికల్లో ముఖ్యమైన ఓట్ల రకాలు 1️⃣ Ordinary Vote – సాధారణ ఓటు సంబంధిత పోలింగ్ కేంద్రంలో ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునే సాధారణ విధానం. ప్రస్తుతం సాధారణంగా EVM ద్వారా ఓటు నమోదు చేస్తారు. 2️⃣ Postal Ballot – పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల నియమాల ప్రకారం అర్హత పొందిన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును నమోదు చేసే విధానం. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు ఉద్యోగులు, అర్హులైన సర్వీస్ ఓటర్లు, నిబంధనలకు లోబడిన ఇతర వర్గాలకు ఈ సదుపాయం ఉంటుంది. 3️⃣ EDC – Election Duty Certificate ఎన్నికల విధుల్లో ఉన్న అర్హుడైన ఉద్యోగి, తాను ఓటరుగా నమోదైన నియోజకవర్గంలోనే విధులు నిర్వహిస్తున్నప్పుడు, వర్తించే నిబంధనల ప్రకారం EDC ద్వారా ఓటు వేయవచ్చు. 4️⃣ Service Vote – సర్వీస్ ఓటు సాయుధ దళాలు, వర్తించే చట్టాల పరిధిలోని బలగాలు, భారతదేశం వెలుపల పనిచేస్తున్న అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు వంటి నిర్దిష్ట వర్గాలకు చెందిన సర్వీస్ ఓటర్లు వినియోగించుకునే ఓటు హక్కు. వర్తించ...