అనగనగా ఒక ఊళ్ళో ఒక నది. ఆ నది ఒడ్డున రెండు పెద్ద చెట్లు. ఆ దారిన వెళుతున్న ఒక చిన్న పిట్ట తన పిల్లలకు చిన్నగూడు కట్టుకుందామనుకొని, మొదటి చెట్టు దగ్గరకు వెళ్ళింది.
' వర్షాకాలం వస్తోంది, నేనూ నా పిల్లలూ ఉండటానికి నీ కొమ్మ మీద గూడు కట్టుకోనా ? అని అడిగింది. ' వద్దు ' అనేసింది మొదటి చెట్టు.
ఆ పిట్ట చిన్నబుచ్చుకుంది. నిరశగా రెండో చెట్టు దగ్గరకు పోయి సహయం కోసం వేడుకుంది. ' సరే ' అంది రెండో చెట్టు.
ఆనందంగా ఎగిరి గంతులేస్తూ గూడుకట్టే పని మొదలుపెట్టింది పిట్ట. వానాకాలం వచ్చేలోపే రెండో చెట్టు మీద గూడు కట్టేసుకుంది. పిల్లలతో ఆనందంగా కాలం గడపసాగింది. ఈలోగా వర్షాకాలం వచ్చేసింది.
ఓరోజు వర్షం మొదలైంది. చూస్తుండగానే పెద్దదైంది. వరద రావడం మొదలైంది. ఆ వరదలో మొదటిరోజు కూకటివేళ్ళతో సహా కూలిపోయి, నీటిలో కొట్టుకునిపోతోంది. ఆ ధృశ్యాన్ని రెండో చెట్టు మీద కూర్చున్న పిట్ట చూస్తూ...' భగవంతుడు నీకు తగిన శిక్ష వేశాడు. నాకు సహయం చేయడానికి నిరాకరించావుగా ' అంది నవ్వుతూ. ' నేను బలహీనమైనదానినని నాకు తెలుసు. వరద వస్తే కొట్టుకోనిపొతానని కూడా తెలుసు. నాతోపాటు నీ గూడు కూడా కొట్టుకుపోకూడదనే నువ్వు గూడు కట్టుకునేందుకు నిరాకరించాను. నన్ను క్షమించు. పిల్లలతో పదికాలాలు సుఖంగా ఉండు ' అంది.
ఆ చిన్నపిట్ట గుండెలనిండా పశ్చాత్తపం.
( ఎవరైనా సహాయం చేయడానికి నిరాకరిస్తే తప్పుగా అనుకోకుడదు. వారు ఏ నిస్సహయ పరిస్థితిలో అలా చేశారో అర్దం చేసుకోవడానికి ప్రయత్నించాలి. )
Comments
Post a Comment