కొద్దిపాటి నిర్లక్ష్యం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుండి ఉప్పాడ వెళ్లే ప్రధాన రహదారి పై గత వారం రోజుల నుండి రోడ్డుపై పడి ఉన్న ఎర్ర మట్టి వల్ల వాహనదరులు పడుతున్న ఇబ్బంది, నిన్న ఉదయం లక్ష్య స్వచ్చంద సేవా సభ్యుల దృష్టికి రావడం జరిగింది... దాన్ని వాట్సాప్ స్టేటస్ లో ఉంచడం ద్వారా, జనతా ఫౌండేషన్ వారు కూడా స్పందించి, నిన్న సాయంత్రం రెండు సేవా సంస్థలు కలిపి దాన్ని పూర్తిగా, స్వయంగా శుభ్రం చేయడం జరిగింది...
మనకెందుకులే అనే భావన..
మనకేంకాదులే అనే సంకుచిత భావన పెరిగిన ప్రస్తుత తరుణంలో...
చిన్నపాటి పని కోసం...
టీమ్ లక్ష్య నిన్న సాయంత్రం..
ముందుగా అనుకున్నట్లుగా ఒంటరిగా అడగులు వేసింది...
ఆశయంతో వేసే అడుగుకు ఆచరణ ఎక్కువ...
చూస్తుండగానే ఒక్కొక్క అడుగు మా వద్ద ఆగాయి..
ఏమిటిది అంటూ ఆరాలు తీశాయి...
ఇంత మంచి కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటాం అంటూ...
మాటల్లో చెప్పలేని స్పూర్తితో ప్రతీ ఒక్కరు..
పలుగు, పార పట్టుకుని చూస్తుండగానే సమస్యపై పెద్ద యుద్ధమే చేసి..
సమస్యని చిటికెలో పరిష్కరించారు..
మేము కోరుకున్నది ఇదే...
మార్పు తీసుకురావాలనుకున్నాం..
చివరిగా ఒక్కమాట...
సమాజంలో మార్పు రావాలంటే...
ముందు మనం మారాలి...
అదే చేశాం...
మా స్టేటస్ చూసి ఈ కార్యక్రమంలో మాతో పాటుగా అడుగులు వేసిన జనతా ఫౌండేషన్ వారికి...మాకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ టీమ్ లక్ష్య సలాం చేస్తుంది...🙏
చెప్పామంటే..చేస్తామంతే..👍
🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ
Comments
Post a Comment