మృత్యువు వారికి తెలిసిన అత్యంత సన్నిహిత బంధువు..
అవహేళనలు.. ఛీత్కారాలు వారికి ఎప్పటినుండో వెంటవస్తున్న నేస్తాలు...
మౌనంగా వెళ్లదీస్తున్న ఆ బ్రతుకుల వెనుక.. అంతులేని ఆవేదన ఉంది.
గుండె చప్పుడు వెనుక.. మోయలేని భారం మోస్తున్న పసి హృదయాలూ అందులో ఉన్నాయి.. పాపం, వారికి తెలియదు, తప్పడగులు వేసింది తాము కాదని.. వారిని కన్నవారని..!
అయినా గుండె లోతుల్లో ఎక్కడో చిన్న ఆశ...
కాసింత ప్రేమ.. చిటికెడు ఆప్యాయత.. దొరక్కపోతాయా అని..!
నిండా అనుభవించని జీవితాలకి కూడా నిండు నూరేళ్లు నిండుతున్నాయి...
మృత్యువు వారి వెంట పరుగులు తీస్తోంది.. పరాచకం ఆడుతుంది...
ఏదో ఒకనాటికి ప్రతీ ఒక్కరికీ మరణం తప్పదని తెలుసు...
కానీ మరణిస్తామని తెల్సి కూడా ఆశగా జీవిస్తున్న 50 మంది (హెచ్.ఐ. వి) అభాగ్యుల మనసుని గెలవడానికి..
కాసింత ఓదార్పునివ్వడానికి.
వారి పెదవులపై చిరునవ్వులు పూయించడానికి..
టీమ్ లక్ష్య టీమ్ సంకల్పం తో కలిపి అడుగులు వేసింది..
పండుగ వస్తుంది... పోతుంది..
దానిలో ఏముంది..? ఈ పండుగను వారి జీవితాల్లో ఎంత అందంగా మార్చగలిగాము
ఈ రంగుల పండుగ హోళీ నాడు (29th మార్చి, సోమవారం) మన సభ్యులందరూ ఇచ్చిన హృదయ స్పందనను వారి జీవితాల్లో నిజమైన రంగుల వెలుగులను పంచాము...
నిన్న , వారిని కలిసాము...
మనసారా పలకరించాము... ధైర్యాన్ని పంచాము
వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు అందించి, తృప్తిగా భోజనం పెట్టి వచ్చాము...
గెలవడంలో గొప్పతనం ఏముంది మిత్రమా...
గెలిపించడంలోనే ఉంది అసలు మజా..
గెలిపించాలని ఆరాటపడే మానవ దైవాలని కలిసి ఈరోజు వారికి ధైర్యాన్ని ఇచ్చి వచ్చాము...
వివరాలు..
శంఖవరం,అన్నవరం,తొండంగి, కత్తిపూడి -పరిసర ప్రాంతాలలో గల దిగువ మధ్య తరగతి HIV బాధితులు (పిల్లలు మరియు పెద్దలు)
ఎక్కడ ఇచ్చాము.?..
రిఫరల్ హాస్పిటల్, కత్తిపూడి..
ఏమి ఇచ్చాము...
Nutrition food కిట్
గోధుమ పిండి 1కేజీ
చోడిపిండి 1కేజీ
బెల్లము 1కేజీ
కందిపప్పు 1కేజీ
వేరుశనగ ఉండలు 1ప్యాకెట్
సన్ ఫ్లవర్ నూనె 1కేజీ
ఖర్జూరం 1/2 కేజీ
మనసున సంకల్పించుకుని
ఆ చిన్నారులకు చేయూతను ఇవ్వాలని.
బాధను పంచుకుంటూ...
మమతను పెంచుకుంటూ
భరోసాను ఇవ్వాలని... బాధ్య త ను భుజాన వేసుకుని. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది
ఈ కార్యక్రమం గురించి చెప్పగానే..స్పందించిన ప్రతీ హృదయానికి.
సహకరించిన ప్రతీ మానవ దైవానికి...
టీమ్ లక్ష్య ప్రణమిల్లుతూ..
🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ
Comments
Post a Comment