Skip to main content

నేటి మోటివేషన్... నిజమైన నువ్వు



ఒక రాజసభకు ఒక అపరిచితుడు ఉద్యోగం అడగటానికి వచ్చాడు. “నీ విశేషం ఏంటి?” అని అడిగితే, “మనిషి అయినా, జంతువైనా నేను ముఖం చూసి వారి గురించి చెప్పగలుగుతాను.” అని చెప్పాడు.

రాజు అతడిని తన అశ్వశాలకు అధిపతిని చేశాడు. కొన్ని రోజుల తర్వాత రాజు అతడిని తనకు అన్నిటికంటే ప్రియమైన, ఖరీదైన గుర్రాన్ని చూపించి, అడిగాడు.

అప్పుడు అతను, “ఇది జాతిగుఱ్ఱం కాదు.” అని అన్నాడు. రాజు చాలా ఆశ్చర్యపోయాడు. 

అడవి నుంచి గుర్రపువాడిని పిలిపించి అడిగితే అతడు - “గుర్రం జాతిదే కానీ ఇది పుట్టంగానే దాని తల్లి చనిపోయింది. దీనిని ఆవు పాలు పోసి పెంచామ”ని చెప్పాడు.

రాజు తన ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ సంగతి ఎట్లా తెలుసు?” అని అడిగాడు. అప్పుడు అతడు- “ఇది గడ్డి తినేటప్పుడు ఆవులాగా తలకాయ కిందకని తింటుంది. 

జాతి గుర్రం అయ్యుంటే దాణా నోట్లోకి తీసుకుని తలెత్తి తినేది.” అని చెప్పాడు. రాజుకు అతడి కౌశలం చూసి చాలా సంతోషం వేసింది. 

అతడికి బోలెడు ధాన్యం, నెయ్యి, కోడ్లు, గుడ్లు, ఉపహారంగా పంపించాడు. అతడిని రాణి భవంతికి ఉద్యోగిగా పెట్టాడు.

కొన్ని రోజుల తర్వాత అతడు రాణీ గురించి అడిగాడు. అప్పుడు ఉద్యోగి చెప్పాడు- “ఆమె తీరుతెన్నులు, వ్యవహారం రాణి లాగానే ఉన్నాయి. 

కానీ, ఆమె పుట్టుకతో రాణి కాదు.” అని. రాజు కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టయింది. అతడు తన అత్తగారిని పిలిచి విషయం చెప్పాడు. 

అప్పుడు అత్తగారు అన్నది- “నిజం ఏంటంటే మీ నాన్నగారు మా వారిని మా అమ్మాయి పుట్టినప్పుడే సంబంధం అడిగాడు. 

కానీ, మా కూతురు పుట్టిన ఆరు నెలలకే చనిపోయింది. అప్పుడు మేము రాచసంబంధం కోసం ఒక వేరే పిల్లను తెచ్చి కూతురుగా పెంచుకున్నాము.

రాజు మళ్లీ తన ఉద్యోగిని అడిగాడు, “నీకు ఎట్లా తెలిసింది?” అని. అతను చెప్పాడు- “రాణి నౌకర్లతో వ్యవహరించే విధానం చాలా గ్రామ్యంగా ఉంది. 

ఒక కులీన వ్యక్తి ఇతరులతో వ్యవహరించే పద్ధతి ఒకటి ఉంటుంది. అది రాణిగారిలో ఎక్కడా లేదు. రాజు మరొకసారి ఇతడి దృష్టిలో నైశిత్యానికి సంతోషపడి చాలా గొర్రెలు, మేకలు కానుకగా ఇచ్చి తన దర్బారులో నియోగించుకున్నాడు

కొంతకాలం గడిచాక రాజు ఆ ఉద్యోగిని పిలిచి తన గురించి అడిగాడు. ఉద్యోగి, “నా ప్రాణాలకు అభయం ఇస్తే చెప్తాను.” అని అన్నాడు.

రాజు మాట ఇచ్చాడు. అతడు, “మీరు రాజూ కాదు, రాజు కొడుకూ కాదు. మీ వ్యవహారం రాజు లాగా లేదు.” అని అన్నాడు.

రాజుకు చాలా కోపం వచ్చింది. కానీ అభయం ఇచ్చేశాడు కదా. అందువల్ల నేరుగా తన తల్లిని పిలిచాడు. తల్లి అన్నది- “ఇది నిజమే నాయనా. 

నువ్వు ఒక రైతు కొడుకువు. మాకు పిల్లలు లేనందువల్ల నిన్ను దత్తత తీసుకుని పెంచుకున్నాము.” అని. 

రాజా ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ విషయం ఎట్లా తెలుసు?” అని అడిగాడు. అప్పుడు ఉద్యోగి- “రాజు ఎవరికైనా కానుకలు ఇస్తే వజ్రాలు, ముత్యాలు, నగలు, నట్రా ఇస్తారు.

కానీ మీరు గొర్రెలు, మేకలు, తిని తాగే వస్తువులు కానుకిస్తున్నారు. ఈ పద్ధతి రాజులది కాదు, రైతువారిదే అవుతుంది.” అన్నాడు.

మనిషి దగ్గర ఎంత ధనము, సంపదలు, సుఖము, సమృద్ధి, వైభవం, శక్తీ ఉన్నా ఇదంతా బయటికి కనిపించడానికే!

మనిషి యొక్క నిజమైన గుర్తింపు,
అతను వ్యవహరించే తీరులో ఉంటుంది.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺