Skip to main content

నేటి మోటివేషన్... సంతోషం : చిరునామా



మనిషి తాను జీవించినంతకాలం సంతోషంగా ఉండాలనుకొంటాడు. సంతోషం కోసమే అన్నం తింటాడు. సంతోషం కోసమే ఆటలాడుకుంటాడు, నిద్రపోతాడు. సంతోషం కోసమే పెళ్ళి చేసుకొంటాడు, పిల్లలు కావాలనుకొంటాడు. చేసే పని, కూసే కూత, రాసే రాత... అంతా సంతోషం కోసమే! ఇంతకూ సంతోషం ఎక్కడ దొరుకుతుంది అనేది విలువైన ప్రశ్న. సంతోషం చిరునామా కోసం మనిషి వెదకని చోటులేదు. చేయని ప్రయత్నం లేదు. అయినా సంతోషం గగన కుసుమంగా ఎందుకు ఉన్నదో మనిషికి అర్థం కావడంలేదు.

ప్రపంచాన్ని నడిపేది డబ్బు. డబ్బు లేకుండా ఏ మనిషీ జీవించలేడు. అది ఎంత ఎక్కువగా నిల్వ ఉంటే అంత సౌఖ్యంగా జీవించగలననుకుంటాడు. మనిషి. కానీ డబ్బు సంతోషాన్ని ప్రసాదిస్తుందా అంటే అనుమానమే. లోకంలో పుష్కలంగా ధనరాశులు పోగుచేసిన సంపన్నులెందరో ఉన్నారు. కానీ వారందరికీ సౌఖ్యం దొరకవచ్చునేమోగానీ సంతోషం దొరక్కపోవచ్చు. కనుక సంతోషానికి డబ్బు కారణం కాదు.

అధికారం ఉంటే సంతోషం ఉంటుందా అంటే, అదీ నమ్మకం లేదు. లోకంలో ఏకచ్ఛత్రాధిపత్యంతో అధికారాన్ని సొంతం చేసుకొని పాలించిన వారెందరో ఉన్నారు. వాళ్లు ఎల్లవేళలా సంతోషంగా ఉన్నారనే దాఖలాలు లేవు.

అందంగా ఉంటే సంతోషం ఉంటుందా? దానికీ రుజువు లేదు. ఎందరో అందగాళ్లు, సౌందర్యవంతులు మానసిక క్షోభలతో ఆత్మహత్యలు చేసుకొన్న చరిత్రలున్నాయి.

సకల విద్యలనూ ఆపోశన పడితే సంతోషం కలుగుతుందా అంటే అదీ సత్యం కాదు. ఎందరో విజ్ఞాన ఖనులైన మహానుభావులు అశాంతితో తనువులు చాలించారు.

కనుక *సంతోషానికి మూలం సంపదలు, అధికారం, చదువు, అందం కావని అనుభవపూర్వకంగా మనిషికి అర్థమైంది. సంతోషానికి ధనికులు, పేదలు అనే భేదం లేదు. అందం, చదువు అనే బేరీజులు లేవు. వయోభేదం లేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా మనిషికి స్వాధీనమై ఉండేది సంతోషం.*

పసిపిల్లలకు బొమ్మలతో ఆడుకోవడంలోనే సంతోషం. ఎదిగే పిల్లలకు ఆటపాటలతో గడపడం సంతోషం. యువకులకు తమ కలలను సాకారం చేసుకోవడమే సంతోషం. వృద్ధులకు తమ సంతానాన్ని చక్కగా చూసుకొంటూ ఉండటమే సంతోషం. కొందరికి ప్రకృతి ఆరాధన సంతోషం. కొందరికి తీర్థక్షేత్రాలను సందర్శించడం సంతోషం. కొందరికి సంగీతం వినడం సంతోషం. కొందరికి సృజన చేయడమే పరమానందం. ఇలా సంతోషానికి ఒక నిర్వచనం లేదు. ఒక ఉనికి లేదు. *ప్రపంచంలోని అణువణువులోనూ సంతోషం నిండి ఉంది. దాన్ని చూడగలగడమే మనిషి పని.*

పరిమిత సంపాదనతో అన్నవస్త్రాదులను సమకూర్చుకొని సంతోష జీవనం గడుపుతున్నవాళ్లెందరో ఉన్నారు. వాళ్లకు పూరి గుడిసెలైనా, పక్కా భవనాలైనా ఒక్కటే. రాజప్రాసాదాల వంటి విలాస భవనాల్లో హంసతూలికాతల్పాలపైన పడుకున్నా కొందరు ముళ్లపాన్పు మీద పడుకొన్నట్లే నిద్ర కరవై, దుఃఖ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. *ఉన్నంతలో గడుపుకొంటూ, తోటివారికి సహాయపడుతూ, దీనులపట్ల కారుణ్యాన్ని ప్రదర్శించేవారికి ఏ సంపదలతోనూ పని లేదు. సంపదలు ఎన్ని ఉన్నా ఎవరికీ ఏ విధంగా తోడ్పడని జీవితాలూ ఉన్నాయి.*

*మనిషి తన జీవితంలో అనుక్షణం సంతోషాన్ని ఆహ్వానించాలి. అసంతృప్తిని తరిమివేయాలి. కష్టాలకు, కడగండ్లకు, బాధలకు కుంగిపోరాదు. ఉన్నంతలో ఆనందాన్ని తోడుకోవాలి. ఆత్మీయులతో మనోభావాలను పంచుకొని సేదదీరాలి. అనవసరమైన భయాలను దరిజేరనీయరాదు. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. కోరి కోరి కష్టాలు తెచ్చుకోరాదు. నీతిమంతమైన జీవితానికి దారులు వేసుకోవాలి. అనుచిత సంపాదనకోసం అర్రులు చాచకూడదు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందించే స్ఫూర్తితో జీవితాన్ని అమృతమయం చేసుకోవాలి. మానసికోన్నతికి దారులను అన్వేషించాలి*. 

అంతర్యామితో అనుసంధానం కావాలి. అదే చిట్టచివరి

 సంతోషానికి చిరునామా!😅
 ఆనందం సంతోషం ఈ చిన్ని జీవితానికి ఆయురారోగ్యాలు
అందరమూ సుఖసంతోషాలతో
జీవితాన్ని గడుపుదాం.

    👍ఇదే జీవిత పరమార్ధం

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Post a Comment

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Flash flash.... AP Students Attendance App updated

Flash flash  Ap teacher's attendance app updated just now... In this update you have update your TIS details individually  Click here to get the update  Students attendance latest update link 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺