నీవు ఎందులోనైనా ఫెయిల్ అయివుంటే నీకు తెలుస్తుంది .......?
"నీవు ఫెయిల్ అయ్యావ అయితే నీవు రియల్ హీరో"
ఎందుకంటే నీవు ఏదో కొత్తగా సాధించాల్సిన అవసరం వుంది అనుకున్నావు. ప్రయత్నం చేశావు, కష్టపడ్డావ్ కానీ నీవు అనుకున్నది సాధించలేకపోయావ్.. అందుకే నీవు ఫెయిల్యూర్ అనుకుంటున్నావ్.
గుర్తుపెట్టుకో నీవు మరి కొన్నిసార్లు.....!!
ఫెయిల్యూర్ కావచ్చు.... ఎందుకంటే నీవు సాధించాలి అనుకున్నది ఇంతవరకు ఎవరు సాధించలేదు కాబట్టి.
నీవు ఒక అమ్మాయిని ప్రేమించావ్... ఆ అమ్మాయి నిన్ను వద్దు అనుకుంది.... అందుకే నీవు ఫెయిల్యూర్ అనుకుంటున్నావ్.
నీ ప్రేమ నిజమైతే నీవు భాదపడక తప్పదు.... ఎంత భాధపడాలి అంటే నీ ప్రేమని మరిచిపోయి నీప్రేమే నీ విజయానికి దారి చూపించేంత.
నీ చదువు అయిపోయింది... నీకు ఉద్యోగం దొరకడం లేదు నీ చుట్టూ ఉన్న అందరూ నిన్ను అవమానిస్తున్నారు కాబట్టి నీవు ఓడిపోయావు అనుకుంటున్నావ్.
నీవు ఫెయిల్యూర్ కాదు.... నీవు అనుకుంటే ఉద్యోగం దొరుకుంతుంది. కానీ నీలో ఉన్న కొన్ని ఆలోచనలు నిన్ను ముందుకు వెళ్ళకుండా ఆపుతున్నాయి.
నీ స్నేహితులు తమ స్వార్థం కోసం వాడుకుని నీతో అవసరం అయిపోయాక నిన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయారు కనుక నీవు ఫెయిల్యూర్ అని భావిస్తున్నావ్.
నీ స్నేహితులు నిన్ను నమ్మించి మోసం చేశారు... కానీ వాళ్ళు నీకు ఒక గుణపాఠం కూడా నేర్పించారు.
నీకోసం ఎవరురారు ఎలాంటి పరిస్థితినైనా నీవు ఒంటరిగానే ఎదుర్కోవలసి వుంటుంది.
మనం ఎపుడైనాసరే దేనిలోనైనా ఫెయిల్ అయితే అప్పుడు ఒకసారి ఆలోచించి ఓపికగా ఉండాలి. ఎందుకంటే మనం ఊహించని ఒక అవకాశం మనకోసం ఎదురుచూస్తుందని....!
Speech less
ReplyDelete