Skip to main content

నేటి మోటివేషన్... కుటుంబం విలువ చెప్పే గాలిపటం కథ...



🔸తండ్రీ కొడుకులు మేడపైకి ఎక్కి గాలిపటం ఎగరేస్తున్నారు.

🔸గాలిపటాన్ని ఎలా ఎగరేయాలో తండ్రి పిల్లవాడికి నేర్పిస్తున్నాడు. గాలిపటం బాగా ఎత్తుకు వెళ్లాక, దారాన్ని కొడుకు చేతికి అందించాడు తండ్రి.

🔸కొడుకు ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆ వెలుగులో తండ్రి మనసు ఉప్పాంగి పోయింది. కొంతసేపు దారాన్ని చేత్తో పట్టుకున్నాక కొడుకు తండ్రిని అడిగాడు.

🔸"నాన్నా దారంతో పట్టి ఉంచితేనే గాలిపటం అంత ఎత్తుకి ఎగిరిందే! దారాన్ని తెంపేస్తే ఇంకా ఎత్తుకు ఎగిరిపోతుంది కదా" అన్నాడు.

🔸తండ్రి నవ్వాడు. "దారాన్ని తెంపేద్దామా మరి?" అని అడిగాడు.

 🔸"తెంపేద్దాం నాన్నా" అన్నాడు కొడుకు ఎంతో ఉత్సాహంగా.

🔸ఇద్దరూ కలిసి దారాన్ని తెంపేసారు."టప్' మని దారం తెగిపోగానే గాలిపటం ఇంకా పైకి ఎగిరిపోయింది.

🔸అంతలోనే దారి తప్పి అటూ ఇటూ కొట్టుకుంటూ కిందికి పడిపోవడం మొదలుపెట్టింది! చివరికి ఎవరి మేడ మీదనో కూలిపోయింది.

🔸"ఇలా జరిగింది ఏంటి నాన్నా" అన్నాడు కొడుకు విచారంగా. దారం తెంపేస్తే గాలిపటం ఇంకా ఇంకా పైకి పోతుందనుకుంటే, కిందికొచ్చి పడిపోవడం ఆపిల్లాడికి నిరుత్సాహం కలిగించింది. తండ్రివైపు బిక్కమొహం వేసుకుని చూశాడు.

కొడుకును దగ్గరికి తీసుకున్నాడు తండ్రి. "గాలిపటానికి దారం ఉండేది. దానిని ఎగిరిపోనీయకుండా పట్టి ఉంచేందుకు కాదు. గాలి ఎక్కువైనా తక్కువైనా గాలిపటం తట్టుకుని నిలబడి, ఇంకా ఇంకా పైపైకి ఎగిరేలా చేసేందుకే" అని చెప్పాడు. 
మరో గాలిపటానికి దారం కట్టి ఎగరేసి కొడుకు చేతికి దారం అందించాడు.

🔸జీవితంలో కూడా మనకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. ‘కుటుంబం అనే బంధం లేకపోయి ఉంటే మనం ఇంకా ఏదో సాధించి ఉండేవాళ్లం అని!’

 🔸నిజానికి కుటుంబం అందించిన ప్రేమ, సేవ, సౌకర్యాల వల్లనే మనం ఈ మాత్రమైనా నిలబడి ఉన్నామని గ్రహించాలి.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

INDIAN POLITY - (Telugu / English)

1. అనేక రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ ప్రాంతాల పాలన, నియంత్రణకు సంబంధించిన పత్యేక నిబంధనలు భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్‌లో ఉన్నాయి? జ: అయిదవ 2. అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు ఉద్దేశించిన నిబంధన ఏది? జ: నిబంధన- 29 3. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం సాంస్కృతిక, విద్యాయపరమైన హక్కులు కల్పించారు? జ: నిబంధనలు - 29, 30 4. మతం ప్రాతిపదికన భారతీయ పౌరుడికి ప్రభుత్వ పదవిని తిరస్కరిస్తే అతడికి ఏ ప్రాథమిక హక్కును లేకుండా చేసినట్లవుతుంది? జ: సమానత్వపు హక్కు 5. ప్రాథమిక హక్కుల సిద్ధాంతం దేన్ని సూచిస్తుంది? జ: పరిమిత ప్రభుత్వం 6. మతం లాంటి అంశాల మీద వివక్షను నిషేధించడం (భారత రాజ్యాంగం నిబంధన-15) దేని కింద వర్గీకరించిన ప్రాథమిక హక్కు? జ: సమానత్వపు హక్కు 7. భారత రాజ్యాంగంలో అంతర్జాతీయ శాంతిభద్రతలను ఎక్కడ పేర్కొన్నారు? జ:  రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు 8. భారత రాజ్యాంగం ఏడో షెడ్యూల్‌లోని కేంద్ర జాబితాలో ఉన్న అంశం ఏది? జ: గనుల్లోనూ, చమురు క్షేత్రాల్లోనూ శ్రమను, భద్రతను క్రమబద్ధం చేయడం 9. భారత రాజ్యాంగం నిబంధన 164(1) ప్రకారం మూడు రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమానికి మంత్రి ఉండాలి....