Skip to main content

నేటి మోటివేషన్... మీ ఇద్దరి మధ్య ఉందా సహనం.. ఓర్పు....



భార్యా భర్తల మధ్య సహనం ఓర్పు ఉంటే ఆ
కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో
ఈ చిన్న కథ ద్వారా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను..... చదవగలరు.

మంచి ఎండలో ఒక మహిళ నీటిని చాలా దూరం నుండి కష్టపడుతూ
తెస్తోంది. రెండు బిందెలను ఇంటిముందు పెట్టి చిన్న బిందెతో నీటిని
తెస్తూ అందులో పోస్తోంది.
ఇంతలో ఆమె భర్త ఆకలితో ఎండలో చెమటలు కక్కుతూ లోనికి వచ్చాడు.
ఇంటి ముందు ఉన్న బిందెలను గమనించకుండా వాటిని కాలితో తన్నాడు.
బిందెలలో నీళ్ళన్నీ క్రింద ఒలికిపోయాయి.
కోపంతో రగిలిపోయిన అతను తన భార్య కోసం బయటనే నిలబడ్డాడు.
ఆమె రానే వచ్చింది. ఆమెను చూసి కోపంతో ఇలా అన్నాడు భర్త.
" అసలు నీకు బుద్ధుందా? నీళ్ళ బిందెలను వాకిలికి అడ్డంపెట్టి 
ఎలా వెళ్ళావు. ఆకలితో ఇంటికి వచ్చిన నాకు ఆ బిందెలను తన్నడం
వలన కాలికి దెబ్బ తగిలింది. నిన్ను మీ అమ్మ ఎలా కన్నదో! ఎలా పెంచారో!
తెలివితేటలు లేనిదాన్ని నాకు కట్టబెట్టారు." అన్నాడు.
" ఇక మాటలు చాలించండి.....ఇప్పుడుకూడా నేను నీటి బిందెను తెస్తుంటే
కనీసం అందుకోకుండా తెచ్చిపోసిన నీటిని కూడా క్రింద పడేశారు.
భార్య ఎంతకష్టపడి నీళ్ళు తెస్తుందో అని ఆలోచన కూడా లేదు మీకు.
పైగా మా పుట్టింటివారిని గురించి అంటారా? ఈ ఇంట్లో ఒక్క నిమిషం
కూడా ఉండను. మా పుట్టింటికే వెళ్ళిపోతాను." అంటూ ఏడుస్తూ
పుట్టింటికి వెళ్ళిపోయింది భార్య.

ఈ కథనే కాస్త సహనం ఉంటే ఎలా ఉంటుందో చూద్దామా!

నీళ్ళ బిందెలను చూడకుండా తన్నేసిన భర్త ఇలా అనుకున్నాడు.
" అయ్యో! ఎంత కష్టపడి ఈ నీటిని తెచ్చిందో పాపం. నేనే కాస్త
చూసి నడిచి ఉంటే బాగుండేది. ఇంటి పనితో సతమతమౌతూ
నాకు ఇబ్బంది కలుగకుండా నీళ్ళను కూడా తనే తెస్తుంది.
మళ్ళీ నీళ్ళు తేవడానికి వెళ్ళిందేమో ఎదురెళ్ళి నీళ్ళ బిందెను
అందుకుందాం"
భార్యకు ఎదురెళ్ళి నీటి బిందెను అందుకుని ఇలా అన్నాడు.
" పొరపాటున నీటిబిందెలను కాలితో తన్నేశాను. నువ్వేమీ
కంగారు పడకు. నీవు ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకో!
నేను వెళ్ళి నీళ్ళు తెస్తాను"
" అయ్యో! ఎండన పడి వచ్చారు. నేను దారికి అడ్డంగా పెట్టడమే
తప్పండి. నీళ్ళే కదా పోతే పోనీయండి. భోజనం వడ్డిస్తాను
కాళ్ళు కడుక్కుని రండి. సరేలెండి......బిందె తగులుకుని
కాలికి దెబ్బేమీ తగల్లేదుకద! " అంది భార్య.
భార్యభర్తల్లో ఎవరూ కావాలని తప్పు చేయరు. తెలిసో తెలియకో
చేసిన తప్పులను ఒకరికొకరు అర్థం చేసుకుని పిల్లలకు
ఆదర్శంగా జీవించగలిగితేనే జీవితానికి అర్థం పరమార్థం.
కాస్త సహనంతోనే జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్ధుకోవచ్చు కదా...

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺