Skip to main content

నేటి మోటివేషన్... నాన్న చేసిన త్యాగాలు



ఒక రోజు ఒక పిల్లాడు తన నాన్నతో కలిసి జాతరకు వెళ్ళాడు.👨‍👦 


కొడుకును జాతరంతా తిప్పి చూపించి సంతోష పరచాలని నాన్న ఆలోచన. 
.జాతరలో మంచి మంచి బొమ్మలు, వస్తువులు కొనుక్కుని తన స్నేహితులకు చూపించి నాన్న కొనిచ్చడాని చెప్పుకొని ఆనందం పొందాలని కొడుకు ఆలోచన.
పుత్రునికి జాతర విశేషాలు వివరిస్తూ మెల్లగా నడుస్తున్నాడు నాన్న. 
ఇంకా తనకి బొమ్మలు ఏవి కొనిపెట్టలేదని మనసులో ఆందోళన పడుతున్నాడు పిల్లాడు. 
తన దగ్గర ఉన్న డబ్బుతో ఏమి కొనివ్వగలనా అని ఆలోచిస్తున్నాడు నాన్న. 
పిల్లాడికి ఒక బొమ్మ నఛ్చి కొనిమ్మన్నాడు. 
జేబులో ఉన్న డబ్బు చూసి , ఇంకొకటి కొందాం ,పద ముందుకు అన్నాడు నాన్న. 
అలా పిల్లాడికి నచ్చిన బొమ్మలు కొనలేని తన స్థితిని మనసులోనే తిట్టుకుంటూ , తన దగ్గర ఉన్న డబ్బుతో కొనగల బొమ్మల కోసం నాన్న చూస్తున్నాడు. 
పిల్లాడు జాతరలో కనిపించిన బొమ్మలన్ని కొనేస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాడు. 
నాన్న మీద మెల్లగా కోపం ప్రారంభమైంది. 
నాన్న తనకు అడిగిన వస్తువులు కొనివ్వడం లేదు. ఎందుకు తీసుకొచ్చినట్లు? 
ఉన్న డబ్బు అంతా పిల్లాడి బొమ్మలకు ఖర్చు పెడితే ఇంట్లో వస్తువుల మాటేమిటి అని నాన్న ఆందోళన. ఏదైనా బొమ్మ కొని కొడుకును సంతోషపెట్టాలని నాన్న మనసులో ఆరాటం. 
ఇంతలో ఎవరో నాన్నను పలకరించారు. పిల్లాడి చేయి వదిలి నాన్న మాట్లాడుతున్నాడు. జాతరలో జనం పెరిగారు.
 పిల్లాడు నాన్నను గమనించకుండా ముందుకెళ్లిపోయాడు. 
వెనక్కి తిరిగి చూస్తే నాన్న కనిపించ లేదు.
భయం కలిగింది. 
కన్నీళ్లు వచ్చాయి. 
ఏడుపు మొదలైంది. 

అందరూ పోగయ్యారు.
 బొమ్మలిస్తాం ఏడవద్దు అన్నారు. 
బొమ్మలొద్దు నాన్న కావాలి అన్నాడు. 
తినుబండారాలు ఇఛ్చి ఏడవద్దు అన్నారు. 
నాన్న కావాలి అన్నాడు.
ఎవ్వరు ఏమి చెప్పినా ఏడుపు ఆగలేదు.
బొమ్మలు కొనివ్వలేదని మనసులో నాన్నను తిట్టుకున్న పిల్లాడు బొమ్మలగురించి ఆలోచించడం లేదు.
నాన్న కావాలి 
అంటూ ఏడుస్తున్నాడు. 

కొడుకును వెదుక్కుంటూ చేరిన నాన్నను చూసి ఆనందంగా అక్కున చేరిపోయాడు ఆ పిల్లాడు.
బొమ్మలు కొందాం పద అన్నాడు నాన్న. 

వద్దు నాన్న ! నువ్వెప్పుడూ నా చేయి విడవొద్దు . ఇంటికెళదాం పద 
అన్నాడు కొడుకు. 

నాన్న ఉంటే భరోసా
నాన్న ఉంటే ధైర్యం
క్రొవ్వొత్తిలా కరుగుతూ వెలుగునిచ్ఛే వాడు నాన్న!
రాళ్ళ దెబ్బలు తిని పళ్ళు ఇచ్ఛే చెట్టులాంటి వాడు నాన్న!
వేలు పట్టి నడిపించేవాడు!
వేలు ఖర్చు పెట్టి చదివించేవాడు!!
మన విజయం కొరకు తపించేవాడు!!!
నాన్న చేసిన త్యాగాలు
నాన్న గొప్పతనం 
నాన్న బాధ్యత
ఎన్ని చెప్పుకున్నా తక్కువే

 నాన్నా!
మళ్ళీ బాల్యం వెనక్కి తీసుకొనేలా అవకాశం వస్తే నీ మనసు నొప్పించకుండా నీ చేయి పట్టుకుని నడుస్తాను నాన్నా!

పిల్లలను ప్రేమించే ప్రతి తల్లితండ్రులకు అంకితం

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Post a Comment

Popular posts

నేడే ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) ప్రకటన ప్రకారం, 2026 మే/జూన్‌లో నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం (జనరల్ & వొకేషనల్) అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ 11, 2026న ఉదయం 11:30 గంటలకు విడుదల కానున్నాయి. ఫలితాలు అందుబాటులో ఉండే వెబ్‌సైట్లు: tgbie.cgg.gov.in results.cgg.gov.in విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET - PSYCHOLOGY IMPORTANT 100 bits for you

TET చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగాజీ: పార్ట్ 1 (బిట్స్ 1 – 100)  1. పెరుగుదల అంటే? — పరిమాణాత్మక మార్పు  2. వికాసం అంటే? — గుణాత్మక + పరిమాణాత్మక మార్పు  3. పరిపక్వత అంటే? — సహజ జీవసంబంధ ప్రక్రియ  4. వికాసం ఎలాంటి ప్రక్రియ? — నిరంతర ప్రక్రియ  5. తల నుండి కాళ్ల వరకు వికాసం ఏ సూత్రం? — శిరోపాద సూత్రం  6. కేంద్రం నుండి పరిధి వైపు వికాసం ఏ సూత్రం? — ప్రాక్సిమో-డిస్టల్ (సమీప దూరస్థ సూత్రం)  7. శిశు వికాసానికి కారణాలు? — వారసత్వం, పరిసరాలు  8. బాల్యదశను ఏమంటారు? — సామాజీకరణ దశ  9. కౌమార దశను ఏమంటారు? — పరివర్తన దశ  10. శిశువు మొదటి గురువు ఎవరు? — తల్లి  11. జ్ఞానాత్మక వికాస సిద్ధాంతకర్త? — పియాజే  12. పియాజే వికాస దశలు ఎన్ని? — 4  13. Sensorimotor (ఇంద్రియ చాలక దశ) వయస్సు? — 0–2 సం.  14. Preoperational (పూర్వ ప్రచాలక దశ) వయస్సు? — 2–7 సం.  15. Concrete Operational (మూర్త ప్రచాలక దశ) వయస్సు? — 7–11 సం.  16. Formal Operational (అమూర్త ప్రచాలక దశ) వయస్సు? — 11+ సం.  17. Object Permanence (వస్తు స్థిరత్వ భావన) ఏ...

TET- PSYCHOLOGY REVISION BITS PART - 2

101. ప్రజ్ఞ అంటే? — సమస్య పరిష్కార సామర్థ్యం   102. ప్రజ్ఞను తీర్పు శక్తిగా నిర్వచించినవాడు? — బినెట్   103. వ్యక్తిత్వం అంటే? — సమగ్ర లక్షణాల సమాహారం   104. Trait Theory ఎవరిది? — ఆల్పోర్ట్   105. 16 Personality Factors ఎవరిది? — క్యాటెల్   106. Introvert ఎవరు? — ఒంటరిగా ఉండేవాడు   107. Extrovert ఎవరు? — సమాజంలో కలిసేవాడు   108. Ambivert అంటే? — రెండు లక్షణాల సమ్మేళనం   109. Learningను ప్రభావితం చేసేది? — ఆసక్తి   110. Behaviourను ప్రభావితం చేసేది? — వైఖరి   111. అభిరుచి అంటే? — ప్రత్యేక ఆకర్షణ   112. Aptitude ఏమి సూచిస్తుంది? — భవిష్యత్ విజయం   113. Achievement Test ఏమి కొలుస్తుంది? — నేర్చుకున్నది   114. Aptitude Test ఏమి కొలుస్తుంది? — భవిష్యత్ సామర్థ్యం   115. Personality Test ఏమి కొలుస్తుంది? — వ్యక్తిత్వం   116. Inkblot Test ఎవరిది? — రోర్షాక్   117. TAT రూపొందించినవాడు? — ముర్రే   118. Creativity ప్రధాన లక్షణం? ...