Skip to main content

Posts

నేటి మోటివేషన్... అర్థాన్ని' సంపాదించితే అనర్థమే

ప్రతి ఒక్కరు త‌ప్పక చ‌ద‌వండి... ------------------------------------ ఒక వ్యాపారి చాలా సంవత్సరాలుగా భవనాలు, ఇతర కట్టడాలు నిర్మించే వృత్తిలో ఉండేవాడు. తనకు సహాయంగా ఒక వ్యక్తిని పర్యవేక్షకుడిగా నియమించుకున్నాడు. దాదాపు పాతిక సంవత్సరాలు ఆ పర్యవేక్షకుడు ఆ వ్యాపారి దగ్గర నమ్మకంగా పనిచేశాడు. ఒకరోజు ఆ వ్యాపారి అతణ్ని పిలిచి ''మనం ఇపుడు ఒక భవంతిని నిర్మించాలి. ఎంత ఖర్చయినా ఫరవాలేదు. ఆ భవనం 'నభూతో న భవిష్యతి' అనే రీతిలో అద్భుతంగా ఉండాలి'' అన్నాడు. అలాగేనన్న పర్యవేక్షకుడు మనసులో మాత్రం, 'నేను ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా, విశ్వాసంగా పనిచేశాను. నాకు ఏం మిగిలింది- ఆయన నెలనెలా ఇచ్చే జీతం రాళ్ళు తప్ప. అంచేత ఈ భవన నిర్మాణానికి కేటాయించిన చాలా భాగం డబ్బు సొంతం చేసుకుంటాను' అనుకున్నాడు. అలా తలచిన ఆ వ్యక్తి ఆ భవనాన్ని చౌకగా దొరికే ముడిసరకులతో నిర్మించి పైకి మాత్రం కళాత్మకంగా ఉండేలా వివిధ నగిషీలతో శిల్పాకృతులతో తీర్చిదిద్దాడు. పైకి అద్భుతంగా కనిపిస్తూ బలహీనంగా తయారైన ఆ భవనాన్ని తన యజమానికి చూపించాడు. యజమాని ఆనందపడుతూ, ''మిత్రమా ఈ భవంతి మహత్తరంగా ఉంది. ఇన్నాళ్లు నమ్మకంగ...

నేటి మోటివేషన్... నీ జీవితం మీద నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి...

మనం జీవితంలో పైకెదగాలి అంటే.. ముందు మనకంటూ ఓ వ్యక్తిత్వం ఉండాలి.. మనం అంటే ఏంటో మన చుట్టుపక్కల వాళ్లకు ఓ అవగాహన వచ్చేలా మన ప్రవర్తన ఉండాలి. అబ్బో వాడు చాలా ఖతర్‌నాక్ గురూ..  వాడి దగ్గర మన ఆటలు సాగవు.. అని వాళ్లు అనుకునేలా మన బిహేవియర్ ఉండాలి.🌲😍 అంతే కానీ.. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేసేలా ఉండకూడదు. ఎంతటి ఆప్తులైనా సరే.. వాళ్లు చెప్పేదాంట్లో వాస్తవం ఎంతవరకూ ఉందనే విషయంపై మనంకూట సొంత అంచనా ఉండాలి. లేకపోతే.. మనల్ని బురిడీ కొట్టించడానికి జనం రెడీగా ఉంటారు. మరో విషయం ఏంటంటే.. మనలో చాలా మంది ఒకరి గురించి మరొకరికి చెడుగా మాట్లాడుకుంటారు., ఇక ఇద్దరు ఒకచోట కలిస్తే.. మన ముందు లేని వ్యక్తుల గురించి చెడుగా మాట్లాడుతుంటారు చాలా మంది. ఇలాంటి వాళ్లు మన మధ్య చాలా మందే ఉంటారు. ఒకరి గురించి నీకు ఒకడు చెబుతున్నాడు అంటే నీ గురించి మరొకరికి చెబుతాడు కదా.. ఈ లాజిక్ అస్సలు మిస్ కావద్దు. అందుకే జీవితంలో ఎప్పుడైనా మన సొంత అవగాహన మనకు ఉండాలి.,☘️ అందుకే ఎవరైనా ఏదైనా చెప్పినా.. దానిలో మంచి చెడు బేరీజు వేసుకోవాలి. వాస్తవానికి.. చాలామంది తామేదో పెద్ద తోపులం అనుకుంటారు కానీ.. వాస్తవానికి వాళ్లు చాలా అమాయకుల...

నేటి మోటివేషన్... మనిషి విలువ నోరు చెబుతుంది "

చక్కనికథ  ఒకసారి  విక్రమాదిత్య మహారాజు తన సైనికులతోను, మంత్రితోను కలిసి వేటకై అడవికి వెళ్ళాడు.      వేటాడుతూ ...... వేటాడుతూ .......  అడవిలో ఒకరికొకరు దూరమైనారు.  ఒకచోట చెట్టు క్రింద నీడలో అంధుడు, వృద్ధుడు అయిన ఒక సాధువు కూర్చొని ఉండగా ........ అతన్ని చూసిన విక్రమాదిత్యుడు ......  " సాధు మహరాజ్........ ఇటువైపుగా ఎవరైనా ఇంతకుముందు వెళ్ళారా....... ? అని అడిగాడు. ఆ అంధ సాధువు ఇలా అన్నాడు:  " మహారాజా......! అందరికంటే ముందు మీ సేవకుడు వెళ్ళాడు. అతని వెనుక మీ సేనా నాయకుడు వెళ్ళాడు. సేనానాయకుని తరువాత మీ మంత్రి  కూడా ఇంతకుముందే వెళ్ళాడు " అంధుడైన ఆ సాధువు చెప్పిన సమాధానం విని విక్రమాదిత్యుడు ఆశ్చర్యంతో, ఆసక్తితో ......   " మహాత్మా........ మీకు నేత్రాలు కనిపించవు కదా!  నా సేవకుడు, సేనానాయకుడు, మంత్రి ఇక్కడినుండి ఇప్పుడే వెళ్లినట్లు ఎలా గ్రహించారు? నేను రాజునైనట్లు కూడా ఎలా కనుగొన్నారు....? " అని అడిగారు . అంధుడైన సాధువు ఇలా చెప్పాడు:  " మహారాజా....!  నేనా ముగ్గురినీ, మిమ్ములను  మీ మాటలు విని కనిపెట్టాను.  అందరి...

నేటి మోటివేషన్... మీ చిన్నప్పుడు చదవకపోతే... ఇప్పుడైనా చదవండి...

ఒక రోజు ఒక అడవిలో వేటకు బయలుద్యారిన పులికి ఒక ఆవు కనిపించింది. ఆ ఆవు ప్రశాంతంగా అడవిలో గడ్డి మేస్తోంది. ఆ ఆవుని చూడగానే పులికి నోరూరుంది. ఈ రోజు ఆవు భోజనం బాగుంటుంది అని నిశ్చయించు కుంది. ఆ ఆవు పైబడ డానికి రెడీ అవుతుంటే ఆవు చూసింది. “ఆగండి పులిగారు, ఆగండి!” అని గట్టిగా కేక పెట్టింది. పులి నిర్ఘాంత పోయింది. ఇంత వరకు ఏ జంతువూ పులిని ఆగమని అడగలేదు. జంతువులు భయ పడడం, పరుగు పెట్టడం, వాటిని వేటాడడం, పులికి తెలుసు. కాని ఇలా ఆగమనడం? ఇది కొత్త విషయం. సంగతేంటో తెలుసుకుందామని పులి ఆగింది. “అడగ గానే ఆగినందుకు థాంక్స్, మీకు అడ్డు పడినందుకు క్షమించండి.” అంది ఆవు. “విషయం ఏమిటో చెప్పు” అంది పులి. “నాకు ఇంట్లో ఒక దూడ ఉంది. నేను రోజు పొద్దున్నే ఆ దూడకి పాలు ఇచ్చి, ఈ అడవిలోకి వచ్చి, రోజంతా గడ్డి మేస్తాను. సాయంత్రం మళ్ళి వెళ్లి దూడకు పాలిస్తాను. రోజు లాగానే ఈ రోజు కూడా దూడతో సాయంత్రం మళ్ళి వస్తానని, పాలు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు వెళ్లక పొతే నా దూడకు పాలుండవు. జీవితమంతా అమ్మ ఏమైంది అని ఆలోచిస్తూ వుంటుంది నా బిడ్డ. మీరు నాకు ఒక్క పూట గడువిస్తే నేను ఇంటికి వెళ్లి దూడకి పాలిచ్చి, జరిగిందంతా చెప్పి, మళ్ళీ పొ...

నేటి మోటివేషన్... నాన్నలందరికి అంకితం

SALUTE TO ALL FATHERS  నాన్న_మనకోసం  ఏం_చేశాడో  ఏం_కోల్పోయాడో   మనకు_తెలియదు..! జీవితాంతం పిల్లల కోసం తపిస్తూ, వారి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తండ్రి.  తండ్రి తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో  కోల్పోతాడు.  నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు.  ఎందుకంటే.. నాన్న ఎవరికీ చెప్పడు. పిల్లలకి, భార్యకి అసలు చెప్పడు.  అమ్మలా ప్రేమను బయటికి చూపించడం నాన్నకు రాదు.  నాన్న ఇంటికి ఎప్పుడో వస్తాడు, వెళ్లిపోతాడు.  బిజీగా ఉన్న నాన్న రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు.  ‘ఎప్పుడూ పనేనా? కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా..’ అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం.  పిల్లలు కూడా నాన్నను మిస్‌ అవుతుంటారు.  నిజానికి నాన్నను నాన్నే మిస్‌ అవుతుంటాడు.  పెళ్లై, పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు.  మనందరి కోసం నాన్న రాత్రి, పగలు పనిచేయాలి.  చదువులు, సమస్యలు, బంధువులు, పండగలు, బర్త్‌డేలు, ఆసుపత్రులు.. వీటన్నింటితో నాన్న నలిగిపోతుంటాడు. ఆయనకు ఆరోగ్య సమస్య...