Skip to main content

నేటి మోటివేషన్... అర్థాన్ని' సంపాదించితే అనర్థమే




ప్రతి ఒక్కరు త‌ప్పక చ‌ద‌వండి...
------------------------------------
ఒక వ్యాపారి చాలా సంవత్సరాలుగా భవనాలు, ఇతర
కట్టడాలు నిర్మించే వృత్తిలో ఉండేవాడు. తనకు సహాయంగా
ఒక వ్యక్తిని పర్యవేక్షకుడిగా నియమించుకున్నాడు.
దాదాపు పాతిక సంవత్సరాలు ఆ పర్యవేక్షకుడు ఆ వ్యాపారి
దగ్గర నమ్మకంగా పనిచేశాడు. ఒకరోజు ఆ వ్యాపారి అతణ్ని పిలిచి
''మనం ఇపుడు ఒక భవంతిని నిర్మించాలి. ఎంత ఖర్చయినా
ఫరవాలేదు. ఆ భవనం 'నభూతో న భవిష్యతి' అనే రీతిలో
అద్భుతంగా ఉండాలి'' అన్నాడు. అలాగేనన్న
పర్యవేక్షకుడు మనసులో మాత్రం, 'నేను ఇన్ని
సంవత్సరాలు నమ్మకంగా, విశ్వాసంగా పనిచేశాను.
నాకు ఏం మిగిలింది- ఆయన నెలనెలా ఇచ్చే జీతం రాళ్ళు తప్ప.
అంచేత ఈ భవన నిర్మాణానికి కేటాయించిన చాలా
భాగం డబ్బు సొంతం చేసుకుంటాను' అనుకున్నాడు. అలా
తలచిన ఆ వ్యక్తి ఆ భవనాన్ని చౌకగా దొరికే ముడిసరకులతో
నిర్మించి పైకి మాత్రం కళాత్మకంగా ఉండేలా వివిధ నగిషీలతో
శిల్పాకృతులతో తీర్చిదిద్దాడు. పైకి అద్భుతంగా
కనిపిస్తూ బలహీనంగా తయారైన ఆ భవనాన్ని తన యజమానికి
చూపించాడు.

యజమాని ఆనందపడుతూ, ''మిత్రమా ఈ భవంతి మహత్తరంగా
ఉంది. ఇన్నాళ్లు నమ్మకంగా పనిచేశావు... నేను ఈ
వ్యాపారం వదిలి వేరే దేశం వెళ్లిపోతున్నాను. అత్యంత
విశ్వాసపాత్రుడిగా ఇన్ని సంవత్సరాలుగా నన్నే అంటిపెట్టుకొని
ఉన్న నీకు అపురూపమైన జ్ఞాపికలా మిగిలిపోయే ఒక అద్భుతమైన
కానుకను ఇవ్వాలనుకున్నాను. ఈ భవంతి నీకోసమే!''
అంటూ భవనాన్ని అప్పగించి వెళ్ళిపోయాడు. ఆ యజమాని వెళ్ళిన
కొద్దిసేపటికి ఆ పర్యవేక్షకుడు కుప్పకూలిపోయాడు. త్వరలో
కూలబోయే ఆ భవనంలాగే.

మనిషి ధర్మం తప్పకూడదనీ, తుది శ్వాస వరకూ దాన్ని
విడిచిపెట్టరాదనీ, అధర్మంగా 'అర్థాన్ని' సంపాదించితే అనర్థమే
తప్ప ఏ పరమార్థమూ నెరవేరదనీ ఈ కథలోని నీతి.....

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

నేటి మోటివేషన్... హ్రుదయం కదిలించే చిన్ని కథ.

రవి సాప్ట్వేర్ ఇంజినీర్. భార్య డెలివరీకి వెళ్ళింది. అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుని చేరాడు. స్వయంపాకం చేసుకుంటాడు.  ఆరోజు ఆదివారం. పోర్టికోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. "ఆకు కూరలు... ఆకు కూరలు" అని కేక వినిపించింది. డెబ్బై ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకుని కనిపించింది. పిలిచాడు. "కాస్త గంప దించయ్యా" అన్నది ఆమె. "పాలకూర కట్ట ఎంత?" అడిగాడు.  "పది రూపాయలకు మూడయ్యా" చెప్పింది అవ్వ. "మరీ అన్యాయం... బయట అయిదు ఇస్తున్నారు" అన్నాడు చిరుకోపంగా "నాలుగు తీసుకో నాయన.." కట్టలు తీసింది అవ్వ. పదిరూపాయలు ఇచ్చాడు. "గంప కాస్త పట్టయ్యా" అన్నది అవ్వ తనవైపు పట్టుకుని. గంపను పైకి లేపుతూ రెండు కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు రవి. అవ్వ వెళ్ళిపోయింది. "ఎంత ఆశో ఈ ముసలిదానికి... ఇవాళో రేపో చావబోతుంది... ఇంకా మూటలు కడుతున్నది" ముసిముసిగా నవ్వుకున్నాడు. అప్పటినుంచి అవ్వ వచ్చినపుడల్లా గంప ఎత్తడానికి సాయం పడుతూ ఒక బీర...