పెద్దవారు ‘వయసు పోతే తిరిగి రాదు’ అని ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. నిజంగానే వయసులోనే ఆనందం ఉంటుందా? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు కాక ఇంకెప్పుడు తప్పక ఆలోచించాలి. ఎందుకంటే.. వయసు క్షణం ఆగదు. మనమే దానితో పోటీ పడాలి. అందుకే ఈ ప్రశ్న.. మనం ఏ వయసులో ఎక్కువ హ్యాపీగా ఉంటాం?
1-8
‘నేను క్రికెటర్ అవుతా.. కలెక్టర్ని అయిపోతా’ అంటూ.. ఆడిందే ఆట... పాడిందే పాట. భయం ఉండదు. భరోసాతో పని లేదు. ఎంత స్వచ్ఛమైన వయసు!!
8-14
‘నేను చేసుకోగలను. నాకు తెలుసు’ అని స్వతంత్రంగా ఆలోచించే పరువం.. కొత్త పరిచయాల కోసం వెతకడం. వారితో అన్నీ పంచుకోవడం.. స్వీట్ టీన్స్‌లా విచ్చుకునే వయసులో ఎన్ని పరిమళాలో..!!
14-18
సమాజంతో వై-ఫైలా కనెక్ట్ అయ్యే వయసు.. అనుభవాల బ్లూటూత్ నెట్‌వర్క్ కోసం అన్వేషించడం. ఆకర్షణ గాలానికి చిక్కకుండా గోల్స్ వైపు దృష్టి మళ్లించడం. విన్నింగ్ పాస్‌వర్డ్ కోసం ఎథికల్ హ్యాకర్‌లా ప్రోగ్రామింగ్ చేసే వయసులో ఎన్ని ట్విస్ట్‌లో..!!
18-25
సెల్ఫ్ లవ్ మొదలయ్యే దశ. వాస్తవాలతో ఒంటికి అంటిన ఆకర్షణని ఫార్మెట్ చేసే వయసు. బిజీగా ఉన్న కూడలిలో నిలబడి మీ గమ్యం ఎటో తెలుసుకునే క్రమం.. ప్రయత్నాలతో పడుతూ.. లేవడం.. ఆ కిక్కే వేరప్పా!
25-35
జీవితాన్ని పంచుకోవడంలో తీపిని గ్రహించే వయసు.. ఉద్యోగం.. ఉన్నత శిఖరాలు.. విహారాలు.. ప్రపంచం చాలా పెద్దదని తెలుసుకునే విశాలత్వం.. ప్రయాణం కంటే.. గమ్యాన్ని చేరాలనుకునే ఉత్సాహంలో ఎన్ని ఆశలో..!!
35-45
వృక్షంలా నీడగా మారే దశ.. తప్పులు చెప్పడం.. క్షేమాన్ని కోరడం.. విలువల్ని పంచడం. గమ్యం కంటే.. ప్రయాణం ముఖ్యమనే వయసు. అనుభవాల ఆనందం అంతా.. ఇంతా కాదు!!
45-65
అందర్లోనూ మనల్నే చూసుకుంటూ.. ఇంట్లో అందరితో ఆడుకునే వయసు. జ్ఞాపకాలతో రిలాక్స్ అయ్యే ముఖంలో ఎంత సంతృప్తో!!!
Comments
Post a Comment